newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నమో జ్యోతి విజయవంతం.. మోడీకి అండగా జనం

28-03-202028-03-2020 11:53:36 IST
Updated On 28-03-2020 12:05:19 ISTUpdated On 28-03-20202020-03-28T06:23:36.348Z28-03-2020 2020-03-28T06:23:21.992Z - 2020-03-28T06:35:19.219Z - 28-03-2020

నమో జ్యోతి విజయవంతం.. మోడీకి అండగా జనం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంపై పడగ విప్పిన కరోనా వైరస్ అంతానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రశంసలు లభిస్తున్నాయి. జనతా కర్ఫ్యూతో పాటు దేశమంతా లాక్ డౌన్ వల్ల సామాజిక దూరం ఏర్పడి వ్యాధి ఒకరి నుంచి మరొకరకి ప్రబలకుండా ఉంటుందని ప్రధాని పిలుపునిచ్చారు. తాజాగా ప్రధాని నిర్ణయాలను ప్రశంసిస్తూ అంతా ఆయనకు మద్దతు పలుకుతున్నారు. అందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా నమో జ్యోతి విజయవంతం అవుతోంది.

కరోనా పై యుద్ధంలో మోడీ దేశానికి కొండంత అండగా నిలిచారని. విపత్తు సమయంలో మోడీ ప్రధానిగా ఉండడం దేశ ప్రజల అదృష్టం అన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్. ప్రభుత్వాలకు సహకరించడం ద్వారానే కరోనాను ఎదుర్కోగలం అన్నారు. దబీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నమో జ్యోతి కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది.

మనల్ని, మన దేశాన్ని, ప్రపంచాన్ని కరోనా నుండి విముక్తి చేయాలని అన్ని జిల్లాల్లో కార్యకర్తలు తమ ఇంటి ముంగిట జ్యోతి వెలిగించి దేవుణ్ణి ప్రార్ధించారు. అనంతరం ప్యాకేజి ద్వారా 99 శాతం మంది పేద, మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపినందుకు తమ కుటుంబసభ్యులతో కలిసి కార్యకర్తలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నమస్కరించి కృతజ్ఞతలు తెలిపారు.  

బండి సంజయ్ కుమార్ నమో జ్యోతి కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు తమ సమీపంలో ఉన్న పేద ప్రజలకు తమ ఇళ్ల వద్ద భోజన ఏర్పాట్లు చేశారు. మరికొంత మంది కార్యకర్తలు పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. నమో జ్యోతి కార్యక్రమం అనంతరం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కరోనా పై పోరాటంలో కార్యకర్తలు మోడీకి అండగా నిలవాలన్నారు. ప్రపంచ యుద్ధ సమయంలో కూడా ప్రజలను ఈ విధంగా ఏ నాయకుడు ఆదుకోలేదు అని అన్నారు. ఇలాంటి విపత్తు సమయంలో మోడీ మన దేశ ప్రధానిగా ఉండడం ఈ దేశ ప్రజల అదృష్టం అని కొనియాడారు. కరోనా పై యుద్ధంలో మోడీ దేశానికి కొండంత అండ అని అన్నారు. 

మోడీ ప్రకటించిన 1.7 లక్షల ఆర్థిక ప్యాకేజీ వలన రాష్ట్రంలో 59లక్షల మంది జాబ్ కార్డులన్న ఉపాధి హామీ కూలీలకు, ఉజ్వల గ్యాస్ పొందిన 9.36 లక్షల కుటుంబాలకు, 45 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలకు, 5.5లక్షల మంది ప్రైవేట్ ఉద్యోగస్తులకు, 50లక్షల మందిరైతులకు లబ్ది చేకూరుతుంది. ఇది పేద ప్రజలకు ఒక గొప్ప భరోసా ఇస్తుందని అన్నారు. ఇవి సరిగా లబ్ధిదారులకు అందేలా కార్యకర్తలు చొరవ తీసుకోవాలన్నారు. ఈ ఆపద సమయంలో ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. బీజేపీ అంటేనే సేవ అనే రీతిలో సేవా కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. ప్రజలు కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఒకరికి ఒకరు అండగా నిలవాలన్నారు. 

కరోనా పై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి కాబట్టి నిర్లక్ష్యం కూడా పనికి రాదని అన్నారు. ప్రభుత్వం అందించే సూచనలు తప్పకుండా పాటించడం మన బాధ్యతగా ప్రతి ఒక్కరు గుర్తించాలి అని కోరారు. ప్రతి ఒక్కరూ ఇంటికి పరిమితం కావాలని కోరారు. సామాజిక దూరం, స్వీయ నియంత్రణ ద్వారానే కరోనాను ఎదుర్కోగలుగుతామని అన్నారు. ఈ విపత్తును ఎదుర్కోవడంలో ప్రభుత్వానికి, అధికారులకు ఎలాంటి సహకారం కావాలన్నా అందించటానికి తమ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని పునరుద్ఘాటించారు. బండి సంజయ్ పిలుపు నివ్వడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో పలు చోట్ల నమో జ్యోతి పేరిట ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించారు.

Image

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   11 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   6 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   9 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   11 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   14 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   15 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   16 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   18 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   18 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   19 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle