newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

నిధుల సంగతేంటి? కేంద్రంపై టీఆర్ఎస్ వత్తిడి

13-12-201913-12-2019 08:48:37 IST
2019-12-13T03:18:37.242Z13-12-2019 2019-12-13T03:17:03.083Z - - 22-02-2020

నిధుల సంగతేంటి? కేంద్రంపై టీఆర్ఎస్ వత్తిడి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేంద్రప్రభుత్వంపై వత్తిడి పెంచి మరిన్ని నిధులు తెచ్చుకునేందుకు టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తెలంగాణకు వివిధశాఖల కింద రావాల్సిన నిధులను వెంటనే విడుదలచేయాలని టీఆర్‌ఎస్ ఎంపీలు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ను కోరారు. గురువారం ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్షనేత నామా నాగేశ్వర్‌రావు నేతృత్వంలోని ఎంపీలు.. నిధుల విడుదలకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖను అందజేశారు. 

జీఎస్టీ కింద రాష్ట్రానికి రూ.4,531 కోట్లు విడుదల కావాలని, రాష్ట్ర విభజన చట్టం కింద వెనుకబడిన జిల్లాలకు రూ.450 కోట్లు, స్థానిక సంస్థలకు 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.135 కోట్లు, 2019-20కి సంబంధించి రూ.177 కోట్లు విడుదలకావాలని తెలిపారు. పట్టణ స్థానిక సంస్థలకు రూ.393 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు.

మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు నీతి ఆయోగ్ సిఫారసు చేసిన ప్రకారం.. రూ.24,205 కోట్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు. కేంద్రం రాష్ట్రం పట్ల ఉదారంగా వ్యవహరించాలని కోరారు.

కేంద్రం నిధుల విడుదల జాప్యం ప్రభావం రాష్ట్ర అభివృద్ధి పనులపై పడుతుందని నామా తెలిపారు. ఆర్థికమాంద్యం ప్రభావం రాష్ట్రాలపై పడుతుందని, కేంద్రం వెంటనే స్పందించాలని కోరారు.  కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని.. నిధుల విడుదలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.

కేంద్రమంత్రిని కలిసినవారిలో ఎంపీలు బీబీ పాటిల్, పీ రాములు, పసునూరి దయాకర్, రంజిత్‌రెడ్డి, ఎం శ్రీనివాస్‌రెడ్డి, మాలోతు కవిత, బీ వెంకటేశ్, బడుగుల లింగయ్య యాదవ్, బండా ప్రకాశ్ వున్నారు.

కేంద్రమంత్రి గడ్కరీని కలిశారు టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు. కోదాడ- ఖమ్మం రహదారిని భారత్‌మాల పరియోజన పథకం కింద చేర్చాలని,  నాలుగు లైన్లుగా విస్తరించాలని ఆయన కోరారు. 

Image

కేంద్రం తెలంగాణ వినతులకు ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటికే నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్న రాష్ట్రప్రభుత్వం పొదుపు చర్యలను చేపడుతోంది. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో మంత్రిత్వ శాఖలకు సీఎం కేసీయార్ దిశానిర్దేశం చేశారు. 

 

 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   4 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   5 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   6 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   7 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   7 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   8 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   9 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   10 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   10 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   11 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle