నిర్మల్లో కరోనా అలర్ట్.. పక్కాగా లాక్ డౌన్ అమలు
03-04-202003-04-2020 12:46:50 IST
Updated On 03-04-2020 13:18:03 ISTUpdated On 03-04-20202020-04-03T07:16:50.345Z03-04-2020 2020-04-03T07:16:11.616Z - 2020-04-03T07:48:03.833Z - 03-04-2020

దేశవ్యాప్తంగా 10 రోజులు పూర్తయింది. తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో లాక్ డౌన్ పూర్తిగా అమలు చేయడం జరుగుతుందని కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ తెలిపారు. నిర్మల్ జిల్లాలో 900 మంది 14 క్వారంటైన్ రోజుల కొరెంటైన్ పూర్తి చేసుకున్నారని, ఇంకా 120 మంది క్వారంటైన్ త్వరలో పూర్తవుతుందని చెప్పారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన యాభై మందిని శనివారం రోజు పాలిటెక్నిక్ కళాశాలకు మరుసటి రోజు కెజిబివి పాఠశాలలో క్వారంటైన్ చేయడం జరిగిందన్నారు. నిర్మల్ కు కరోనా రావడంతో అంతా అలర్ట్ అయ్యారు. ఇసాక్ అనే వ్యక్తి కరోనా వ్యాధి లక్షణాలతో ఇబ్బంది పడగా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అక్కడ నుండి గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందించగా అక్కడ మృతి చెందడం జరిగింది, ఇసాక్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తరువాత పదకొండు రోజు అనగా 30 వ తేదీన లక్షణాలు కనిపించి, 14 వ రోజున మృతి చెందాడని కలెక్టర్ తెలిపారు. ఇసాక్ కరోనా వ్యాధితోనే చనిపోవడం జరిగిందని నిర్ధారించారు డాక్టర్లు . ఇసాక్ తో సన్నిహితంగా మెలిగిన 36 మందిని గుర్తించి క్వారంటైన్ హోంకు తరలించి, వారి శాంపిల్స్ తీసుకుని గాంధీ ఆసుపత్రికి పంపించామన్నారు. ఇసాక్ ఇంటి చుట్టుపక్కల కిలోమీటరు దూరం వరకు ఇంటింటికి వెళ్లి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది, డెబ్బై వేల మంది కవర్ అయేటట్లు పరీక్షలు చేస్తున్నామని, కరోనా వ్యాధిని కంట్రోల్ చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజుల వరకు కఠినమైన ఆంక్షలు అమలు చేస్తామన్నారు. నిర్మల్ పట్టణంలో వాహనాలు తిరగడం పూర్తిగా నిషేధించామని, అవసరం ఉంటేనే ప్రజలు బయటికి రావాలని లేదంటే వాహనాలు సీజ్ చేస్తామన్నారు. జోహ్రా నగర్ కాలనీకి అర కిలోమీటర్ వరకు అన్ని రోడ్లు బంద్ చేశామన్నారు. వారికి అవసరమయిన నిత్యావసరాలు ప్రభుత్వపరంగా డీఎస్వో ద్వారా పంపిణీ చేస్తామన్నారు. ఆ కాలనీలో వంద శాతం లాక్ డౌన్ అమలు చేస్తామన్నారు. ఒకరినొకరు ఇన్ఫెక్ట్ చేసే కేసులు వస్తున్నాయని, .పిల్లలు వృద్ధులు అత్యంత జాగ్రత్త పడాలని, ప్రభుత్వ ఆసుపత్రులు సరిపోకపోతే ప్రైవేటు ఆసుపత్రులను వాడుకుంటామన్నారు కలెక్టర్. ఎవరికైనా కరోనా వ్యాధి లక్షణాలుంటే స్వచ్ఛందంగా రావాలని, ప్రభుత్వం దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వంతో సహకరించాలని ఆయన కోరారు. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కూరగాయల మార్కెట్ ను మూసివేస్తున్నామని, నిర్మల్ పట్టణంలో ఎనిమిది చిన్న చిన్న కూరగాయల మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలో రెండు లక్షల ఐదు వేల రేషన్ కార్డులుండగా ఇప్పటికే డెబ్బై తొమ్మిది వేల కార్డులకు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేశామని, అన్ని శాఖలు కలిసి కరోనా వైరస్ ను ఆపాల్సిన బాధ్యత ఉందన్నారు జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ .

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
11 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
7 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
9 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
12 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
14 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
15 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
17 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
18 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
19 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
19 hours ago
ఇంకా