newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

నిజామాబాద్‌లో బహిరంగ సభ.. పౌరసత్వ చట్టంపై నిరసన

27-12-201927-12-2019 09:35:20 IST
Updated On 27-12-2019 11:01:17 ISTUpdated On 27-12-20192019-12-27T04:05:20.917Z27-12-2019 2019-12-27T04:05:07.412Z - 2019-12-27T05:31:17.629Z - 27-12-2019

నిజామాబాద్‌లో బహిరంగ సభ.. పౌరసత్వ చట్టంపై నిరసన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జాతీయ పౌరసత్వ సవరణ చట్టం. ఎన్నార్సీని వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు నిజామాబాద్‌లో బహిరంగ సభలో పాల్గొంటున్నాయి. మజ్లిస్ నిర్వహించే ఈ సభకు హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, వామపక్ష నేతలు హాజరవుతున్నారు. నిజామాబాద్ ఖిల్లా ఈద్గా మైదానంలో సాయంత్రం 6 గంటలకు ఈ సభ ప్రారంభమవుతుంది.

ఈసభకు హాజరవ్వాలని బీజేపీయేతర అన్ని రాజకీయ పార్టీలకు ముస్లిం సంస్థల ప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు కోరారు. వామపక్షాలు ఈ సభకు హాజరుకానున్నాయి. ఎన్నార్సీ, సీఏఏను ఉపసంహరించుకునేంత వరకు ఐక్యంగా ఉద్యమిస్తామని అన్నారు. జాతీయ జనగణను  కూడా తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.

మోదీ ప్రభుత్వం ద్వంద్వ విధానాలను అనుసరిస్తుందని విమర్శించారు.  సీఏఏ, ఎన్నార్సీలను అంగీకరించే ప్రసక్తే లేదని ఎంఐఎం, టీఆర్ఎస్, వామపక్షనేతలు అన్నారు. బహిరంగ సభ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ సభకు సుమారు వేయి మంది పోలీసులతో బందోబస్తు చేపట్టనున్నారు. మెదక్, కామారెడ్డి, సిద్దిపేట నుంచి పోలీసులు బందోబస్తుకు రానున్నారు. 

నిజామాబాద్ సభపై బీజేపీ మండిపడింది. యూపీఏ ప్రభుత్వం 2010లో ప్రారంభించిన ఎన్‌పీఆర్‌ ప్రక్రియను కొనసాగిస్తున్నామని, ఎన్నార్సీ, ఎన్ పీఆర్ లపై విపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ చేస్తున్నది బీజేపీపై యుద్ధభేరి కాదని దేశ ప్రజాస్వామ్యంపై దాడి అని, దీనిని భారత సమాజం తిప్పికొడుతుందని బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు.

పౌరసత్వ సవరణ చట్టం, ఎన్పీఆర్‌కు వ్యతిరేకంగా కేసీఆర్‌ జన వరి 30న హైదరాబాద్‌లో ‘గాంధీ కావాలా? గాడ్సే కావాలా?’అన్న నినాదంతో సభ నిర్వహించాలని ఆలోచించడం దారుణం అన్నారు. ప్రజల మధ్య విభజన తీసుకురావాలని ఆలోచించడం శోచనీయం అన్నారు. 

 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   5 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   6 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   7 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   8 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   8 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   9 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   10 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   11 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   11 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   12 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle