newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నాచారంలో భారీ అగ్ని ప్రమాదం

03-08-202003-08-2020 10:32:05 IST
2020-08-03T05:02:05.230Z03-08-2020 2020-08-03T04:57:57.825Z - - 14-04-2021

నాచారంలో భారీ అగ్ని ప్రమాదం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైదరాబాద్‌లోని పారిశ్రామిక వాడలను అగ్ని ప్రమాదాలు భయపెడుతున్నాయి. ఇంతకుముందే బాలానగర్, జీడిమెట్ల పారిశ్రామక వాడల్లో అగ్రి ప్రమాదాలు సంభవించాయి. తాజాగా నాచారంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నాచారం దగ్గర గల మల్లాపూర్ పారిశ్రామికవాడలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నిన్న( ఆదివారం ) సాయంత్రం రబ్బర్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.

ఆకస్మాత్తుగా వచ్చిన మంటలను చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పరిశ్రమకు సమీపంలో నివసించే వారు భయంతో తమ ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు.

స్థానికులు అందించిన సమాచారం మేరకు హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.పరిశ్రమలో ఉద్యోగులు ఎవరూ లేకపోవడంతో పెను నష్టం తప్పింది. ఆదివారం కావడంతో అందులో వారాంతపు సెలవులో ఉన్నారు.ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇది షార్ట్ సర్క్యూటా.. లేదా మరేమైనా కారణాలున్నాయా.. అనే కోణంలో విచారణ చేస్తున్నారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle