newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నగరవాసులకు శుభవార్త.. 8నుంచి సిటీ బస్సు సర్వీసులు?

05-06-202005-06-2020 09:13:41 IST
Updated On 05-06-2020 10:34:32 ISTUpdated On 05-06-20202020-06-05T03:43:41.424Z05-06-2020 2020-06-05T03:37:07.741Z - 2020-06-05T05:04:32.249Z - 05-06-2020

నగరవాసులకు శుభవార్త.. 8నుంచి సిటీ బస్సు సర్వీసులు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అటు మెట్రో లేదు.. ఇటు సిటీ బస్సులు లేవు. నగరంలో లాక్ డౌన్ నిబంధనలు సడలించినా నగరవాసులు అటు నుంచి ఇటు తిరగడానికి అవకాశం లేకుండా పోయింది. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం కొన్ని  మినహాయింపులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో నగరంలో సిటీ బస్సుల రోడ్డెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. 

ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి హైదరాబాద్‌ నగరంలోనూ సిటీ బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో గత 70 రోజులుగా సిటీ బస్సులు రోడ్డెక్కని సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌పై సడలింపులు ఇవ్వడంతో సిటీ బస్సులతో పాటు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో బస్సులు ఏ విధంగా నడపాలనే దానిపై ఒక నిర్ఱయానికి వచ్చినట్టు తెలుస్తోంది. 

హైదరాబాద్ చుట్టుపక్కల అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పారిశ్రామిక కార్యకలాపాలు కూడా మొదలయ్యాయి. దీంతో సిటీలో బస్సు సర్వీసులు లేకపోవటంతో అటు సిబ్బందితో పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిటీలో నిత్యం 33 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సాగిస్తుంటారని అధికారులు అంచనా వేశారు. అన్ని కార్యకలాపాలు ప్రారంభం కావటంతో.. నిత్యం బస్సుల్లో ప్రయాణించాల్సిన వారు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాల్సి వస్తోంది. 

ఇక షేర్‌ ఆటోల్లో ప్రయాణం ప్రస్తుత పరిస్థితిలో అనుకూలం కాదన్న భయంతో అటువైపు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఎక్కువ మంది సొంత వాహనాలను రోడ్డెక్కించారు. గత ఐదారురోజులుగా నగర రోడ్లపై ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగిపోయింది. దీనికి తోడు మెట్రో సర్వీసులపై ఇంకా క్లారిటీ రాలేదు. మెట్రో లేకపోవడం, ఆర్టీసీ సర్వీసులు తిరగకపోవడంతో ప్రజారవాణాకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనీని దృష్టిలో ఉంచుకుని త్వరగా సిటీ బస్సు సర్వీసులు ప్రారంభించాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. కేవలం సిట్టింగ్ కే అవకాశం ఇచ్చి భౌతిక దూరం పాటించడం. మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచడం ద్వారా ఆర్టీసీసర్వీసులను ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు. 

ఈ నెల 8 నుంచి సిటీ బస్సులు రోడ్డెక్కుతాయన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఇటీవల రవాణా శాఖ మంత్రితో జరిగిన సమావేశంలోనూ సిటీ బస్సుల ప్రస్తావన రాలేదని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీంతో వారం, పది రోజుల్లో నగరంలో ప్రజారవాణా సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఏమేరకు వుంటాయో అర్థం కావడం లేదు. లాక్‌డౌన్‌ కారణంగా 29 డిపోల్లో సుమారు 3 వేల బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సాధారణంగా  గ్రేటర్‌ ఆర్టీసీ జోన్‌కు ప్రతిరోజూ వచ్చే రూ.3.5 కోట్ల ఆదాయానికి గండి పడింది. గత 70 రోజులకు పైగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ కారణంగా సుమారు రూ.250 కోట్ల మేరకు ఆదాయం కోల్పోయింది. కరోనా వైరస్ కేసులు గ్రేటర్లో ఎక్కువగా నమోదు కావడం కూడా ఆందోళన పెంచుతోంది. ఈ విషయంలో సీఎం కేసీయార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 

 

 

 

 

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   33 minutes ago


తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

   26 minutes ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   an hour ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   2 hours ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   5 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   3 hours ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   6 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   20 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16-04-2021


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle