newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నమోదైన కేసుల్లో కోలుకున్నవారే మూడింతలు.. 2,478 తాజా కేసులు..

05-09-202005-09-2020 07:42:54 IST
2020-09-05T02:12:54.697Z05-09-2020 2020-09-05T02:12:50.096Z - - 14-04-2021

నమోదైన కేసుల్లో కోలుకున్నవారే మూడింతలు.. 2,478 తాజా కేసులు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా 16,05,521 నిర్ధారణ పరీక్షలు చేయగా, మొత్తం కేసుల సంఖ్య 1,35,884కి చేరింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు శుక్రవారం బులెటిన్‌ విడుదల చేశారు. రాష్ట్రంలో గురువారం 62,543 కరోనా టెస్టులు చేయగా, 2,478 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. తాజాగా కరోనాతో 10 మంది మృతి చెందారు. దీంతో కోవిడ్‌ మరణాల సంఖ్య 866కి చేరింది.

ప్రస్తుతం కోవిడ్‌తో 32,994 మంది చికిత్స పొందుతుండగా, అందులో 25,730 మంది ఇళ్లు లేదా ఇతరత్రా ఐసోలేషన్‌ కేంద్రాల్లో చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా 2,011 మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,02,024కి చేరుకుంది. రాష్ట్రంలో సగటున 10 లక్షల జనాభాకు 43,245 కరోనా టెస్టులు చేశారు. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీలో అత్యధికంగా 267 వచ్చాయి. ఇక మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో 190, రంగారెడ్డి జిల్లాలో 171, నల్లగొండ జిల్లాలో 135, కరీంనగర్‌ జిల్లాలో 129, ఖమ్మం జిల్లాలో 128 కరోనా కేసులు నమోదయ్యాయి.  

వైరస్‌ వ్యాప్తిపై పెరిగిన అప్రమత్తతతో కరోనా మహమ్మారి నుంచి బాధి తులు తేలిగ్గానే బయటపడుతున్నారు. రాష్ట్రంలో కరోనాపై గెలిచిన విజేతల సంఖ్య బుధవారం నాటికి లక్ష దాటడమే అందుకు నిదర్శనం. ఒకవైపు కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండగా, మరోవైపు కోలుకుంటున్నవారి సంఖ్యా అత్యధికంగా ఉంది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో కోలుకున్నవారే మూడింతలు ఉండటం విశేషం. ఇది ఆశాజనక పరిణామమని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు అంటున్నాయి. 

కరోనాపై అవగాహన కలగడం, గ్రామస్థాయి వరకు నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి రావడంతో ఏమాత్రం లక్షణాలున్నా ప్రజలు వెంటనే పరీక్షలు చేయించుకుంటున్నారు. కొంచెం సీరియస్‌గా ఉన్నా సమీప ఆసుపత్రులకు వెళ్తున్నారు. కొద్దిపాటి పరిజ్ఞానం ఉన్నవారంతా ఇళ్లలో థర్మామీటర్, పల్స్‌ ఆక్సీమీటర్‌ను పెట్టుకుంటున్నారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పెరిగాయి. కొందరైతే పరీక్షలు చేయించుకునే వరకు వేచిచూడకుండా లక్షణాలను బట్టి తక్షణ చికిత్స పొందుతున్నారు. ఆపై పరీక్ష చేయించుకుని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 15,42,978 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 1,33,406 మందికి పాజిటివ్‌ వచ్చింది. వారిలో బుధవారం నాటికి 1,00,013 మంది కోలుకున్నారు. అంటే రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో 74.96 శాతం మంది కోలుకున్నట్టు. మొత్తం 856 మంది కరోనాతో చనిపోగా, ప్రస్తుతం 32,537 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో  25,293 మంది ఇళ్లు, ఇతరత్రా సంస్థల ఐసోలేషన్‌లోనే చికిత్స పొందుతుండటం గమనార్హం. 

చాలా కేసులు ఇలా ఇళ్లలోనే తగ్గిపోతున్నాయని వైద్యాధికారులు విశ్లేషిస్తున్నారు. దీనికి కారణం తక్షణం స్పందించడం, అందుబాటులో పరీక్షల వల్లేనంటున్నారు. వైరస్‌ విజృంభించిన మొదట్లో హైదరాబాద్‌లోనే కరోనా నిర్ధారణ పరీక్షలు జరిగేవి. ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు జిల్లాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) స్థాయి వరకు వెళ్లడంతో పరిస్థితి మారింది. ప్రస్తుతం 1,076 కేంద్రాల్లో యాంటిజెన్‌ టెస్టులు జరుగుతున్నాయి. ప్రతీ పది లక్షల జనాభాకు 41,560 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 

ఆగస్టులో పరీక్షల సంఖ్య బాగా పెరిగింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 92,050 మందికి లక్షణాల్లేకుండానే కరోనా పాజిటివ్‌ వచ్చింది. 41,356 మందిలోనే లక్షణాలు బయటపడ్డాయి. అంటే అనుమానమున్నవారు పరీక్షలు చేయించుకోవడం వల్లే లక్షణాల్లేని కేసులు ఎక్కువ నమోదయ్యారని, అందువల్లే త్వరగా కోలుకుంటున్నారని వైద్యాధికారులు విశ్లేషిస్తున్నారు. 

మొదట్లో గాంధీ ఆసుపత్రికే పరిమితమైన కరోనా చికిత్స, ఇప్పుడు పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులకూ విస్తరించింది. ప్రస్తుతం 42 ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స అందుబాటులోకి వచ్చింది. వీటిలో 7,952 పడకలు కరోనా కోసం కేటాయించారు. 2,774 పడకలు నిండిపోగా, ఇంకా 5,178 పడకలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఆక్సిజన్‌ పడకలకు తోడు మరో 4,500 పడకల్లో ఆక్సిజన్‌ అందుబాటులోకి తేవాలని సర్కారు నిర్ణయించింది. 

నెల క్రితం సీరియస్‌ అయితే ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో పడకలు దొరకని పరిస్థితి.. ప్రస్తుతం అప్రమత్తత పెరగడంతో చాలామంది ఆసుపత్రులకు రాకుండానే కోలుకుంటున్నారని విశ్లేషిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో మరణాల శాతం కూడా తగ్గింది. దేశంలో కరోనా మరణాల రేటు 1.75 శాతం ఉంటే, తెలంగాణలో 0.64 శాతంగా ఉంది.

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   4 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   5 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   5 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   9 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   10 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   8 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   10 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   11 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   6 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   13 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle