newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నిండుకుండలా సాగర్.. టూరిస్టులు రావొద్దంటున్న అధికారులు

24-08-202024-08-2020 14:09:25 IST
Updated On 24-08-2020 14:19:15 ISTUpdated On 24-08-20202020-08-24T08:39:25.745Z24-08-2020 2020-08-24T08:38:49.071Z - 2020-08-24T08:49:15.152Z - 24-08-2020

నిండుకుండలా సాగర్.. టూరిస్టులు రావొద్దంటున్న అధికారులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కర్నాటక నుంచి వస్తున్న భారీవరద నీటితో నాగార్జునసాగర్ డ్యామ్ నిండుకుండలా మారిపోయింది. ఈ ప్రవాహంతో జలాశయం కళకళలాడుతోంది. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ప్రాజెక్టుకు సంబంధించిన 16 గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు.

ఇటు కృష్ణా పరీవాహ ప్రాంతంలోని ప్రాజెక్టులలు నిండిపోయాయి. డ్యామ్‌లన్నీ పూర్తిస్థాయి నీటిమట్టంతో కొనసాగుతున్నాయి. కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్ పూర్తిగా నిండటమే కాకుండా.. వరద ఉధృతి కొనసాగుతుండటంతో ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి భారీ వరద ప్రవాహం కొనసాగుతుండటంతో తుంగభద్ర జలాశయం, శ్రీశైలం జలాశయం నిండిపోయాయి. 

నాగార్జున సాగర్  సుందర దృశ్యాలను చూడటానికి పర్యాటకులు పోటెత్తుతున్నారు. అయితే.. కరోనా నేపథ్యంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టును చూడటానికి పర్యాటకులు ఎవరూ అక్కడికి రావొద్దని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వరద ఉధృతి కొనసాగుతుండటంతో ప్రాజెక్టు వద్దకు రావడం కూడా ప్రమాదకరమని అధికారులు హితవు పలికారు.

దీంతో నాగార్జున సాగర్‌ డ్యామ్ ప్రాంతంలో 144 సెక్షన్‌ విధించినట్లు పోలీసులు తెలిపారు. సాగర్‌కు దారి తీసే రహదారుల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. జలాశయం పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నీటి ప్రవాహం పెరిగితే నీటి విడుదల పెరుగుతుందని తెలిపారు. 

శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 883.90 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో గేట్లు ఎత్తి నీటికి దిగువకు విడుదల చేస్తున్నాయి. దీంతో నాగార్జునసాగర్ డ్యామ్‌కు వరద నీరు భారీగా చేరుకుంటోంది. ఇటు నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం సాగర్‌లో నీటి మట్టం 587.50 అడుగులుగా ఉంది. ఆదివారం ఉదయం సాగర్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3,70,903 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 305.84 టీఎంసీలుగా ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు.

నా రూటే సెప‌రేటు

నా రూటే సెప‌రేటు

   30 minutes ago


బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   14 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   15 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   14 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   18 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   20 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   18 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   20 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   21 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   16 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle