newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

నియోజకవర్గాల పెంపు ఎన్పీఆర్ మధ్య లింకు పెట్టారా?

01-03-202001-03-2020 12:37:27 IST
2020-03-01T07:07:27.506Z01-03-2020 2020-03-01T07:07:21.505Z - - 27-05-2020

నియోజకవర్గాల పెంపు ఎన్పీఆర్ మధ్య లింకు పెట్టారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇప్పుడున్న రెండు తెలుగు రాష్ట్రాలలో అధికార పార్టీలకు నియోజకవర్గాల పెంపు చాలా అవసరం. ఎందుకంటే అధికార టీఆర్ఎస్, వైసీపీ రెండు పార్టీలు మరే ఇతర పార్టీలలో లేనంతగా నేతలతో ఫుల్ లోడ్ అయి ఉన్నాయి. అటు ఏపీలో శాసన మండలి రద్దు నిర్ణయంతో వచ్చే ఎన్నికలలో నేతలు ఎమ్మెల్యే స్థానాలపై చాలా ఆశలు పెట్టుకున్నారు.

మరోవైపు తెలంగాణలో దాదాపు అన్ని పార్టీలలో నలుగురైదుగురు మినహా మిగతా మేలైన నేతలందరినీ గులాబీ పార్టీ ఆకర్షించి కారెక్కించుకుంది. ఇప్పుడు ఆ పార్టీకి నియోజకవర్గాల పెంపు చాలా అవసరం. రాష్ట్ర పరిధిలోది.. కేసీఆర్ చేతిలో పని కావడంతో అనుకున్న దానికన్నా ఎక్కువగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే, నియోజకవర్గాల పెంపు అంశం కేంద్రం పరిధిలోది.

నిజానికి రాష్ట్ర విభజన అనంతరమే రెండు రాష్ట్రాలలో ఈ ఆశలు మొదలయ్యాయి. ఒక్క తెలంగాణ విషయమే తీసుకుంటే ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి రెండు అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 34 కొత్త స్థానాలు ఏర్పడతాయి. దీంతో మంత్రివర్గంలో మంత్రుల సంఖ్య కూడా పెరుగుతుంది. వీటితో పాటే ఎమ్మెల్సీల సంఖ్య కూడా పెరుగుతుంది.

అదే జరిగితే మరో నలభై, యాభై మంది నేతలకు పదవులు దక్కుతాయి. ఇక ఏపీలో మండలి రద్దుతో వైసీపీకి అయితే సీట్ల పెంపు జరగకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అసంతృప్తులను చల్లార్చడం ఆ పార్టీ పెద్దల వలన జరగని పని అని ఇప్పటికే రాజకీయ మేధావుల మాట. అందుకే కొత్త, పాత తేడా లేకుండా అందరూ సీట్ల పెంపుపై ఆశలు పెట్టుకున్నారు.

ఇంతగా రెండు రాష్ట్రాలు ఆశలు పెట్టుకున్నా కేంద్రం మాత్రం 2026 వరకు ఆ విషయం జోలికి వెళ్లే అవకాశమే లేదని తేల్చిచెప్పడం విశేషం. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తాజాగా ఈ విషయంపై మరోసారి స్పష్టత ఇచ్చారు. వచ్చే ఏడాది జనన గణన లెక్కలు.. అనంతరం 2026కి సీట్ల పెంపు ఆలోచన చేస్తామని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

అయితే, కేంద్రం తీసుకొచ్చిన సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లను రెండు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. మరీ ముఖ్యంగా సీఎం కేసీఆర్ అయితే కత్తికట్టికొని ఉన్నారు. నియోజకవర్గాల పెంపు వలన బీజేపీకి రెండు రాష్ట్రాలలో కూడా ఒరిగేదేమీ లేదు. ఆ పార్టీకి అవసరం లేదు. అవసరం ఉన్న రాష్ట్రాల పార్టీలు కేంద్రానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ రాష్ట్రాలలో వాటి ప్రకారం జననగణన కూడా సక్కగా జరుగుతుందో లేదో కూడా అనుమానమే. అందుకే దాని తర్వాతే సీట్ల పెంపు అని మెలిక పెట్టారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

 

 

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

   an hour ago


రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

   2 hours ago


ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

   2 hours ago


కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

   2 hours ago


లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక నిర్ణయం

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక నిర్ణయం

   3 hours ago


కన్నాపై మంత్రి వెల్లంపల్లి హాట్ కామెంట్స్

కన్నాపై మంత్రి వెల్లంపల్లి హాట్ కామెంట్స్

   3 hours ago


ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై బండి సంజ‌య్ ఆశ‌లు నెర‌వేరేనా..?

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై బండి సంజ‌య్ ఆశ‌లు నెర‌వేరేనా..?

   3 hours ago


హైకోర్టు ఆగ్రహం.. 49 మంది వైసీపీ నేతలకు నోటీసులు!

హైకోర్టు ఆగ్రహం.. 49 మంది వైసీపీ నేతలకు నోటీసులు!

   5 hours ago


తెలంగాణలో వైరస్ ఉధృతి.. టెస్టులు తక్కువ.. కేసులు ఎక్కువ!

తెలంగాణలో వైరస్ ఉధృతి.. టెస్టులు తక్కువ.. కేసులు ఎక్కువ!

   5 hours ago


ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   18 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle