newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నగదు డ్రా చేసిన మహిళకూ పాజిటివ్.. తెలంగాణలో మరో 42 కేసులు

18-05-202018-05-2020 10:52:35 IST
Updated On 18-05-2020 11:13:46 ISTUpdated On 18-05-20202020-05-18T05:22:35.989Z18-05-2020 2020-05-18T05:22:33.811Z - 2020-05-18T05:43:46.574Z - 18-05-2020

నగదు డ్రా చేసిన మహిళకూ పాజిటివ్.. తెలంగాణలో మరో 42 కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గటం లేదు. ఎక్కువమందికి పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆదివారం కూడా మరో 42 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 37, రంగారెడ్డి జిల్లాలో రెండు, వలసదారుల ద్వారా మూడు కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,551కి చేరింది. అందులో వలసదారుల సంఖ్య 57గా ఉంది. ఆదివారం 21 మంది కోలుకోగా మొత్తం డిశ్చార్జి అయినవారి సంఖ్య 992కు చేరింది. 

ఇప్పటిదాకా మొత్తం 34 మంది మరణించగా ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు 525 మంది ఉన్నారని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన బులెటిన్‌ విడుదల చేశారు. ఇంతవరకు రాష్ట్రంలో 992 మంది కరోనా నుంచి బయటపడగా, రికవరీ రేటు 64 శాతం దాకా ఉన్నట్లు వైద్య బులెటిన్ తెలిపింది.

రాష్ట్రంలో కరోనా బాధితుల్లో పురుషులే ఎక్కువగా ఉన్నారు. శనివారం సాయంత్రం వరకు 23,388 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,513 కేసులు నమోదయ్యాయని బులెటిన్‌లో పేర్కొన్నారు. అందులో 947 మంది పురుషులు, 566 మంది మహిళలు ఉన్నారు. నెగెటివ్‌ వచ్చిన వారిలో 14,256 మంది పురుషులు, 7,619 మంది మహి ళలు ఉన్నారు. 

పరీక్షల ఆధారంగా పురుషుల్లో 6% మందికి, మహిళల్లో 7% మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇక చేసిన పరీక్షల్లో 93% మంది మహిళ లకు నెగెటివ్‌ రాగా 94% మంది పురుషులకు నెగెటివ్‌ వచ్చినట్లు ఆ బులెటిన్‌లో పేర్కొన్నారు. ఇక వయసులవారీగా పరిశీలిస్తే 15 ఏళ్లలోపు చిన్నా రుల్లో 218 మంది కరోనా బాధితులు ఉన్నారు.

అబిడ్స్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోని గోషామహల్‌ సర్కిల్‌–14లో ఉన్న జుంగూర్‌బస్తీలో ఆదివారం ఒకేరోజు 15 మందికి కరోనా సోకింది. జుంగూర్‌ బస్తీలో నివాసం ఉండే ఓ బ్యాంక్‌ ఉద్యోగి (36)కి ఐదు రోజుల క్రితం వైరస్‌ సోకగా అతని కుటుంబ సభ్యులు, బంధువులను క్వారంటైన్‌కు తరలించారు. వారికి పరీక్షలు నిర్వహించగా ఉద్యోగి తండ్రి (56), అతని భార్య, ఇద్దరు చిన్న పిల్లలు, ఇంట్లోని బంధువులందరికీ కలిపి 15 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 

మరోవైపు పురానాపూల్‌ చౌరస్తాలోని ఎస్‌బీఐ శాఖ నుంచి ఇటీవల నగదు డ్రా చేసుకొని వెళ్లిన ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో వైద్యశాఖ అధికారులు బ్యాంక్‌లో పనిచేసే 13 మంది సిబ్బంది, అధికారులను క్వారంటైన్‌కు తరలించారు.

కాగా ప్రయాణ మినహాయింపులు ఇచ్చిన తర్వాత తెలంగాణకు తిరిగి వచ్చిన 57 మంది వలస కార్మికులకు పాజిటివ్ అని పరీక్షల్లో తేలడం గమనార్హం.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle