నలుగురు ఖైదీలు పరారీ.. గాంధీ ఆస్పత్రి గోడదూకి
27-08-202027-08-2020 14:51:05 IST
Updated On 27-08-2020 16:09:31 ISTUpdated On 27-08-20202020-08-27T09:21:05.710Z27-08-2020 2020-08-27T09:19:28.942Z - 2020-08-27T10:39:31.384Z - 27-08-2020

చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్న కొంతమంది ఖైదీలు కరోనా బారినపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రిలో వుంచారు. అయితే తాజాగా కరోనా చికిత్స పొందుతున్న నలుగురు ఖైదీలు పరారవ్వడం కలకలం సృష్టిస్తోంది. ఈ తెల్లవారుజామున నలుగురు ఖైదీలు ఆసుపత్రి నుంచి తప్పించుకున్నారు. గాంధీ ఆసుపత్రి ప్రధాన భవనం రెండో అంతస్తులోని బాత్రూమ్ గ్రిల్స్ తొలగించి పరారయ్యారు. కరోనా రోగులు కావడంతో వార్డు బయట పోలీసులు అప్రమత్తంగా ఉన్నప్పటికీ బాత్రూమ్ నుంచి పారిపోయారు. ఖైదీలను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు. గాంధీ ఆసుపత్రిలో 10 మంది ఖైదీలు చికిత్స పొందుతుండగా వారిలో నలుగురు ఖైదీలు పరారయ్యారని చర్లపల్లి జైలు పర్యవేక్షకుడు సంపత్ తెలిపారు. మిగిలిన ఖైదీలకు భద్రత కట్టుదిట్టం చేశారు. పారిపోయిన ఖైదీల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇదిలా వుంటే తెలంగాణలో కరోనా కేసుల తీవ్రత అదే విధంగా కొనసాగుతోంది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ నివేదిక ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,795 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1,14,483 కేసులు నమోదయ్యాయి. తాజాగా మంగళవారం కరోనా బారినపడి 8 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 788కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 872 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 86,095గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 27,600 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు తెలిపింది. నిన్న ఒక్కరోజే 60,386 టెస్టులు చేయగా వాటిలో 2,795 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కాగా.. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 11,42,480 టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 449, రంగారెడ్డి 268, నల్గొండ 164, ఖమ్మం 152, కరీంనగర్ 136, వరంగల్ అర్బన్ 132, కరీంనగర్ 127, మేడ్చల్ 113, సిద్ధిపేట్ 113, నిజామాబాద్ 112, మంచిర్యాల 106, మహబూబాబాద్ 102, జగిత్యాల 89, సూర్యపేట్ 86, పెద్దపల్లి 77, కామారెడ్డి 76, భద్రాద్రి 72, కామారెడ్డి 55, వనపర్తి 55, మహబూబ్ నగర్ 45, జనగామ 42 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
13 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
9 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
12 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
16 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
19 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
20 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా