newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నీటి వాటాకోసం ఇక సుప్రీంకోర్టులో సిగపట్లు

06-08-202006-08-2020 14:26:46 IST
Updated On 06-08-2020 14:34:34 ISTUpdated On 06-08-20202020-08-06T08:56:46.835Z06-08-2020 2020-08-06T08:56:32.843Z - 2020-08-06T09:04:34.177Z - 06-08-2020

నీటి వాటాకోసం ఇక సుప్రీంకోర్టులో సిగపట్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులలో తమ తమ వాటా నీటికోసం విభజనానంతరం కూడా ప్రతి సంవత్సరం ఘర్షణ పడుతున్న తెలుగు రాష్ట్రాలు జలవివాద పరిష్కారం కోసం సుప్రీంకోర్టు తలుపులు తట్టాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జీవో 203, జీవో 388ల ద్వారా రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు విస్తరణ, శ్రీశైలం కుడి ప్రధాన కాలువ సామర్థ్యం పెంపు పనులను ఏకపక్షంగా ప్రతిపాదించిందని, ఈ జీవోల అమలును నిలువరించాలని తెలంగాణ ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం జీవో 203, జీవో 388ల ద్వారా ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోకుండా నిలువరించాలని పిటిషన్‌లో తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థించింది.

చట్టబద్ధమైన వ్యవస్థ ఉన్నా కూడా దీన్ని పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏకపక్షంగా కొత్తగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదించిందని పేర్కొంది. ఈ ప్రాజెక్టు ద్వారా రోజుకు 3 టీఎంసీల నీటిని తీసుకునేందుకు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా నీటి మళ్లింపు సామర్థ్యం 80 వేల క్యూసెక్కులకు పెంచేందుకు చూస్తోందని నివేదించింది. 

ఈ ప్రాజెక్టులకు సంబంధించి తమ వద్ద ఉన్న సమాచారంతో కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేశామని, ఈ అంశాన్ని కృష్ణా బోర్డు కూడా రెండుసార్లు ఏపీ ప్రభుత్వానికి గుర్తు చేసి ప్రాజెక్టు డీపీఆర్‌ పంపాలని, అంతవరకు జీవో 203 అమలును నిలిపివేయాలని ఆదేశించిందని వివరించింది. బోర్డు ఆదేశాలను బేఖాత రు చేసి టెండర్లు పిలవడం విభజన చట్టాన్ని ఉల్లంఘించడమే అని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. 

ఆయా అంశాలపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ కూడా చొరవ తీసుకుందని, అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించిందని వివరించింది. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం కేఆర్‌ఎంబీ సూచనలను, జలశక్తి శాఖ సూచనలను గానీ పట్టించుకోలేదని పేర్కొంది. ఏపీ ప్రభుత్వం జూలై 15న టెండర్‌ నోటిఫికేషన్‌ కూడా జారీచేసిందని నివేదించింది. వెంటనే టెండర్ల ప్రక్రియను నిలిపివేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయాలని కోరింది. 

మావాటా వాడుకోవడానికే సీమ ఎత్తిపోతల... సుప్రీంకు ఏపీ నివేదన

మరోవైపున కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్‌ వాటా నీటిని సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాల తాగు, సాగునీటి కష్టాలను కడతేర్చడానికే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని సుప్రీంకోర్టుకు నివేదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విభజన చట్టాన్ని పక్కనబెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. అపెక్స్‌ కౌన్సిల్, కేంద్ర జలసంఘం, కృష్ణా బోర్డుల నుంచి అనుమతి తీసుకోకుండానే శ్రీశైలంలో 777 అడుగుల నుంచే రోజుకు 2 టీఎంసీలను తరలించేందుకు డిండి, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిందని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి, ఎస్సెల్బీసీ సామర్థ్యం పెంచిందని, ఎడమ గట్టు కేంద్రం ద్వారా యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ రోజుకు నాలుగు టీఎంసీలను దిగువకు విడుదల చేస్తోందనే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాలని నిర్ణయించింది. 

పోతిరెడ్డిపాడు కింద రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో 18.92 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇది విభజన చట్టంలో పేర్కొన్న ఆయకట్టు. ఈ ఆయకట్టుకు నీళ్లందించడానికే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని వివరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. తమ వాటా నీటిని వాడుకోవడానికే పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల చేపట్టామని తెలంగాణ సర్కార్‌ గతంలో అపెక్స్‌ కౌన్సిల్‌కు తెలిపింది. అలాంటప్పుడు తమ వాటా నీటిని వినియోగించుకోవడానికి రాయలసీమ ఎత్తిపోతల చేపట్టడం తప్పెలా అవుతుంది అన్నది ఏపీ వాదన. 

శ్రీశైలంలో నీటిమట్టం 841 అడుగుల్లో ఉన్నప్పుడు జూలై 19న తెలంగాణ సర్కార్‌ ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రారంభించింది. దీనిపై కృష్ణా బోర్డుకు మూడుసార్లు ఫిర్యాదు చేశాం. విద్యుదుత్పత్తి ఆపాలని తెలంగాణ సర్కార్‌ను కృష్ణా బోర్డు ఆదేశించినా యథేచ్ఛగా కొనసాగిస్తోంది. ఏటా ఇదే కథ. ఏపీ ప్రయోజనాల్ని పరిరక్షించేందుకే రాయలసీమ ఎత్తిపోతలను ప్రభుత్వం చేపట్టిందని ఏపీ అధికారులు వాదిస్తున్నారు.

దీంతో తెలుగు రాష్ట్రాల జలవివాదాల పరిష్కారం నేరుగా సుప్రీంకోర్టు చెంతకు పోయినట్లయింది.

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   5 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   2 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   4 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   8 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   11 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   12 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle