newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

దైవ కార్యక్రమాలకు కేటీఆర్.. ఏమిటీ మార్పు?

07-01-202007-01-2020 11:23:09 IST
Updated On 07-01-2020 12:16:00 ISTUpdated On 07-01-20202020-01-07T05:53:09.359Z07-01-2020 2020-01-07T05:53:05.771Z - 2020-01-07T06:46:00.327Z - 07-01-2020

దైవ కార్యక్రమాలకు కేటీఆర్.. ఏమిటీ మార్పు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కల్వకుంట్ల తారకరామారావు.. గత వారం రోజులుగా తెలంగాణ రాజకీయాలలో మారుమ్రోగుతున్న పేరు ఇదే. అనుకున్నట్లు జరిగితే మరి కొద్ది రోజులలో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్న రెండో వ్యక్తి ఈయనేనని సొంత పార్టీ నేతలే పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారు. ఇది ఒక విధంగా మున్సిపల్ ఎన్నికల కోసం వేస్తున్న పాచిక అనేవాళ్ళు ఉన్నా మొత్తంగా పార్టీలో ఏదో జరుగుతుంది అన్న భావన మాత్రం కలుగుతుంది.

ఎప్పటికప్పుడు కేటీఆర్ సీఎం వార్తలను ఖండిస్తున్నా ప్రచారంతో అందుకు తగ్గ సన్నాహాలు వెనక జరిగిపోతున్నట్లుగా టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్న మాట. ఇప్పటికే కేటీఆర్ ప్రభుత్వంలో తమకి ఫలానా శాఖా కేటాయిస్తారని చెప్పుకుంటున్న నేతలు లేకపోలేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా కేసీఆర్ ప్రభుత్వం మీద సదాభిప్రాయం ఉండగానే యువరాజుని పీఠం ఎక్కించాలని ఆరాటపడుతున్నారట.

ఇక కేటీఆర్ విషయానికి వస్తే యువరాజుగా పిలిచినా.. వ్యక్తిపూజ చేసినా పెద్దగా పట్టుచుకోరని పేరుండేది. ఇక దైవభక్తి అయితే చాలా తక్కువని చెప్తారు. ఒక విధంగా కేటీఆర్ నాస్తికుడు అని కూడా అంటారు. అందుకు తగ్గట్లే గతంలో కేసీఆర్ భారీ ఎత్తున నిర్వహించిన కొన్ని కార్యక్రమాలకి కుటుంబంతో పాటు పార్టీ ముఖ్యనేతలు అందరూ వచ్చినా కేటీఆర్ మాత్రం డుమ్మా కొట్టేవారట.

రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో భారీ హోమం నిర్వహించారు. ఆ సమయంలో కేటీఆర్ హైదరాబాద్లో లేకుండా బెంగళూరు వెళ్లినట్లుగా చెప్తారు. అంతగా కేటీఆర్ దైవకార్యక్రమాలను పట్టించుకోరు. అయితే ఆయన పిల్లలు మాత్రం తాత కేసీఆర్ తో దైవ కార్యక్రమాలలో కనిపించేవారు. కాగా, తాజాగా వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తరద్వారా దర్శనానికి కేటీఆర్ తిరుమలలో ప్రత్యక్షమయ్యారు.

వేకువజామున ఒంటి గంటకే తిరుమలలో ఏఐపీ దర్శనానికి కుటుంబంతో కలిసి కేటీఆర్ వెళ్లారు. నాస్తికుడిగా కనిపించిన కేటీఆర్ ఇప్పుడు దైవభక్తి వైపు ఎందుకు వెళ్లారు? ఇప్పటికిప్పుడు వచ్చిన ఈ మార్పుకి కారణమేంటి? అని పార్టీతో పాటు రాజకీయ వర్గాలలో చర్చ మొదలైంది. చిన్నప్పటి నుండి లేని దైవభక్తి ఇప్పటికిప్పుడు ఎలా వచ్చి చేరిందా అని సన్నిహితులు ఆరాలు తీస్తున్నారు.

ముఖ్యమంత్రి కుర్చీలో భాగంగానే ఈ పూజలు, పుణ్యక్షేత్రాలు వచ్చి చేరాయని అంటున్నారు. ముహుర్తాలు, వాస్తులూ, హోమాలు, నమ్మకాలు కేసీఆర్ మాదిరే కేటీఆర్ కి అలవాటు చేశారని.. దైవ సంకల్పం తోడుగా ఉండాలని అయనకి ఎక్కించారని సన్నిహితుల మాట. కుర్చీ కోసం ఈ అనూహ్యమార్పులు చోటు చేసుకున్నాయని రాజకీయ వర్గాలు చెప్తున్న మాట. మరి అసలు సంగతేంటో కొద్ది రోజులు ఆగితే కాని బయటకురాదులెండి!

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle