newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ధవళేశ్వరం, భద్రాచలం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక

16-08-202016-08-2020 10:35:11 IST
Updated On 16-08-2020 12:36:14 ISTUpdated On 16-08-20202020-08-16T05:05:11.707Z16-08-2020 2020-08-16T05:05:02.759Z - 2020-08-16T07:06:14.971Z - 16-08-2020

ధవళేశ్వరం, భద్రాచలం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారీ వ‌ర్షాల కార‌ణంగా ఎగువ ప్రాంతాల నుంచి వ‌ర‌ద పోటెత్తడంతో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాగులు, వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లు గ్రామాల మ‌ధ్య రాక‌పోక‌లు నిలిచిపోయాయి.భద్రాచలం వద్ద ఉదయం 6 గంటలకు గోదావరిలో నీటిమట్టం 48.1 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు.

శనివారం ఉదయం 3.50 గంటల స‌మయంలో గోదావరి వరద నీరు 43 అడుగులకు చేరిన నేప‌థ్యంలో మొదటి ప్రమాద హెచ్చ‌రిక‌ను జారీ చేశారు. 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. ఎగువన ఉన్న ఇంద్రావతి, కాళేశ్వరం నుంచి వరద తాకిడికి ఎక్కువ‌గా ఉండ‌టంతో భద్రాచలం దగ్గర గోదావరికి భారీ స్థాయిలో నీరు వస్తుందని నీటి పారుద‌ల శాఖ‌ అధికారులు భావిస్తున్నారు.

వ‌ర‌ద తీవ్ర‌త మ‌రింత పెరిగితే లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశాలున్న ఉండటంతో.. ఆ ప్రాంత వాసులను. అధికారులు అలెర్ట్ చేశారు. బాధితులను పునరావస కేంద్రాలకు త‌ర‌లిస్తున్నారు.

ఇటు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ అయింది. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో  13,75,029 క్యుసెక్కులుగా వుంది. ముందస్తుగా అత్యవసర  పరిస్థితుల్లో సహాయక చర్యలకోసం మూడు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపింది విపత్తుల శాఖ. అలాగే మరిన్ని ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలను సిద్ధం చేశామని విపత్తులశాఖ తెలిపింది.  వరద ఉధృతి దృష్ట్యా అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. గోదావరి నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కోరారు.

ఇటు పోలవరం వద్ద అంతకంతకూ పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి ఆందోళన కలిగిస్తోంది. పోలవరం కాఫర్ డ్యామ్ వద్ద 28.50 మీటర్ల కు చేరింది. స్పిల్ చానెల్, స్పిల్ వే ప్రాంతం లో భారీగా పెరిగింది వరదనీరు. పోలవరం ప్రాజెక్టు పనులను వర్షం వలన తాత్కాలికంగా నిలిపి వేశారు అధికారులు.  వర్షం తగ్గాక 1,2,రోజుల్లో  స్పీల్ వే కాంక్రీట్  పనులు ప్రారంభం కానున్నాయి, వరద వలన ఇబ్బంది వుండదన్నారు ప్రాజెక్టు  ఎస్ ఇ నాగి రెఢ్ఢి. పోలవరం వద్ద వరద నీరు 28 మీటర్లు చేరడంతో దిగువ పాత పోలవరం గ్రామస్థులలో భయాందోళనలు నెలకొన్నాయి. 

ఇప్పటికే పోలవరం ఎగువ 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుక్కునూరు, ఏలేరుపాడు మండలాల్లో వరద ముంపులో పలు గిరిజన గ్రామాల వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. కొత్తూరు కాజ్ వే పైన 20 అడుగులు చేరింది వరద నీరు. టి.నర్సాపురం మండలం అప్పలరాజుగూడెం, మధ్యాహ్నపువారిగూడెం గ్రామానికి మధ్య ఉన్న ఎర్రకాలువలో ములకాల దుర్గారావు అనే వ్యక్తి గల్లంతయ్యాడు. జీలుగుమెల్లి మండలానికి చెందిన ఇద్దరు కాలువను దాటే ప్రయత్నంలో దుర్గారావు గలంతు కాగా  మరో వ్యక్తిని స్ధానికులు కాపాడారు.

 

 

 

 

 

 

 

నా రూటే సెప‌రేటు

నా రూటే సెప‌రేటు

   40 minutes ago


బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   14 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   15 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   15 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   19 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   20 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   18 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   20 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   21 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   16 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle