newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నిండా ముంచేసిన మంత్రి మల్లారెడ్డి ముడుపుల వ్యవహారం!

17-01-202017-01-2020 08:45:26 IST
2020-01-17T03:15:26.587Z17-01-2020 2020-01-17T03:15:22.122Z - - 14-04-2021

నిండా ముంచేసిన మంత్రి మల్లారెడ్డి ముడుపుల వ్యవహారం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మున్సిపల్ ఎన్నికలను తెరాస పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోరాటం చేస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్షాలు బలంగా లేకపోయినా జరిగేది అర్బన్, సిటీ ప్రజల ఓటింగ్ తో నడిచే ఎన్నికలు కావడంతో అధికార పార్టీ అయినా చాలా సెన్సెటివ్ గా పనిచేస్తుంది. దీనికోసం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో సమానంగా కమిటీలను వేసి స్థానికంగా వార్డు లెవల్ నుండి పార్టీని యాక్టివ్ చేసి ఎన్నికలకు వెళ్తుంది.

దీని కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ కూడా పండగను కూడా పక్కనబెట్టి సమీక్ష సమావేశాలు, దిశానిర్దేశాలతో నిత్యం పార్టీతో మమేకమై నడిపిస్తున్నారు. ఇక సీఎం కేసీఆర్ ఇప్పటికే ఈ ఎన్నికలను మంత్రులు, ఎమ్మెల్యేల బాధ్యతగా అప్పగించారు. ఎవరి పరిధిలో ఉండే మున్సిపల్, కార్పొరేషన్ వారి బాధ్యతగా కమిటీలు వేసి నెత్తికెత్తారు. మరోవైపు కేటీఆర్ నాయకత్వానికి ఇది రెఫరెండంగా ప్రచారం జరుగుతుంది.

ఈ ఎన్నికలలో ఎక్కడ ఓటమి జరిగితే అక్కడ ఎమ్మెల్యేలు మంత్రులదే బాధ్యత కాగా ఎమ్మెల్యేలకు ఓటమి నష్టం ఎంత ఉంటుందో కానీ మంత్రులు మాత్రం సమాధానం చెప్పుకోవాల్సిందే. ఇప్పటికే తేడా వస్తే మంత్రి పదవి ఓడినా ఆశ్చర్యం లేదని గులాబీ బాస్ మొహమాటం లేకుండా మీటింగ్ పెట్టి మరీ చెప్పారు. దీంతో మంత్రులు ఎక్కడిక్కడ  చావోరేవో అన్నట్లుగా పోరాడుతున్నారు.

ఇక ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎంత ప్రతిష్టాత్మకంగా భావించినా లీడింగ్ లో ఉన్న పార్టీ అసలే.. స్థానికంగా కూడా బలపడే క్రమంలో వలసలను ప్రోత్సహించిన పార్టీ కూడా కావడంతో అసంతృప్తుల బెడద కూడా తెరాస పార్టీకి గట్టిగానేఉంది. ఇప్పటికే రెబల్స్ ను సస్పెండ్ చేసేందుకు కూడా పార్టీ సిద్ధంగా ఉంది. అయితే ఈక్రమంలో మంత్రి మల్లారెడ్డి ముడుపుల వ్యవహారం ఒకటి రాష్ట్రంలో సంచలనం రేపుతోంది.

ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ ఇప్పించేందుకు మంత్రి మల్లారెడ్డి డబ్బులు డిమాండ్ చేశారని చెబుతున్న ఓ ఆడియో ఇంటర్నెట్లో హల్చల్ అవుతోంది. తెరాస నాయకుడు రాపోలు రాములుతో కలిసి మల్లారెడ్డి మాట్లాడుతున్న ఆడియోగా ఇది వైరల్ అవుతుంది. ఇందులో మల్లారెడ్డి డబ్బులు డిమాండ్ చేసినట్లు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని రాములు చెప్పడం విశేషం.

మల్లారెడ్డి నియోజకవర్గంలో పలు కార్పోరేషన్లలో ఇదే తరహా విమర్శలు వినిపించాయి. ఇప్పటికే ఫిర్జాధీగూడ కార్పోరేషన్ పరిధిలో దర్గా దయాకర్ రెడ్డి అనే నాయకుడు మల్లారెడ్డి ముడుపులు తీసుకొని టికెట్లు కేటాయించారని ఆరోపిస్తూ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి బీ-ఫామ్ కూడా తీసుకున్నారు. అయితే ఆ తర్వాత మల్లారెడ్డి రంగప్రవేశం చేసి మతలబు చేశారు. దీనిపై ఇప్పటికీ స్పష్టత లేదు. కాగా, ఇప్పుడు ఇలా రాపోలు రాములు అదే విమర్శలు చేస్తూ ఓ ఆడియోను బయట పెట్టారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై పెద్దలు గరంగరం అవుతుండగా ఈ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాల్సిఉంది.

 

 

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   4 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   5 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   4 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   8 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   9 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   8 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   10 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   11 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   6 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   12 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle