newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

నిన్నటి దాకా మీ ద్వేషిని.. నేడు అభిమానిని.. కేటీఆర్ కు నెటిజన్ ట్వీట్!

21-04-202021-04-2020 15:02:33 IST
Updated On 21-04-2020 15:23:36 ISTUpdated On 21-04-20202020-04-21T09:32:33.879Z21-04-2020 2020-04-21T09:32:30.904Z - 2020-04-21T09:53:36.613Z - 21-04-2020

నిన్నటి దాకా మీ ద్వేషిని.. నేడు అభిమానిని.. కేటీఆర్ కు నెటిజన్ ట్వీట్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ మంత్రి.. ప్రభుత్వంలో నెంబర్ 2 స్థానంలో ఉన్న కేటీఆర్ ను అయన పార్టీ వారు.. రాజకీయ వర్గాలలో కొందరు షాడో సీఎంగా పిలుచుకుంటారు. అందుకు తగ్గట్లే కేటీఆర్ ఇటు ప్రభుత్వంలో అటు పార్టీలో ఎంతో చురుకుగా ఉంటారు. ఇక కేటీఆర్ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటారు. అయితే ఆయనేం ఏదో కాలయాపనకో.. లేక సరదాకో సోషల్ మీడియాలో ఉండరు.

సోషల్ మీడియా.. ముఖ్యంగా ట్విట్టర్ ద్వారానే ఆయన ఇప్పటికే చాలా మందికి సహాయపడ్డారు. గత రెండు రోజుల క్రితం జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. హైదరాబాద్ లోని బోరబండకి చెందిన ఓ వ్యక్తి భార్య చనిపోతే రెండేళ్ల బాబును తానే దగ్గరుండి చూసుకుంటున్నారు. అయితే బాబు అర్ధరాత్రి పాల కోసం ఏడుపు ఆపకపోవడం.. లాక్ డౌన్ వేళ బయట దొరికే పరిస్థితి లేకపోవడంతో కేటీఆర్ కు ట్వీట్ చేశారు.

అంతే నగర డిప్యూటీ మేటర్ ఫసియుద్దీన్ బోరబండకి వెళ్లి ఆవ్యక్తి అవసరాలను తీర్చారు. ఇదొక్కటే కాదు.. ఎన్నో సమస్యలు.. పోలీసుల వద్దకి వెళ్లినా స్పందన లేని కేసులను కూడా కేటీఆర్ దృష్టికి తేవడంతో పరిష్కారాలు చూపడం వంటి ఎన్నో సందర్భాలు చూసాం. అయితే.. ఇప్పుడు మాత్రం ఓ నెటిజన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

సుధీర్ అనే యువకుడు ట్విట్టర్ లో 'నేను తెలంగాణకు చెందినవాడిని కాదు.ఇన్నాళ్లుగా మిమ్మల్నీ, మీ నాన్నని ద్వేషించాను. కానీ ఇప్పుడు మీ పాలన చూసి అభిమానిగా మారిపోయాను. ఒక్క తెలంగాణకే కాదు.. దేశం మొత్తం మీ న్యాయకత్వాన్ని పొందుతుందని ఆశిస్తున్నాను'. అంటూ కేటీఆర్ ని ఉద్దేశించి ట్వీట్ చేశాడు. కాగా... ఆ నెటిజన్ ట్వీట్ కి కేటీఆర్ స్పందించిన తీరు మరింత ఆకట్టుకుంటోంది.

‘‘మీ ఫ్రాంక్‌నెస్‌కు, నిష్కల్మష ప్రవర్తనకు ధన్యవాదాలు. మీలో వచ్చిన పరివర్తనకు అభినందనలు. మీ హృదయంలో ద్వేషం స్థానంలో అభిమానం చోటుచేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అంటూ కేటీఆర్ రిప్లై ఇచ్చారు. ఇప్పుడు వీరి సంభాషణ ట్విట్టర్ లో హైలెట్ గా నిలిచింది. నెటిజన్ ట్వీట్ బదులుగా మరికొందరు నెటిజన్లు అదే అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తాము అదే నమ్ముతున్నామన్నారు.

మొత్తం ఈ ట్వీట్స్ తో తెలంగాణ ప్రజలు.. కేటీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. నిజానికి తెలంగాణ ఉద్యమ కాలంలో తలంగాణేతరులకు కేసీఆర్ పై చాలా వ్యతిరేకత ఉండేది. ఉద్యమంలో భాగంగా స్థానికత ఆధారంగా ద్వేషాలు తీవ్రంగా ఉండేవి. అందుకే ఇతర రాష్ట్రాల నుండి వచ్చి తెలంగాణలో ఉండే వారంతా అదే అభిప్రాయంతో ఉండేవారు.

కానీ, ఒక్కసారి ప్రభుత్వం ఏర్పాట్లయ్యాక ఆరేళ్ళ కాలంలో ఎక్కడా కూడా స్థానికత ఆధారంగా విద్వేషాలు లేనేలేవు. మరోవైపు పాలనలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం మెరుగైన ఫలితాలను సాధిస్తుందనే అభిప్రాయం ప్రజలలో నెలకొంది. దీంతో ఒకనాడు ద్వేషంతో నిండిన మనసులలో మెల్లగా ప్రేమ మొదలైంది. అదే సుధీర్ అనే నెటిజన్ ద్వారా బయటకి వచ్చింది. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle