నల్లగొండలో ఎంపీ వర్సెస్ మంత్రి.. మాటల తూటాలు
01-06-202001-06-2020 09:05:49 IST
Updated On 01-06-2020 09:45:12 ISTUpdated On 01-06-20202020-06-01T03:35:49.822Z01-06-2020 2020-06-01T03:35:40.767Z - 2020-06-01T04:15:12.228Z - 01-06-2020

తెలంగాణ రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా వుండవు. అందునా ఉద్యమాల గడ్డ నల్లగొండలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతుంటాయి. తాజాగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధమే జరిగింది. నల్గొండలో జరిగిన ప్రభుత్వ సమావేశం రసాభాసగా మారింది. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి మధ్య మాటల యుద్ధమే జరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో ఇద్దరూ వాదులాడుకున్నారు. ఇద్దరు నేతలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. మంత్రి మాట్లాడుతుండగా.. ‘రుణమాఫీ ఎక్కడ చేశారు.. లెక్కలు చెప్పండి’ అంటూ ఉత్తమ్ నిలదీశారు. దీంతో ఇద్దరి మధ్య విమర్శలు మొదలయ్యాయి. సహనం కోల్పోయిన ఇద్దరు నేతలు ఒకానొక దశలో నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్లారు. ఆదివారం నల్గొండ జిల్లా కలెక్టర్ ఆఫీసులో జరిగిన షరతుల సాగు సన్నాహక సమావేశంలో ఈ ఘటన జరిగింది. మంత్రి, పీసీసీ చీఫ్ మధ్య సాగిన మాటలు అక్కడ ఉద్రిక్తతలకు దారితీశాయి. ఒక దశలో జగదీష్ రెడ్డి మాటలతో ఉత్తమ్ పై దాడిచేశారు. ‘‘మీరు ఎందుకు వచ్చారో మాకు తెలుసు. సమాధానం చెప్పే శక్తి మాకు ఉంది. చప్పుడు చేయకుండా కూర్చోండి. లేదంటే బయటికి పోండి. నువ్వు పీసీసీ అధ్యక్షుడిగా ఉండటం దురదృష్టకరం అని మీ పార్టీ వాళ్లే అంటున్నరు. నేను అంటలేను. ఈ జిల్లాకు సంబంధించిన మీ ఎమ్మెల్యేలే అంటున్నారు. నేను కాదు’’ అన్నారు దీంతో ఎంపీ ఉత్తమ్ కూడా తనదైన రీతిలో జగదీష్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ‘‘నువ్వు మంత్రి కావడం నల్గొండ జిల్లా దురదృష్టం అన్నారు. దీంతో మళ్ళీ జగదీష్ రెడ్డి మాట్లాడుతూ రూ.17 వేల కోట్ల రుణ మాఫీ చేసిన విషయం లెక్కలతో పాటు అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి చెప్పారు. దేశంలో రూ.లక్ష వరకు వేల కోట్ల రుణ మాఫీ చేసింది తెలంగాణ సర్కారే. 60, 70 ఏళ్ల మీ పాలనలో దేశం, రాష్ర్టం వెనకబడి పోయాయి. కనీసం రైతులకు మద్దతు ధర కల్పించలేదు. సోనియాగాంధీ, ఇందిరాగాంధీ సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో కరెంట్‌కు దిక్కులేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మర్యాద తప్పి లేచి మాట్లాడింది మీరు. మధ్యలోకి వచ్చింది మీరు. మధ్యలో రాకండని ముందే చెప్పిన. మీరు మాట్లాడినంత సేపు నేను మధ్యలో రాలేదు. ‘దిసీజ్ నాట్ ఎ డిబేట్.. దిసీజ్ నాట్ ఎ అసెంబ్లీ.. దిసీజ్ నాట్ఎ పార్లమెంట్’. ఎస్.. నేనేం చెప్పదల్చుకున్ననో అదే చెబుతున్నా. ఐ హ్యావ్ ఎ రైట్. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావ్ మధ్యలో. ఏయ్ ఆఫ్టర్ ఆల్ నువ్వేంది..? నీ లెక్కేంది..? ఎక్కువ మాట్లాడుతున్నావ్ నువ్వు. మధ్యలో ఎందుకు వచ్చినవ్. నువ్వు సీనియర్ లీడర్‌వి. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసినవ్. మంత్రిగా చేసినవ్. ఎంపీగా ఉన్నావ్. అడిగే హక్కు నీకు లేదిక్కడ.’’ అంటూ ఉత్తమ్ కి బదులిచ్చారు. అసెంబ్లీలో సీఎం వివరణ ఇస్తే మాట్లాడలేక పారిపోయింది నువ్వే. అందుకు సాక్ష్యం నేనే అంటూ మంత్రి మండిపడ్డారు. నీవే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. వాట్ ఈజ్ దిస్. వై డోంట్ యు కాల్ మి. ఇదేమన్నా మీ సొంత ఏరియానా? రుణ మాఫీ అయ్యిందా? నేనెక్కడ అసెంబ్లీ నుంచి పారిపోయా?మంత్రిగా మంచిగా బిహేవ్ చేయ్. అసెంబ్లీ లో రుణమాఫీ అయ్యిందా అని అడిగా.. నేనేం పారిపోలేదన్నారు ఉత్తమ్. జగదీశ్, ఉత్తమ్ మధ్య వాగ్వాదం జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అనంతరం జగదీష్ రెడ్డి కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. బానిస మనస్తత్వాలకు అలవాటు పడ్డ కాంగ్రెస్ నేతలకు రైతులు బాగు పడటం ఇష్టం లేదని, జూన్ 2 దశాబ్దాల కళ స్వరాష్ట్రం సాకారం అయిన రోజు.... రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ధర్నాలు చేస్తాం,. బ్లాక్ డే గా పాటిస్తాం అంటున్న కాంగ్రేస్ నేతలు ముమ్మాటికి తెలంగాణా ద్రోహులే అన్నారు. కాంగ్రెస్ నేతలు అభివృద్ది నిరోధకులుగా మారారని, ప్రభుత్వం మంచి చేసినా వ్యతిరేకిస్తున్నారన్నారు మంత్రి. కర్రు కాల్చి వాత పెట్టినా కాంగ్రెస్ పార్టీ నేతలకు బుద్ది రావడం లేదని, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర కుమార ప్రగల్భాలు మానుకోవాలని హితవు పలికారు. పదవుల కోసం సీమాంధ్ర నేతలకు అమ్ముడి పోయిన నీచ చరిత్ర ఉత్తమ్ దని, అసెంబ్లీలో ప్రాజెక్ట్ లపై మాట్లాడమంటే సరిగా ప్రిపేర్ కాలేదని పరువు పోగోట్టుకున్నారని ఉత్తమ్ ని ఏకిపారేశారు జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ నేతల్ని ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మంత్రి ఆవేశంగా అన్నారు.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
5 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
8 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
11 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
2 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
12 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
9 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
12 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
12 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
6 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
15 hours ago
ఇంకా