నేడు కేసీఆర్ రివ్యూ మీటింగ్.. ఏం తేల్చనున్నారో?
15-05-202015-05-2020 13:15:16 IST
Updated On 15-05-2020 17:04:23 ISTUpdated On 15-05-20202020-05-15T07:45:16.607Z15-05-2020 2020-05-15T07:45:13.929Z - 2020-05-15T11:34:23.817Z - 15-05-2020

ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఓ వర్గం మరోసారి టీవీలకు అతుక్కుపోయారు. కారణం నేడు సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కరోనా ప్రభావం.. అవలంభించాల్సిన వ్యూహాలపై అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.. ప్రజలకు సీఎం ఏం చెప్పనున్నారని ఆసక్తిగా మారింది. ఈరోజు సమీక్షపై సీఎం కేసీఆర్ మే 5నే ప్రకటించారు. ఆరోజు రాష్ట్రంలో మూడవ విడత లాక్ డౌన్ ను ఏకంగా మే నెలాఖరు వరకు పొడగించిన సీఎం రాష్ట్రంలో ప్రజా రవాణాతో పాటు మరికొన్ని అంశాలపై మే 15న మరోసారి సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. అయన చెప్పినట్లుగా మే 15 రానే వచ్చింది. మరి ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారు. మూడవ విడత లాక్ డౌన్ లో కేంద్రం ఇచ్చిన సడలింపులు తెలంగాణలో అమలు చేస్తామంటూనే కొన్నిటిలో మాత్రం తనదైన మార్క్ ఉండేలా కేసీఆర్ జాగ్రత్త పడ్డారు. అయితే ఆ విడతలో నిర్మాణరంగంతో పాటు తాజాగా 33 శాతం ఉద్యోగులతో ఐటీ కార్యకలాపాలకు అనుమతులు ఇచ్చేశారు. మరో ఈరోజు ఏమైనా కొత్తగా మరికొన్ని రంగాలకు అవకాశం ఇస్తారా అన్నదానిపై ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోతున్న కొన్ని వ్యాపార సంస్థలతో పాటు ప్రజా రవాణాలో కీలకమైన ఆర్టీసీలపై ఎలాంటి నిర్ణయాలు ఉండనున్నాయని రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రంతో పాటు హైదరాబాద్ నగరంలో బస్సు సర్వీసులపై ఇప్పటికే సీఎం డిపో మేనేజర్లు, అధికారులతో కొంత చర్చలు జరిపారు. నేడు మరోసారి సమీక్ష జరిపి బస్సు సర్వీసులపై నిర్ణయం తీసుకోనున్నారు. రెండ్ జోన్లు మినహా మిగతా ప్రాంతాలతో బస్సు సర్వీసులను తిప్పేందుకు దాదాపుగా అనుమతులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. సీటింగ్ పొజిషన్స్ మార్చి సర్వీసులు మొదలుపెట్టనున్నారని... అందుకు మార్గదర్శకాలను ప్రభుత్వం సూచించనుందని తెలుస్తుంది. ప్రజారవాణా పునరుద్ధరిస్తే వ్యాపారాలతో పాటు వివిధ ఉత్పత్తి రంగాలలో దాదాపుగా చాలా కార్యకలాపాలకు వెసులుబాటు కలుగుతుంది. అయితే సోమవారం నుండి కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ 4 అమల్లోకి రానుంది. అందులో రెడ్ జోన్లు, కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా ప్రాంతాలలో ప్రజారవాణాకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. మరి కేసీఆర్ దాంతో కలిపే సడలింపు ఇస్తారా లేక ముందే ఇస్తారా అన్నది చూడాల్సి ఉంది. ప్రయాణికుల సంఖ్యను కుదించి ట్యాక్సీలు, ఆటోలు కూడా తిప్పనుండగా అంతరాష్ట్ర సర్వీసులకు మాత్రం అనుమతులు అవసరం అనే నిబంధన విధించనున్నట్లుగా తెలుస్తుంది. ఇక, హైదరాబాద్ నగర పరిధిలో కేసులు.. ఇక్కడ సమస్య తీరు.. వ్యాపార అంశాలపై విస్తృత చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. జీహెచ్ఎంసిలో పాజిటివ్ కేసులు ఈ మాత్రం ఆగడం లేదు. గత నాలుగైదు రోజుల నుండి నమోదయ్యే కేసులన్నీ జీహెచ్ఎంసితో పాటు నగరంలో భాగమైన రంగారెడ్డి జిల్లాలోనే నమోదవుతున్నాయి. ఈక్రమంలో ఇక్కడ సడలింపులు ఇవ్వాలా? వద్ద అనే అంశంపై సమీక్షించనున్నారు. మరోవైపు తాజాగా హైకోర్టు రాష్ట్రంలో చనిపోయిన మృతదేహాలకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలా చేయకపోతే కరోనా మూడో దశకి చేరే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. రాష్ట్రంలో టెస్టుల సంఖ్యా కూడా పెంచాలని సూచించింది. దీనిపై కూడా ఈ సమావేశంలో సీఎం అధికారులతో చర్చించనున్నారు. సమావేశం అనంతరం ఈరోజు లేదా రేపు సీఎం కేసీఆర్ మీడియా సమావేశం కూడా నిర్వహించనున్నట్లుగా తెలుస్తుంది. మరి ఎలాంటి సడలింపులు వస్తాయో వేచిచూడాలి!

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
12 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
8 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
10 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
13 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
15 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
16 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
18 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
19 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
20 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
20 hours ago
ఇంకా