newssting
BITING NEWS :
* దేశంలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 1,51,767.. 4337 మరణాలు * ప్రభుత్వ భూములు అమ్మేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 474 సస్పెండ్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన డాక్టర్ శైలజ *లాక్‍డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై పిటిషన్‍ను హైకోర్టులో విచారణ *విశాఖ ఎల్జీ పాలిమర్స్ మృతులకు మహానాడు నివాళి. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ50వేల ఆర్ధిక సాయం ప్రకటించిన చంద్రబాబు *ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం పై హైకోర్టులో విచారణ *సీఆర్డీఏ చట్టం, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు పై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు లో విచారణ.. జూలై 22 కి వాయిదా *గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం *ఏపీలో మరో 68 కరోనా కేసులు.. మొత్తం కేసులు 2787 *తెలంగాణలో 71 పాజిటివ్ కేసులు .... ఇప్పటి వరకు 1991 కేసులు*ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య .. అస్వస్థతకు గురై ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన వెంకాయమ్మ..మరోసారి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో మృతి

నాయకుడిపై నమ్మకముంది కాబట్టే ఏం చెప్పినా జనం నమ్ముతున్నారు: కేటీఆర్

27-04-202027-04-2020 16:02:52 IST
Updated On 27-04-2020 16:07:25 ISTUpdated On 27-04-20202020-04-27T10:32:52.611Z27-04-2020 2020-04-27T10:32:49.557Z - 2020-04-27T10:37:25.449Z - 27-04-2020

నాయకుడిపై నమ్మకముంది కాబట్టే ఏం చెప్పినా జనం నమ్ముతున్నారు: కేటీఆర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జలదృశ్యం నుంచి ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర సమితి.. కేసీఆర్‌ నాయకత్వంలో ఒక సుజల దృశ్యాన్ని ఆవిష్కరించే స్థాయికి చేరుకుందని, ఆయన నాయకత్వాన్ని నమ్మి ప్రజలిస్తున్న సహకారం వల్లే కరోనా మహమ్మారిని కూడా ధిక్కరించి తెలంగాణ ప్రగతి పథంలో సాగుతోందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. టీఆర్‌ఎస్‌ 19ఏళ్లు పూర్తిచేసుకుని నేడు (ఏప్రిల్‌ 27) 20వ పడిలోకి అడుగిడుతున్న సందర్భంగా ఆదివారం మీడియాతో ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

ఒక లక్ష్యంతో ఆవిర్భవించిన రాజకీయ పార్టీ దేశంలో 2 దశాబ్దాల పాటు మనగలగడం ప్రజల ఆశీర్వాదంతోనే సాధ్యమైంది. తానెంచుకున్న ఎజెండాను విజయవంతంగా అమలుచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకెళ్లడం కూడా ప్రజల సహకారంతోనే సాధ్యమవుతోందని కేటీఆర్ చెప్పారు. ‘పదునైన ఉద్యమ నాయకుడు పాలనాదక్షుడిగా పేరు తెచ్చుకోవడం కేసీఆర్‌లో చూశా’అని అరుణ్‌జైట్లీ గతంలో ఓసారి అన్నారు. ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఒక లక్ష్యాన్ని అనుకుని సాధించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తన ఆత్మకథలో ప్రస్తావించారని కేటీఆర్ గుర్తు చేశారు.

ప్రొఫెసర్‌ జయశంకర్, విద్యాసాగర్‌రావు వంటి ఎందరో మేధావులు, తెలంగాణ ప్రజలు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఇచ్చిన స్ఫూర్తితోనే తెలంగాణ సాధ్యమైంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ప్రజల ఆశీర్వాదంతో గెలుపొందిన టీఆర్‌ఎస్‌ రెండు దశాబ్దాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగింది. స్వాతంత్య్రం తర్వాత జాతీయ, ప్రాంతీయ పార్టీల్లో రెండు దశాబ్దాలుగా మనుగడ సాధించిన పార్టీలు వేళ్లపై లెక్కపెట్టే సంఖ్యలోనే ఉన్నాయి. రెండు దశాబ్దాలకు పైబడి ప్రజా జీవితంలో ఉన్న ఒకపార్టీకి ఇంత ఆదరణ, అభిమానం లభించడం అపురూపం. ప్రస్తుతం 60లక్షల మంది కార్యకర్తలతో టీఆర్‌ఎస్‌ను అజేయశక్తిగా నిలిపిన కార్యకర్తలు, ప్రజలకు శిరసువంచి పాదాభివందనం చేస్తున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు.

గతంలో బెంగాల్, గుజరాత్‌ నమూనాల తరహాలో, ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ కొత్త మోడల్‌ను ఆవిష్కరిస్తోంది. తెలంగాణలో జల విప్లవం ఆధారంగా రెండో హరిత విప్లవం, నీలి విప్లవం (మత్స్యసంపద), క్షీర విప్లవం (పాడి పరిశ్రమ), పింక్‌ రివల్యూషన్‌ (మాంస పరిశ్రమ) అనే పంచవిప్లవం రాబోతోంది. వీటి ద్వారా రాష్ట్ర ముఖచిత్రం శాశ్వతంగా మారడంతో పాటు, లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది. భవిష్యత్తులో దేశానికే అన్నం పెట్టే స్థాయికి రాష్ట్రం చేరుతుంది. 

తెలంగాణ అస్తిత్వ పోరాట ఫలితంగా ఈరోజు తెలంగాణ సంస్కృతి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో తనదైన ముద్ర వేయడంతోపాటు, తెలంగాణ మోడల్‌ను రూపొందించడంలో కేసీఆర్‌ కృషి, పట్టుదల ఉన్నాయి. నిధులు, నీళ్లు, నియామకాల ప్రాతిపదికన తెలంగాణ ఉద్యమం శాంతియుతంగా నడిపించి, రాజకీయ పార్టీలను ఒప్పించి తూలనాడిన వాళ్లతోనే శభాష్‌ అనిపించుకున్నాం. కేసీఆర్‌ నాయకత్వంపై ప్రజలకు అచంచల విశ్వాసం ఉందనేందుకు జిల్లా పరిషత్‌ మొదలుకుని అన్ని రకాల ఎన్నికల ఫలితాలే నిదర్శనం. దేశ రాజకీయాలపై పరోక్షంగా ముద్ర వేస్తున్నాం. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తే మంచి పాత్ర పోషించాలనుకున్నాం. పార్లమెంటులో శాసించే స్థాయిలో టీఆర్‌ఎస్‌ లేకున్నా తెలంగాణ మోడల్, కేసీఆర్‌ పాలనను కేంద్రం, ఇతర రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకుంటున్నాయి. రైతుబంధు, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ వంటి పథకాలే దీనికి ఉదాహరణ అని కేటీఆర్ తెలిపారు. 

పార్టీలో సెకండ్‌ ఇన్‌ కమాండ్‌గానే కొనసాగుతా. కేసీఆర్‌ కార్యదక్షత, నాయకత్వం తెలంగాణకు మరో 15–20ఏళ్లు అవసరం. ఎవరైనా ఏదైనా చేస్తున్నారంటే వెయ్యి శాతం క్రెడిట్‌ కేసీఆర్‌దే. మేం డబ్బా కొట్టుకోవట్లేదు. కానీ దేశంలో క్వాలిటీ లీడర్‌షిప్‌ తెలంగాణలోనే ఉంది. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు సహజం. కాంగ్రెస్‌తో సహా ఎవరూ ఒకే పార్టీలో జీవిత కాలం కొనసాగరు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులుండాలని ప్రజలు కోరుకోవాలి.. పార్టీలు కాదు. ప్రతిపక్షాలు వద్దని, కేసీఆర్‌ కావాలని ప్రజలు అనుకుంటున్నారు. మేం తప్పుచేస్తే ప్రజలు మమ్మల్ని ఇంటికి పంపుతారు. రాజకీయ పార్టీలు మనగలగాలంటే ప్రజల విశ్వాసం పొందాలి. మేం రెండు దశాబ్దాల్లో ఎన్నో అవమానాలు, గెలుపోటములు చవిచూశాం. 

లక్ష్యం దిశగా ఉద్యమాన్ని నడిపేందుకు కేసీఆర్‌ అనుసరించిన వ్యూహంపై భవిష్యత్తులో పుస్తకాలు, పరిశోధన గ్రంథాలు వస్తాయి. కేసీఆర్‌ నాయకత్వ తీరుపై కథలుకథలుగా చెప్పుకుంటారు. కరోనా సంక్షోభ సమయంలో కేసీఆర్‌ నాయకత్వ పటిమను దేశం ఆమోదిస్తోంది. చాలా రాష్ట్రాలు సీఎంకు సెల్యూట్‌ చేస్తూ ధీరోదాత్తంగా వ్యవహరిస్తున్నారని అంటున్నాయి. లాక్‌డౌన్‌ పొడిగింపు, చికెన్‌ తినడం, సీ విటమిన్‌ వంటి విషయాల్లో కేసీఆర్‌ చెప్పిన దానిని ప్రజలు ఆమోదిస్తున్నారు. నాయకుడిపై నమ్మకం ఉంటేనే ఇది సాధ్యం అని కేటీఆర్ గర్వంగా చెప్పారు.

రెండు దశాబ్దాల్లో టీఆర్‌ఎస్‌ ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. 2008, 2009లో ఎదురుదెబ్బలు తగిలినపుడు కేసీఆర్‌ ఫీనిక్స్‌లా లేచి తెలంగాణ సమాజాన్ని ఏకంచేశారు. జాతీయ పార్టీలు మోసం చేసినా అన్ని భావజాలాలకు చెందిన వారిని ఏకంచేసి కేంద్రంలో తప్పనిసరి పరిస్థితి సృష్టించి తెలంగాణ సాధించాం. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ఆమోదించడమే అత్యంత సంతృప్తినిచ్చింది. తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు మమ్మల్ని ప్రత్యర్థులుగా, ఆంధ్ర నాయకులు శత్రువులుగా చూసినా, ఎన్ని అవమానాలు పడినా చివరకు తెలంగాణ సాధించాం. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మేం కూడా ఫక్తు రాజకీయ పార్టీగా మారాం. తెలంగాణ వచ్చాక గిల్లికజ్జాలు పెట్టుకోకుండా అందరినీ కలుపుకుపోయాం. అందుకే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని కూడా ప్రజలు గెలిపించారని కేటీఆర్ గుర్తు చేశారు.

‘ఏంటి జుత్తు పెరిగినా కత్తిరించుకోవడం లేదు. మీ ఆవిడకు మీ తల ఎప్పుడు అప్పగిస్తారు’ అంటూ మంత్రి కేటీఆర్‌ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించడం సరదా సంభాషణకు దారితీసింది. ‘విరాట్‌ కోహ్లి వాళ్ల ఆవిడకు జుత్తు అప్పగించినపుడు నీకేం సమస్య అంటూ ఓ నెటిజన్‌ను ట్విట్టర్‌ వేదికగా కేటీఆర్‌ ఇటీవల ప్రశ్నించిన విషయం తెలిసిందే. దీనికి కేటీఆర్‌ సోదరి కవిత స్పందిస్తూ.. అన్నయ్యా వదినమ్మకు నువ్వు ఎప్పుడు అప్పగిస్తున్నావు అంటూ సరదాగా ప్రశ్నించారు. ఇదే విషయాన్ని ఆదివారం చిట్‌చాట్‌ సందర్భంగా మీడియా కేటీఆర్‌ వద్ద ప్రస్తావించింది. ‘ఇదుగో కోవిడ్‌ వల్ల నేను జుత్తు కత్తిరించుకోవడం లేదు. మా ఆవిడ కత్తిరిస్తానంటే మా అబ్బాయి మీద ప్రయోగం చేయమని చెప్తా. వాడికి కూడా జుత్తు బాగా పెరిగింది. వాడి కటింగ్‌ చూసిన తర్వాత నేను సంతృప్తి చెందితే నా జుత్తు అప్పగిస్తా’ అని సరదాగా సమాధానం ఇచ్చారు.

కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చే వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. జీవనశైలి మారడంతో పాటు ఇతర మార్పులను మనం స్వాగతించాలి. కరోనాపై పోరు విషయంలో అమెరికా, ఇటలీ సహా ఇతర రాష్ట్రాలతో మాకు పోటీలేదు. బయట జరుగుతున్న అన్ని విషయాలు సీఎం కేసీఆర్‌కు తెలుసు. ప్రస్తుత సంక్షోభ సమయంలో రాజకీయాలు వద్దు. రాష్ట్రాలను ఆదుకునేందుకు కేంద్రం ముందుకు రావాలని కేటీఆర్ సూచించారు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle