newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నమస్కారమే ముద్దు.. షేక్ హ్యాండ్స్ వద్దు

19-03-202019-03-2020 16:53:21 IST
2020-03-19T11:23:21.859Z19-03-2020 2020-03-19T11:23:19.958Z - - 14-04-2021

నమస్కారమే ముద్దు.. షేక్ హ్యాండ్స్ వద్దు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచవ్యాప్తంగా కరోనా రోగులు 2 లక్షల 18 వేలకు పెరిగారు. ఇండియాలో కరోనా రోగులు 200 కి చేరువలో వున్నారు. ఇదిలా ఉంటే స్పైస్ జెట్ అంతర్జాతీయ సర్వీసులను ఏప్రిల్ 30వరకూ రద్దుచేశారు. ఛత్తీస్‌గఢ్‌లో తొలి కరోనా కేసు నమోదయింది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనాను కట్టడి చేసేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇతర రాష్ట్రాల బస్సులు ఛత్తీస్‌గఢ్‌లోకి ప్రవేశించకుండా నిషేధం విధించారు.

తక్షణం ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సులతో పాటు ఆల్ ఇండియా పర్మిట్ ఉన్న అన్ని ట్రావెల్స్ బస్సులకూ ఇది వర్తిస్తుందని వెల్లడించారు. తదుపరి ఆదేశాల వరకు ఈ నిషేధం కొనసాగుతుందని ఛత్తీస్‌గఢ్ అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉండడంతో.. తెలంగాణ నుంచి వెళ్లే బస్సులు కూడా నిలిచిపోనున్నాయి.

ముందుజాగ్రత్తగా రాయ్‌పూర్‌లో 144 సెక్షన్ విధించారు. కరోనా ప్రభావంతో ఇప్పటికే విద్యాసంస్థలు, థియేటర్లు మూతపడ్డాయి. CBSE,ICSE పరీక్షలు సైతం వాయిదాపడ్డాయి. 150 రైళ్ళను రద్దుచేశారు. జాతీయ స్థాయిలో నిర్వహించాల్సిన పరీక్షలు వాయిదా పడుతున్నాయి. జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి.ఇప్పటికే సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న కారణంగా ఆయా బోర్డులు పరీక్షలను వాయిదావేస్తున్నాయి. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జాతీయ స్థాయిలో నిర్వహించాల్సిన పరీక్షలన్నింటినీ వాయిదా వేయాలని ఎమ్మాహెచ్‌ఆర్డీ ఆయా బోర్డులను ఆదేశించింది. ఈ మేరకు ఎగ్జామ్స్‌ను వాయిదా వేశారు.

వైరస్ మహమ్మారినుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రముఖులు సూచిస్తున్నారు. ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటే.. ఈ వైరస్‌ను ఎదుర్కొవచ్చని.. విదేశాల నుంచి వచ్చినవారినుంచే ఈ వైరస్ మనదేశంలో అడుగుపెట్టిందని శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి అన్నారు. షేక్ హ్యాండ్స్ మానేసి.. చక్కగా నమస్కారం పెట్టడానికి అలవాటు పడాలని చినజీయర్ స్వామి అన్నారు.

బయట ఉన్న సమయంలో వ్యక్తికి వ్యక్తికి మధ్య కాస్త దూరం ఉండటం ఉత్తమమని తెలిపారు. ఈ వైరస్ బారిన పడిన వారు ఎవరో తెలియదు కాబట్టి.. ఇలా దూరంగా ఉండటం ద్వారా వైరస్‌కు చెక్ పెట్టొచ్చన్నారు. సోషల్ డిస్టెన్స్ అలవాటు చేసుకోవాలన్నారు. అంతేకాదు.. ఎప్పటికప్పుడు వేడివేడి పదార్ధాలు తినడం మంచిదని.. ఎక్కడ పడితే అక్కడ.. ఏది పడితే అది తినే ప్రయత్నాలు విరమించుకోవాలని సూచించారు. సరైన స్థానంలో సరైందని అనిపించినప్పుడు మాత్రమే బయట తినండం బెటర్ అన్నారు. ఇక ధ్యానం.. యోగాలతో కొన్ని వ్యాధులను జయించవచ్చని.. కొన్ని వ్యాధులను దరిదాపుల్లో రాకుండా చేసుకోవచ్చని.. చినజీయర్ స్వామి తెలిపారు. చేతులను శుభ్రం చేసుకోవాలన్నారు. 

 

 

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   11 minutes ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   an hour ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   2 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   3 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   4 hours ago


కేటీఆర్ కి అంత సీన్ లేదులే

కేటీఆర్ కి అంత సీన్ లేదులే

   6 hours ago


పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!

   6 hours ago


కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ

   21 hours ago


వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!

   21 hours ago


ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!

ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle