newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ధ‌ర్మ‌పురి అరవింద్ చ‌దువుపై ర‌గ‌డ‌.. ప‌క్కాగా ఇరికిస్తున్న టీఆర్ఎస్‌

09-04-202009-04-2020 08:16:52 IST
Updated On 09-04-2020 09:34:59 ISTUpdated On 09-04-20202020-04-09T02:46:52.212Z09-04-2020 2020-04-09T02:46:27.256Z - 2020-04-09T04:04:59.351Z - 09-04-2020

ధ‌ర్మ‌పురి అరవింద్ చ‌దువుపై ర‌గ‌డ‌.. ప‌క్కాగా ఇరికిస్తున్న టీఆర్ఎస్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్‌కు మ‌రో త‌ల‌నొప్పి మొద‌లైంది. ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో త‌ప్పుడు వివ‌రాలు పొందుప‌రిచార‌ని, పీజీ చ‌ద‌వ‌కున్నా చదివిన‌ట్లు చూపించార‌ని టీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ప‌క్కాగా సేక‌రించిన టీఆర్ఎస్ నేత‌లు ఇప్పుడు ధ‌ర్మ‌పురి అర్వింద్‌కు స‌వాళ్లు విసురుతున్నారు. అఫిడ‌విట్‌లో అబ‌ద్ధాలు చెప్పిన అర్వింద్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

నిజామాబాద్ పార్ల‌మెంటులో స్థానానికి గ‌త ఎన్నిక‌ల్లో ధ‌ర్మ‌పురి అర్వింద్ అనూహ్యంగా ఎన్నిక‌య్యారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమార్తె క‌ల్వకుంట్ల క‌విత‌పై ఆయ‌న ఎవ‌రూ ఊహించ‌ద‌ని విధంగా సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేశారు. అప్ప‌టి నుంచి అర్వింద్ మ‌రింత దూకుడుగా వెళుతున్నారు. టీఆర్ఎస్‌పై, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై ఆయ‌న ఎప్పుడూ ప‌రుష ప‌ద‌జాలంతో విమ‌ర్శ‌లు గుప్పిస్తుంటారు. త‌మ నాయ‌కురాలిపై గెలిచి, త‌మ నాయ‌క‌త్వాన్ని తీవ్రంగా విమ‌ర్శిస్తున్న అర్వింద్‌ను టీఆర్ఎస్ టార్గెట్ చేసింది.

ఎన్నిక‌ల్లో జిల్లాకు ప‌సుపు బోర్డు తీసుకువ‌స్తాన‌నే ప్ర‌ధాన హామీ ఇచ్చి గెలిచిన అర్వింద్ గెలిచిన త‌ర్వాత ఆరు నెల‌ల పాటు ఈ హామీపై తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. ఇచ్చిన హామీని నెర‌వేర్చాల‌ని టీఆర్ఎస్ ఒక‌వైపు, ప‌సుపు రైతులు ఒక‌వైపు ఆయ‌న‌పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. చివ‌ర‌కు జిల్లాకు సుగంధ ద్ర‌వ్యాల బోర్డు ప్రాంతీయ కార్యాల‌యంలో రావ‌డంతో ఆయ‌న‌కు ఈ స‌మ‌స్య కొంత త‌ప్పింది. ఇచ్చిన హామీని నెర‌వేర్చుకున్నట్లయింది. దీంతో ఇప్పుడు ఆయ‌న కొంత రిలీఫ్ అయ్యారు.

ఇంత‌లోనే మ‌రోసారి ధ‌ర్మిపురి అర్వింద్‌ను ఇరుకున‌పెట్టింది టీఆర్ఎస్‌. డిస్టెన్స్ ఎడ్యుకేష‌న్ ద్వారా రాజ‌స్థాన్‌లోని జ‌నార్ధ‌న్ రాయ్ న‌గ‌ర్ రాజ‌స్థాన్ విద్యాపీఠ్ యూనివ‌ర్సిటీ నుంచి దూర విద్య ద్వారా ఎంఏ పొలిటిక‌ల్ సైన్స్ చ‌దివిన‌ట్లు అర్వింద్ త‌న ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో పొందుప‌రిచారు. తెలంగాణ‌లో అనేక యూనివ‌ర్సిటీలు ఉన్నా, చాలా యూనివ‌ర్సిటీలు దూర‌విద్య అవ‌కాశాన్ని క‌ల్పిస్తున్నా అర్వింద్ రాజ‌స్థాన్‌కు వెళ్లి ఎందుకు చ‌ద‌వాల్సి వ‌చ్చింద‌ని టీఆర్ఎస్ నేత‌ల్లో అనుమానం మొద‌లైంది.

టీఆర్ఎస్ నేత మ‌న్నె కృషాంక్ ఈ విష‌యాన్ని త‌వ్వ‌డం మొద‌లుపెట్టారు. రాజ‌స్థాన్‌లోని స‌ద‌రు యూనివ‌ర్సిటీలో ధ‌ర్మిపురి అర్వింద్ చ‌దివారా, లేదా అనేది ఆర్టీఐ ద్వారా అడిగారు. అయితే, ఆ పేరుతో త‌మ యూనివ‌ర్సిటీలో ఎవ‌రూ చ‌ద‌వ‌లేద‌నే స‌మాధానం వ‌చ్చింద‌ని టీఆర్ఎస్ నేత‌లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి యూనివ‌ర్సిటీ నుంచి వ‌చ్చిన రాత‌పూర్వ‌క స‌మాధానాన్ని చూపిస్తున్నారు. ఇది కేవ‌లం డీమ్డ్ యూనివ‌ర్సిటీ అని, ఈ యూనివ‌ర్సిటీపై సుమారు 700 కేసులు ఉన్నాయ‌ని టీఆర్ఎస్ నేత‌లు చెబుతున్నారు.

ధ‌ర్మ‌పురి అర్వింద్ చ‌ద‌వ‌కున్నా ఈ యూనివ‌ర్సిటీలో చ‌దివిన‌ట్లు చెప్పుకున్నార‌ని టీఆర్ఎస్ నేత‌లు ఆరోప‌ణ‌లు మొద‌లుపెట్టారు. ఆయ‌న చ‌దువుపై బ‌హిరంగ చ‌ర్చ‌కు రావాల‌ని, చ‌దివినట్లు నిరూపించాల‌ని స‌వాల్ విసురుతున్నారు. లేక‌పోతే త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఈ విష‌యంలో ధ‌ర్మ‌పురి అర్వింద్ ఇరుక్కున్న‌ట్లే క‌నిపిస్తోంది. ఆయ‌న తాను నిజంగానే ఈ యూనివ‌ర్సిటీలో చ‌దివాన‌ని నిరూపించుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీనిపై టీఆర్ఎస్ నేత‌లు కోర్టుకు వెళ్లేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి, అర్వింద్ ఈ వ్య‌వ‌హారం నుంచి ఎలా బ‌య‌ట‌పడ‌తారో చూడాలి.

 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   12 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   8 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   10 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   12 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   15 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   16 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   18 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   19 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   19 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   20 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle