newssting
BITING NEWS :
* సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్, చైనాల మధ్య సుదీర్ఘ చర్చలు. చైనా భూభాగంలోని మోల్డోలో ఉదయం 9 గంటల రాత్రి 9 గంటల వరకు ఆరవ విడత చర్చలు. * మహారాష్ట్ర థానే జిల్లా భివండీలో మూడంతస్తుల భవనం కూలిన ఘటనలో 17కి చేరిన మృతుల సంఖ్య. మృతుల్లో 14 ఏళ్లలోపు బాలలు, మహిళలు అధికం. * బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీకు సమాజ్‌వాదీ పార్టీ మద్ధతు. సమాజ్‌వాదీ పార్టీ అధికారిక ట్విట్టర్ ద్వారా సోమవారం రాత్రి ప్రకటన. * ముంబై నగరంతోపాటు పలు పరిసర నగరాల్లో మంగళవారం భారీవర్షాలు కురుస్తాయని హెచ్చరికలు. ముంబై, థానే, రాయగడ్, పూణే, సతార, సిందూర్గ్ ప్రాంతాల్లో మంగళవారం ఉరుముులు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముంబై వాతావరణ శాఖ హెచ్చరికలు. రష్యా దేశంలో భారీ భూకంపం. రష్యాలోని ఇర్కుట్సు రీజియన్ ప్రాంతంలో సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదు. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రష్యన్ ఎమర్జెన్సీ మంత్రిత్వశాఖ వెల్లడి. భూకపంపంతో ప్రజలు భయాందోళనలు. విగత జీవిగా దొరికిన సరూర్ నగర్ తపోవన్‌కాలనీ వద్ద ఆదివారం రాత్రి వరదలో కొట్టుకుపోయిన నవీన్‌కుమార్‌. * కేంద్రంలో తెచ్చిన వ్యవసాయ బిల్లులతో రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య సాగుతున్న విమర్శ, ప్రతి విమర్శలు. * కేంద్ర బిల్లులతో రైతులకు మేలని బీజేపీ వర్గాలు, కొత్తగా తెచ్చిన బిల్లులతో రైతులను తీవ్ర నష్టమని టీఆర్ఎస్ నేతలు ఘాటు విమర్శలు. 280వ రోజుకు చేరుకున్న రాజధాని అమరావతి రైతుల ఉద్యమం. కొనసాగుతున్న శిబిరాల్లో రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన రైతులు. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం. నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలతో భేటీ జరిగే అవకాశం. బుధవారం తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సి ఉన్నా మంగళవారం ఆకస్మిక ఢిల్లీ పర్యటన పెట్టుకోవడం గమనార్హం. రాష్ట్రంలో అనూహ్యంగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మోదీ, షాలతో చర్చకు అవకాశం. మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు దర్యాప్తు వేగవంతం.

నువ్వు సూప‌ర్ బ్రో : హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసుల‌కు ఘాటు లేఖ‌..!

04-11-201904-11-2019 00:11:38 IST
2019-11-03T18:41:38.661Z04-11-2019 2019-11-03T18:41:33.483Z - - 22-09-2020

నువ్వు సూప‌ర్ బ్రో : హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసుల‌కు ఘాటు లేఖ‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసుల తీరుతో చిర్రెత్తుకొచ్చిన ఓ యువ‌కుడు సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా లేఖాస్త్రాన్ని సంధించాడు. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఆ లేఖ సామాన్య జ‌నాల ఆలోచ‌న‌ల‌కు చాలా ద‌గ్గ‌ర‌గా ఉంద‌ని, నువ్వు సూప‌ర్ బ్రో అంటూ లేఖ‌ను చ‌దివిన కొంద‌రు వారి అభిప్రాయాల‌ను కామెంట్ బాక్సుల‌లో నింపుతున్నారు. ఇంత‌కీ ఆ యువ‌కుడు ఎవ‌రు..? అత‌ను రాసిన లేఖ‌లో ఉన్న మేట‌రేంటి..? సామాన్యులను ట‌చ్ చేసేలా ఆ మేట‌ర్‌లో ఉన్న మీనింగ్ ఏంటి..? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలుసుకోవాలంటే క‌థ‌నాన్ని పూర్తిగా చ‌ద‌వాల్సిందే మ‌రీ..!

కాగా, ప్ర‌శ్నించే హ‌క్కు ఉన్న‌ప్పుడే మాన‌వ హ‌క్కులు కాపాడ‌బ‌డ‌తాయి. ఈ విష‌యాన్ని అనేక‌మంది సామాజిక‌వేత్త‌లు వారి ప్ర‌సంగాల‌లో పేర్కొంటూ వ‌స్తున్న సంగ‌తి విధిత‌మే. అదే స‌త్యం కూడా. ఈ హ‌క్కే అధికారంలోని ప్ర‌భుత్వ అవినీతిని ప్ర‌శ్నిస్తుంది. కునారిల్లుతున్న ప్ర‌జ‌ల హ‌క్కుల‌ను కాపాడుతుంది. మ‌రుగున ప‌డ‌బోతున్నస‌మాన‌త్వాన్ని త‌ట్టి లేపుతుంది. నేటి వాడుక భాషలో చెప్పాలంటే ప్రతి సామాన్యుడికి బాహుబ‌లి ఆయుధం ప్ర‌శ్నించే హ‌క్కే.

అయితే, ప్ర‌శ్నించే హ‌క్కు కేవ‌లం సెల‌బ్రిటీల‌కే సొంత‌మ‌న్న నానుడి నేటి స‌మాజంలో లేక‌పోలేదు. నిత్యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న పోస్టులే అందుకు నిద‌ర్శ‌నం. ఈ విష‌యంలో సెల‌బ్రిటీల‌ను త‌ప్పుబ‌ట్ట‌లేం.. సామాన్యులు ముందుకు రాక‌పోవ‌డ‌మే అందుకు ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని, వారి హ‌క్కుల‌కు భంగం క‌లిగిన ప్ర‌తీసారి ప్ర‌శ్నిస్తేనే న్యాయం జ‌రుగుతుంద‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. చైత‌న్య‌వంత‌మైన మీడియా, విరివిగా పెరిగిన సామాజిక మాధ్య‌మాలు ఉన్నా అలా ముందుకొచ్చే వారు అరా.. కొరా మాత్ర‌మే మ‌నకు క‌నిపిస్తుండ‌టం శోచ‌నీయం.

ఇలా అరా.. కొరా మాత్ర‌మే క‌నిపించే వాళ్ల‌లో నేనూ ఉన్నానంటూ సాయి గంగాధ‌ర్ అనే ఓ యువ‌కుడు త‌న గ‌ళాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా వినిపించాడు. ఇటీవ‌ల త‌న విష‌యంలో చోటు చేసుకున్న ఓ సంఘ‌ట‌న‌ను సోష‌ల్ మీడియా ద్వారా నెటిజ‌న్ల‌తో పంచుకున్నాడు. తాను చేసింది త‌ప్పే అయినా.. అలా చేయ‌డానికి గ‌ల కార‌ణం మీరు కాదా..? అంటూ తెలంగాణ స‌ర్కార్‌పై, అలాగే హ‌ద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసు శాఖ‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించాడు. గంగాధ‌ర్ రాసిన లేఖ‌లో పేర్కొన్న వివ‌రాలు ఇలా ఉన్నాయి.

గౌర‌వ‌నీయులైన హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసుశాఖ వారికి నా హృద‌య‌పూర్వ‌క న‌మ‌స్కారాలు. ప్ర‌జ‌లు సుర‌క్షితంగా ప్రయాణం చేయ‌డానికి మీరు తీసుకుంటున్న చ‌ర్య‌లు ప్ర‌శంస‌నీయం. ఇటీవ‌ల నా బైక్ నెంబ‌ర్‌పై ట్రిపుల్ రైడింగ్ ఫైన్ అంటూ ఆన్‌లైన్‌లో బిల్ చూశాను. ఓకే.. నేను చేసింది త‌ప్పే. ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌ను తూ..చా త‌ప్ప‌క పాటించే నాకు.. ట్రిపుల్ రైడింగ్ ఫైన్ అంటూ బిల్ రావ‌డం బాధించింది. సాధార‌ణ వ్య‌క్తినైన నేను.. నా బైక్‌పై మ‌రో ఇద్ద‌రిని ఎక్కించుకోవ‌డానికి కార‌ణం ముమ్మాటికి తెలంగాణ స‌ర్కార్‌, హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులే.

మ‌రేం చేయ‌మంటారు.. ఆర్టీసీ స‌మ్మె కార‌ణంగా గ‌త నెల రోజుల నుంచి బ‌స్సుల రాక పోక‌లు కొన‌సాగ‌డం లేదు. పోనీ ఆ వ‌చ్చే అరా.. కొరా బ‌స్సులైనా స‌రైన వేళ‌కు వ‌స్తాయా..? అంటే అదీను లేదాయే. అందులోనూ అనుభ‌వం లేని ప్ర‌యివేటు డ్రైవ‌ర్లు.. కండ‌క్ట‌ర్లు. వారిని చూస్తుంటేనే గుండె గుభేల్‌మంటోంది. డ్రైవ‌ర్లేమో ప్రాణాలు తీస్తూ.. కండ‌క్ట‌ర్లేమో ప్రయాణికులు ద‌గ్గ‌ర వ‌సూలు చేసిన టికెట్ ఛార్జీల న‌గ‌దును ఇంటికి త‌ర‌లిస్తున్నారు. ఈ సంఘ‌ట‌న‌లు కోకొల్ల‌లుగా వీడియోల‌తో స‌హా సామాజిక మాధ్యమాల‌లో ప్ర‌సార‌మ‌వుతున్నా ప‌ట్టించుకునే నాధుడే క‌రువ‌య్యారు. ఇలా ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల్లో ఆర్టీసీ బ‌స్సుల్లో ప్ర‌యాణించి మా ప్రాణాల‌నూ కోల్పోవాల్నా..?

పోనీ.. మీరు ఏర్పాటు చేసిన మెట్రోలో ప్ర‌యాణించి గమ్య స్థానాల‌కు చేరుకుందామ‌న్నా.. అక్క‌డ ఛార్జీల రూపంలో అధిక మొత్తాల‌నే గుంజుతున్నారు. సాధార‌ణ వ్య‌క్తికి అందుబాటులోలేని విధంగా సామాన్యుల నుంచి  ఛార్జీలు వ‌సూలు చేస్తున్నారు. దీంతో పేద‌లు, విద్యార్థులు మెట్రోకు బ‌దులు ఇత‌ర ప్ర‌యాణ మార్గాల‌ను అన్వేషిస్తున్నారు. ఇలా ఓ వైపు ఆర్టీసీ కార్మికుల స‌మ్మె, మ‌రోవైపు మెట్రో ఛార్జీల మోత‌తో చిన్న మొత్తాన్ని జీతంతా పొందుతూ ప్ర‌యివేటు ఉద్యోగాలు చేస్తున్న మాకు ట్రిపుల్ రైడింగ్ త‌ప్ప‌డం లేదు సార్‌.

బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ త‌ప్ప‌ని నాకు ఫైన్ వేసే ముందు ప్ర‌భుత్వ రోడ్డుపై.. ప్ర‌భుత్వ ఉద్యోగులుగా ఉన్న ట్రాఫిక్ పోలీసుల క‌ళ్లెదుటే ఓవ‌ర్ లోడ్‌లో వెళ్తున్న ఆటోలు, సెట్విన్ బ‌స్సుల ప‌రిస్థితి ఆలోచించ‌రా..? వాటిని ఆపి ఫైన్ వేయ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మేంటి..? ఆఖ‌ర‌కు ఆర్టీసీ బ‌స్సులు సైతం ప‌రిమితికి మించి ప్ర‌యాణికుల‌ను ఎక్కించుకోవ‌డం లేదా..? మ‌నం చూడ‌టం లేదా..? ఈ స‌మ‌స్య‌ల‌న్నింటిని ప‌రిష్క‌రిస్తే అస‌లు ట్రిపుల్ రైడింగ్ చేయాల్సిన అవ‌స‌ర‌మే రాదు సార్‌. ఇక‌నైనా ఆదిశ‌గా తెలంగాణ ప్ర‌భుత్వం, హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు దృష్టిసారించాల‌ని ఆశిస్తూ మీ.. సాయి గంగాధ‌ర్‌..! ఇలా సాయి గంగాధ‌ర్ చేసిన పోస్టుకు నెటిజ‌న్ల నుంచి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. నువ్వు సూప‌ర్ బ్రో అంటూ కొంద‌రు.. స్ట్రాంగ్లీ అగ్రీ అంటూ మ‌రికొంద‌రు కామెంట్లు పెడుతుండ‌టం గ‌మ‌నార్హం. ఇంత‌కీ సాయి గంగాధ‌ర్ అభిప్రాయంపై మీ నిర్ణయం..!

 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle