newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నెంబర్ ప్లేట్ కనిపించకపోతే ఇక జైలుకే

12-03-202012-03-2020 16:54:46 IST
2020-03-12T11:24:46.403Z12-03-2020 2020-03-12T11:22:43.038Z - - 16-04-2021

నెంబర్ ప్లేట్ కనిపించకపోతే ఇక జైలుకే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ వ్యాప్తంగా ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రోడ్లపై మితిమీరిన వేగంతో వెళుతున్న ఆకతాయిలు నెంబర్ ప్లేట్ సరిగా లేదని, తమకేం కాదని భరోసా ప్రదర్శిస్తున్నారు. అయితే ఇక ఇలాంటి ఆటలు సాగవంటున్నారు పోలీసులు. మీ నంబర్‌ ప్లేట్‌లోని అన్ని నెంబర్లు కనబడకుండా.. ఓ పక్కన ఏదైనా వంచేసినట్టు, రంగేసినట్టు వుంటే మాత్రం మీకు రంగుపడడం ఖాయం అంటున్నారు సీపీ అంజనీకుమార్. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు.

ట్రాఫిక్ పోలీసులకు చిక్కకూడదని వింత ప్రయోగాలు చేసేవారి ఆట కట్టించనున్నారు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తూ చలానాల నుంచి తప్పించుకోవాలని ప్లాన్ చేసేవారి ఆటలకు చెక్ పెడతామంటున్నారు. నెంబర్ ప్లేట్ సరిగాలేకపోతే... ఇక చైన్‌స్నాచర్‌గానే అనుమానించాల్సి వస్తుందని హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రకటించారు. తప్పుడు నంబర్ ప్లేట్స్ వ్యవహారంపై సోషల్ మీడియాలో స్పందించిన ఆయన.. హైదరాబాద్‌లో నంబర్‌ ప్లేట్లను సరిగ్గా అమర్చకుండా.. తప్పుడు నంబర్‌ ప్లేట్లతో తిరుగుతున్న దాదాపు 2 వేల వాహనాల రికార్డులు తమ దగ్గర ఉన్నాయని పేర్కొన్నారు. 

ట్రాఫిక్‌ చలాన్ల నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి నంబర్‌ ప్లేట్‌కు ఆకు అతికించిన సంఘటన  పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగుచూసిన సంగతి తెలిసిందే.యమహా ఎఫ్‌జెడ్‌ బైక్‌పై పంజగుట్ట వైపు వస్తుండగా పంజగుట్ట సర్కిల్‌ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ ఎస్సై రామకృష్ణ సిబ్బంది నందకిషోర్ అనే వాహనదారుడి వాహనం తనిఖీ చేశారు. నెంబర్ ప్లేట్ పై వెనక ఏదో అంటించి ఉండటాన్ని గుర్తించి వాహనాన్ని ఆపారు. దగ్గరికి వెళ్లి చూడగా అతను ట్రాఫిక్‌ చలాన్ల నుంచి తప్పించుకునేందుకు నంబర్‌ ప్లేట్‌కు ఆకును అతికించినట్లు గుర్తించారు.వెంటనే అతనిపై కేసు నమోదు చేశారు. ఇలాంటి ఘటనలు నగరంలో అనేకం వెలుగు చూస్తున్నాయి. 

సరిగ్గా లేని నంబర్‌ ప్లేట్లతో తిరుగుతున్న 384 మంది వాహనదారులపై కేసులు కూడా నమోదు చేశామని వారి వాహనాలను సీజ్ చేస్తామన్నారు. రోడ్లపై నంబర్‌ ప్లేట్లు సరిగ్గా లేకుండా కనపడితే వెంటనే ఫొటోను తీసి తమ వాట్సాప్ నంబర్‌ 9490616555కు ఆ ఫొటోలను పంపాలని ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు సీపీ. మీ వాహనానికి నెంబర్ ప్లేట్ సరిగా ఉంటే ఫైన్‌తో సరిపోతుంది. నెంబర్ ప్లేట్ సరిగాలేకపోతే ఊచలు లెక్కపెట్టాలి మరి. తస్మాత్ జాగ్రత్త. 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   10 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   6 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   8 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   11 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   13 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   15 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   16 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   17 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   18 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   19 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle