newssting
BITING NEWS :
* ఇండియాలో కరోనా కేసులు 1,38,845, మరణాలు 4021 .. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 1854, మరణాలు 53, ఏపీలో కరోనా కేసులు 2627, మరణాలు 55* శంషాబాద్ విమానాశ్రయంలో ప్రారంభమైన విమాన సర్వీసులు..హైదరాబాద్ నుంచి మొదటి ప్లేన్ బయలుదేరింది..బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చిన మొదటి విమానం *మరోమారు వివాదంలో చిక్కుకున్న కూనరవి..పొందూరు తహశీల్దార్ ను దుర్భాషలాడిన కూన రవి..కూనరవి మీద పొందూరు పీఎస్ లో ఫిర్యాదు చేసిన తహశీల్దార్...కూన రవి అరెస్ట్ కి రంగం సిద్దం*టీటీడీకీ షాక్‌ ఇచ్చిన క్రైం పోలీసులు..దొంగలను పట్టుకోవాలంటే ఫోర్ వీలర్ కావాలని కండీషన్.. మంచి ఫోర్ వీలర్ కావాలని కోరుతూ టీటీడీ ఉన్నతాధికారులకు లేఖ..లేఖ చూసి షాక్‌తిన్న అధికారులు..నిన్న జేఈవో ఇంట్లో భారీ దొంగతనం..6లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు మాయం *కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ మరో రికార్డు..3లక్షలు దాటిన ఏపీలో కరోనా పరీక్షల సంఖ్య..ఇప్పటివరకు 3,40,326 కరోనా టెస్టులు..10 లక్షల జనాభాకు 5,699 పరీక్షలతో దేశంలోనే నెంబర్‌వన్*తెలంగాణలో ఈరోజు కొత్తగా 41 కరోనా కేసులు. తెలంగాణలో మొత్తం 1854కి చేరిన కరోనా కేసులు. తెలంగాణలో ఈరోజు 24 మంది డిశ్చార్జ్. మొత్తం 1092 మంది ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 709 యాక్టివ్ కేసులు*వరంగల్ జిల్లా 9 హత్యల కేసులో వీడిన మిస్టరీ. పోలీసుల విచారణలో నేరం అంగీకరించిన నిందితుడు. స్నేహితులతో కలిసి హత్యలకు పాల్పడ్డ నిందితుడు. నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయాక హత్యలు* ఏపీలో తిరుమల లడ్డూ విక్రయాలు. 13 జిల్లా కేంద్రాల్లో టీటీడీ కల్యాణ మండపాల్లో లడ్డూ విక్రయాలు. లడ్డూ ప్రసాద సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు. 1800 425 4141, 1800 425 333 333 నెంబర్లు ఏర్పాటు

నేటి నుంచి లాక్‌డౌన్‌ 3.0 అదేబాటలో తెలంగాణ

04-05-202004-05-2020 07:50:13 IST
Updated On 04-05-2020 09:21:58 ISTUpdated On 04-05-20202020-05-04T02:20:13.033Z04-05-2020 2020-05-04T02:20:10.970Z - 2020-05-04T03:51:58.387Z - 04-05-2020

నేటి నుంచి లాక్‌డౌన్‌ 3.0 అదేబాటలో తెలంగాణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ మూడో విడత నేటి నుంచి అమల్లోకి రానుంది. లాక్‌డౌన్‌ అమలుతో ఇప్పటి వరకు సాధించిన ఫలితాన్ని పదిలం చేసుకునేందుకే ఈసారి కొన్నిటిపై ఆంక్షలు..మరికొన్నిటికి మినహాయింపులు ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రతను బట్టి దేశాన్ని రెడ్, ఆరెంజ్, గ్రీన్‌ జోన్లుగా విభజించిన కేంద్రం ఈ నెల 17వ తేదీ వరకు లాక్‌డౌన్‌ ఆంక్షలను పొడిగించిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తేస్తారన్న వార్తలు వినిపించినా, మూడో దశ లాక్ డౌన్ కూడా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

దేశవ్యాప్తంగా సుమారు 130 రెడ్‌ జోన్లు, ఆరెంజ్‌ 284, గ్రీన్‌ జోన్లు 319 ఉన్నాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో19, ఆ తర్వాత మహారాష్ట్రలో 14 రెడ్‌ జోన్లు ఉన్నాయి. జోన్లతో నిమిత్తం లేకుండా దేశవ్యాప్తంగా నిషేధం కొనసాగేవి.. విమాన, రైలు, మెట్రో ప్రయాణాలు. స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు, శిక్షణ, కోచింగ్‌ సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, మాల్స్, క్రీడా స్థలాలు, ప్రార్థనా స్థలాలు. సామాజిక, సాంస్కృతిక, రాజకీయ కార్యక్రమాలు, సభలు, సమావేశాలు.    

లాక్‌డౌన్‌ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులు, పర్యాటకులు, తీర్థయాత్రికులు, విద్యార్థులకు మాత్రమే ప్రయాణ వెసులుబాటు వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. పని ప్రదేశాల నుంచి గానీ, సొంతూళ్ల నుంచి గానీ వచ్చి..లాక్‌డౌన్‌ కారణంగా తిరిగి వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్న కార్మికులు, విద్యార్థులు, పర్యాటకుల కోసమే ప్రభుత్వం మినహాయింపు కల్పించిందని తెలిపారు.  అంతేతప్ప, సొంతూళ్లకు మామూలుగా వెళ్లేవారికి, సొంతపనులపై వెళ్లేవారికి వర్తించదని స్పష్టత నిచ్చారు.

తెలంగాణలోనూ రెండువారాలు పొడిగింపే

కాగా తెలంగాణలో లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలపాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఈనెల 7వ తేదీతో ముగియనుండగా.. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈనెల 21 వరకు దానిని పొడిగించాలని భావిస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, లాక్‌డౌన్‌ పొడిగింపు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం ప్రగతిభవన్‌లో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. మే 17 వరకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ గడువును పొడిగించిన నేపథ్యంలో రాష్ట్రంలో కూడా మరో రెండువారాల పాటు లాక్‌డౌన్‌ కొనసాగించాలని ఈ సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం. రాష్ట్రంలో కొత్తగా గుర్తించిన కంటైన్మెంట్‌ జోన్లలో క్వారంటైన్‌ గడువు ఈ నెల 21న ముగియడాన్ని ఇందుకు పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది.

లాక్‌డౌన్‌ సడలింపులకు సంబంధించి ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాలను రాష్ట్రంలో ఎంత మేర పాటించవచ్చనే అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. వలస కార్మికులను స్వస్థలాలకు పంపించే విషయంలో కేంద్రం తాజాగా యూ టర్న్‌ తీసుకోవడంపైనా చర్చ జరిగింది. అనుకోని పరిస్థితుల్లో రాష్ట్రానికి వచ్చి చిక్కుకుపోయిన వారిని మాత్రమే తిరిగి స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతించాలంటూ కేంద్రం జారీ చేసిన తాజా మార్గదర్శకాల వల్ల తలెత్తే పరిణామాలపై చర్చించినట్టు తెలుస్తోంది. దీంతో పాటు గ్రీన్‌ జోన్లలో నియమిత సామర్థ్యంతో ప్రజా రవాణా, మద్యం షాపులను తెరవడం వంటి అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. 

మంగళవారం జరిగే రాష్ట్ర కేబినెట్‌ భేటీలో చర్చించాల్సిన ఎజెండాను ఖరారు చేసేందుకు సోమ వారం మరోసారి సమావేశం కావాలని సీఎం నిర్ణయించినట్లు తెలిసింది. లాక్‌డౌన్‌ పొడిగింపు, ఏయే రంగాలకు సడలింపు ఇవ్వాలనే అంశంతో పాటు పాటించాల్సిన మార్గదర్శకాలను కూడా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. 

ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యల వల్ల రాష్ట్రంలో కోవిడ్‌ కేసుల సంఖ్య తగ్గినా, ప్రస్తుత పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహిస్తే మరింత ప్రబలే అవకాశముందనే అభిప్రాయం కూడా ఈ సమావేశంలో వ్యక్తమైనట్లు తెలిసింది. వైరస్‌ సోకిన వారిని క్రమం తప్పకుండా పర్యవేక్షించడంతో పాటు లాక్‌డౌన్‌ను ప్రజలందరూ పాటించేలా చూడాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

జిల్లాల వారీగా పరిస్థితితో పాటు కంటైన్మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ నిబంధనల అమలు తీరును కూడా సమీక్షించారు. అలాగే లాక్‌డౌన్‌ పొడిగింపుపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవాలని ఆయన ఆదేశించినట్టు తెలిసింది. ఈ విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా అభిప్రాయ సేకరణ నిర్వహించాలని సూచించినట్టు సమాచారం. అయితే, చాలామంది లాక్‌డౌన్‌ను పొడిగించాలనే కోరుకుంటున్నారని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. 

ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి కరోనా కలకలం

ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి కరోనా కలకలం

   3 hours ago


60 రోజుల తర్వాత విమానాలు. శంషాబాద్‌లో ప్రయాణికుల పడిగాపులు

60 రోజుల తర్వాత విమానాలు. శంషాబాద్‌లో ప్రయాణికుల పడిగాపులు

   3 hours ago


ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

   5 hours ago


విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

   7 hours ago


ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

   7 hours ago


మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

   7 hours ago


గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

   8 hours ago


భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

   8 hours ago


ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

   8 hours ago


భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

   24-05-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle