newssting
BITING NEWS :
*రాష్ట్రాలను కేంద్రం చిన్న చూపు చూస్తోందన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల్లో వాస్తవం లేదు-కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ *ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ. 5 గంటల పాటు కొనసాగిన కేబినెట్ మీటింగ్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించిన ముఖ్యమంత్రి కేసీఆర్. పలు కీలక అంశాలపై చర్చించిన కేబినెట్ *కొత్తకోట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. డివైడర్ ఢీ కొట్టి తుఫాన్ వాహనం బోల్తా. ఇద్దరు మృతి. 14 మందికి తీవ్రగాయాలు, హాస్పిటల్ కు తరలింపు * ఇవాళ కెసిఆర్ బర్త్ డే. కెసిఆర్ పుట్టినరోజును మొక్కల పండుగగా జరపాలని తెరాస పిలుపు. రేపు ఉదయం నుంచి మొక్కలు నాటడం... రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపు *జనసేన కార్యకర్తలతో పవన్ సమావేశం. పనిచేసే కార్యకర్తలకే జనసేన పార్టీలో ప్రాధాన్యత. కార్యకర్తల సలహాలు, సూచనలు తీసుకున్నా-పవన్ *రాజధాని మార్పు, పీఏఏల రద్దు తొందరపాటు నిర్ణయాలు, పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల కోర్టులకు వెళ్లే పరిస్థితి, శాసనమండలి రద్దు నిర్ణయం సరైంది కాదు-దగ్గుబాటి పురంధేశ్వరి*ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం... మూడోసారి సీఎంగా ప్రమాణం

నెటిజ‌న్ల ప్ర‌శ్న‌ల‌కు కేటీఆర్ ఆస‌క్తిక‌ర స‌మాధానాలు

30-12-201930-12-2019 07:14:28 IST
Updated On 30-12-2019 10:46:04 ISTUpdated On 30-12-20192019-12-30T01:44:28.693Z30-12-2019 2019-12-30T01:44:16.919Z - 2019-12-30T05:16:04.874Z - 30-12-2019

నెటిజ‌న్ల ప్ర‌శ్న‌ల‌కు కేటీఆర్ ఆస‌క్తిక‌ర స‌మాధానాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎప్పుడూ పార్టీ వ్య‌వ‌హారాలు, పాల‌నా వ్య‌వ‌హారాల‌తో బిజీగా ఉండే మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్ర‌సిడెంట్ కేటీఆర్ సోష‌ల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న దృష్టికి వ‌చ్చే స‌మ‌స్య‌ల‌పై స్పందించి ప‌రిష్కారానికి కృషి చేస్తుంటారు. అప్పుడ‌ప్పుడూ ట్విట్ట‌ర్‌లో నెటిజ‌న్ల‌తో సంభాషిస్తుంటారు.

ఆదివారం కూడా ఆయ‌న నెటిజ‌న్ల‌కు స‌మ‌యం కేటాయించారు. #AskKTR పేరుతో ట్విట్ట‌ర్‌లో నెటిజ‌న్లు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలిచ్చారు. రాజ‌కీయాలు, త‌న ఇష్టాయిష్టాలు, స‌మ‌స్య‌లు వంటి అనేక విష‌యాల‌పై స్పందించారు. కొన్ని ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పారు.

ప్ర‌: జ‌గ‌న్ ఆరు నెల‌ల గురించి ఒక్క మాట‌లో మీ అభిప్రాయం చెప్పండి ?

కేటీఆర్: ఆయ‌న పాల‌న‌ను బాగా ప్రారంభించారు.

ప్ర‌: ఏపీ మూడు రాజ‌ధానుల‌పై సామాన్య పౌరుడిగా మీ స్పంద‌న ఏంటి ? అభివృద్ధి అంటే రాజ‌ధాని, హైకోర్టేనా ?

కేటీఆర్‌: అది నిర్ణ‌యించాల్సింది ఏపీ ప్ర‌జ‌లు, నేను కాదు.

ప్ర‌: అంత‌ర్జాతీయ స్థాయి మేనిఫ్యాక్చ‌రింగ్ కంపెనీలు హైద‌రాబాద్‌కు తీసుకువ‌స్తారా ?

కేటీఆర్‌: ఇందుకోసం చాలా ప్ర‌య‌త్నిస్తున్నాం. ఇప్ప‌టికే కొన్ని వ‌చ్చాయి కానీ ఇంకా రావాల్సి ఉంది. టెక్స్‌టైల్స్‌, ఎల‌క్ట్రానిక్ సంస్థ‌ల‌పై దృష్టి పెట్టాం.

ప్ర: దేశానికి అతిపెద్ద స‌వాల్ ఏంటి ? ఆర్థిక ర‌క్ష‌ణనా ? కుల‌, మ‌త ఆధార రాజ‌కీయాలా ? పేద‌రిక‌మా ?

కేటీఆర్‌: మ‌న రాజ‌కీయాల‌ను, ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను బ్యాలెన్స్ చేయ‌డ‌మే అస‌లు స‌వాల్‌.

ప్ర‌: 2019లో మీకు అపురూప‌మైన క్ష‌ణం ఏంటి ?

కేటీఆర్‌: 32కి 32 జిల్లా ప‌రిష‌త్‌ల‌ను గెలుచుకోవ‌డం.

ప్ర‌: ప‌్ర‌స్తుత రాజ‌కీయాల్లో మీకు స్ఫూర్తినిచ్చిన నాయ‌కుడు ఎవ‌రు ?

కేటీఆర్‌: మ‌రో ఆలోచ‌న లేదు. కేసీఆర్ గారే..!

ప్ర‌: శాంతియుత నిర‌స‌న‌ల‌కు కూడా ఎందుకు అనుమ‌తి ఇవ్వ‌డం లేదు. మ‌న గ్లోబ‌ల్ సిటీలో ఆ మాత్రం స్వేచ్ఛ ఉండాలి క‌దా ?

కేటీఆర్‌: కొన్ని రోజుల వ్య‌వ‌ధిలోనే ఆర్ఎస్ఎస్, ఎంఐఎం న‌గ‌రంలో స‌మావేశాలు పెట్టుకున్నాయి.

ప్ర‌: ఇంత‌పెద్ద రాష్ట్రంలో ట్విట్ట‌ర్‌లో రిప్లై ఇస్తే స‌మ‌స్య‌లు పరిష్కారం కావు. ట్విట్ట‌ర్ లేని సామాన్యుల ప‌రిస్థితి ఏంటి ? ప‌్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గంలో టీమ్ కేటీఆర్ ఏర్పాటుచేసి స‌మ‌స్య‌ల‌ను శాశ్వ‌తంగా ప‌రిష్క‌రించాలి.

కేటీఆర్‌: ప‌్ర‌జ‌లకు క‌నెక్ట్ అయ్యేందుకు ట్విట్ట‌ర్ ఒక మార్గం మాత్ర‌మే.. ఏకైక మార్గం కాదు.

ప్ర‌: మీరు టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్‌గా బాధ్య‌త‌లు తీసుకొని ఏడాది గ‌డిచింది. మీకు మంత్రిగా ప‌నిచేయ‌డం ఇష్టంగా ఉందా లేదా వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్‌గా రాజ‌కీయాలా ?

కేటీఆర్: టీఆర్ఎస్ వ‌ల్ల‌, టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల వ‌ల్లే నాకు మంత్రిగా అవ‌కాశం వ‌చ్చింది. కాబ‌ట్టి, పార్టీ ప‌ద‌వి అంటేనే నాకు విలువైన‌ది.

ప్ర‌: ఏపీలో కూడా మీరు పార్టీ పెట్టండి. అక్క‌డ రెండు పార్టీల వ్య‌క్తిగ‌త క‌క్ష‌ల‌తో వేగ‌లేక‌పోతున్నాం.

కేటీఆర్‌: తెలంగాణ ఏర్ప‌డే స‌మ‌యంలో నాయ‌క‌త్వ లేమీతో రాష్ట్రం ఇబ్బంది ప‌డుతుంద‌నే మాట‌లు విన్నాను. ఇప్పుడు ఏపీ నుంచి ఈ మాట‌లు వింటుంటే సంతోషంగా ఉంది. కేసీఆర్ నాయ‌క‌త్వానికి ఇదే నిద‌ర్శ‌నం.

ప్ర‌: హైద‌రాబాద్‌ను ప‌ర్యాట‌క కేంద్రం చేయ‌డానికి మీరు తీసుకున్న మూడు చ‌ర్య‌లు చెప్పండి ?

కేటీఆర్‌: ప‌ర్య‌ట‌క ప్ర‌దేశాల్లో పారిశుధ్య పనులు ప్రైవేటుకు ఇచ్చాం. చార్మినార్‌, గోల్కొండ‌కు హెరిటేజ్ స్టేట‌స్ తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాం. యూర‌ప్‌, అమెరికాకు డైరెక్ట్ ఎయిర్‌లైన్ క‌నెక్టివిటీ పెంచేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాం.

ప్ర‌: సోష‌ల్ మీడియాలో మీపై మేమ్స్ చేయ‌డం మీకు అంగీకార‌మేనా ?

కేటీఆర్‌: అమ‌ర్యాద‌గా ఉండ‌క‌పోతే నాకేమీ అభ్యంత‌రం లేదు.

ప్ర‌: మీరు సినిమాల్లో న‌టిస్తారా ? న‌టిస్తే మంచి సోష‌ల్ మెసేజ్ ఉన్న సినిమాను ఆశించ‌వ‌చ్చా ?

కేటీఆర్‌: నాకు ఇప్ప‌టికే ఫుల్ టైమ్ జాబ్ ఉంది.

ప్ర‌: నిరుద్యోగం 45 ఏళ్ల‌లో ఎప్పుడూ లేనంత ఉంది. ఆర్థిక ప‌రిస్థితి దిగ‌జారిపోతోంది. వీటి నుంచి మందిర్‌, మ‌సీద్ వివాదంతో కేంద్రం దృష్టి మ‌ర‌ల్చుతోంది. ఈ ప‌రిస్థితిని ఎలా చూస్తారు ?

కేటీఆర్‌: ప‌క్క‌దారి ప‌ట్టించే రాజ‌కీయాలు తాత్కాలికంగా ప‌నిచేస్తాయి కానీ దీర్ఘ‌కాలంలో ప్ర‌భుత్వం ఉపాధి క‌ల్ప‌న‌, ఆర్థిక ప‌రిస్థితిపై స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది.

ప్ర‌: మీరు రాజ‌కీయ‌, వ్య‌క్తిగ‌త జీవితాన్ని ఎలా మేనేజ్ చేస్తారు ? మీ స‌మాధానం ఒత్తిడికి గుర‌య్యే ఉద్యోగ‌స్తులకు ఒక సూచ‌న‌గా ఉంటుంది.

కేటీఆర్‌: నేను కూడా వెతుకుతున్నా.. ఈ రెండింటినీ స‌రిగ్గా బ్యాలెన్స్ చేస్తున్న వారు క‌నిపించ‌డం లేదు.

ప్ర‌: రాజ‌కీయాల్లోకి రావ‌డానికి మీకు స్ఫూర్తినిచ్చిన అంశం ?

కేటీఆర్‌: తెలంగాణ ఉద్య‌మం.

ప్ర‌: మీకు అమెజాన్ లేదా హాట్‌స్టార్‌లో ఏ సిరీస్ ఇష్టం ?

కేటీఆర్‌: హాట్‌స్టార్‌లో బిలియ‌న్స్‌.

ప్ర‌: ప‌్ర‌తీ రాష్ట్రంలో బ‌ల‌మైన ప్రాంతీయ పార్టీలు ఉంటే జాతీయ రాజ‌కీయాల‌పై ఎలాంటి ప్ర‌భావం ఉంటుంది ?

కేటీఆర్: బ‌్యాలెన్స్ బాగుంటుంది.

 

చంద్రబాబుని కలిసిన మాజీ ఎమ్మెల్యే, నటి జయసుధ

చంద్రబాబుని కలిసిన మాజీ ఎమ్మెల్యే, నటి జయసుధ

   an hour ago


మాయగాళ్ళకు కేంద్రంగా ఏపీ..!

మాయగాళ్ళకు కేంద్రంగా ఏపీ..!

   an hour ago


మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతారా.. సిద్ధమే: ఒవైసీ

మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతారా.. సిద్ధమే: ఒవైసీ

   3 hours ago


కేజ్రీవాల్ మాటలో మార్పు.. పోరాటం వదిలి సర్దుకుపోయే ధోరణి!

కేజ్రీవాల్ మాటలో మార్పు.. పోరాటం వదిలి సర్దుకుపోయే ధోరణి!

   3 hours ago


అయ్య బాబోయ్.. గాంధీతో కేసీఆర్‌కు పోలికా?

అయ్య బాబోయ్.. గాంధీతో కేసీఆర్‌కు పోలికా?

   5 hours ago


రాజధాని మాటేమో కానీ విశాఖలో రియల్ బూమ్‌..

రాజధాని మాటేమో కానీ విశాఖలో రియల్ బూమ్‌..

   5 hours ago


కేంద్రంతో సయోధ్యకు కేజ్రీవాల్ ప్రయత్నాలు

కేంద్రంతో సయోధ్యకు కేజ్రీవాల్ ప్రయత్నాలు

   7 hours ago


కాశ్మీర్‌పై జోక్యం వద్దు.. ఐక్యరాజ్యసమితికి భారత్ ఘాటు జవాబు

కాశ్మీర్‌పై జోక్యం వద్దు.. ఐక్యరాజ్యసమితికి భారత్ ఘాటు జవాబు

   8 hours ago


అక్షరాస్యత, పరిశుభ్రతలో ఆంధ్రా అమ్మాయిలదే అగ్రపీఠం

అక్షరాస్యత, పరిశుభ్రతలో ఆంధ్రా అమ్మాయిలదే అగ్రపీఠం

   8 hours ago


‘‘తెలంగాణపై వివక్ష ప్రశ్నేలేదు.. మాకన్ని రాష్ట్రాలు సమానమే’’

‘‘తెలంగాణపై వివక్ష ప్రశ్నేలేదు.. మాకన్ని రాష్ట్రాలు సమానమే’’

   9 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle