newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

దేశాన్నే అబ్బురపరిచే కేసీఆర్ ‘తీపి కబురు’ ఏమిటి? సర్వత్రా ఆసక్తి

30-05-202030-05-2020 11:27:43 IST
Updated On 30-05-2020 13:00:25 ISTUpdated On 30-05-20202020-05-30T05:57:43.697Z30-05-2020 2020-05-30T05:57:41.601Z - 2020-05-30T07:30:25.878Z - 30-05-2020

దేశాన్నే అబ్బురపరిచే కేసీఆర్ ‘తీపి కబురు’ ఏమిటి? సర్వత్రా ఆసక్తి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తోంది. త్వరలో రైతులకు శుభవార్త వినిపిస్తా. ఆ వార్త విని దేశమే అబ్బుర పడుతుంది’అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు చెప్పిన సమాచారం తెలంగాణలో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. శుక్రవారం సిద్దిపేట జిల్లాలో నిర్మించిన కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ రైతును రాజు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని... ఆ నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తామన్నారు. అంతవరకు సస్పెన్స్‌గా ఉంచుతామని ముఖ్యమంత్రి చెప్పారు. 

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న స్థాయిలో కాకపోయినా కేసీఆర్ చెబుతాన్న ఆ తీపి కబురు ఏమై ఉంటుంది? వ్యవసాయ రంగానికి సంబంధించి త్వరలో ప్రపంచంలో ఎవరూ ఊహించని రీతిలో త్వరలో తీపి కబురు ఉంటుందని సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వ్యవసాయ రంగానికి సంబంధించి సీఎం చేసే ప్రకటన ఏ తరహాలో ఉంటుందనే అంశంపై చర్చ జరుగుతోంది. 

‘తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సమగ్ర వ్యవసాయాభివృద్ధి విధానం యావత్‌ దేశానికి ఆదర్శంగా నిలవడం   ఈ రాష్ట్ర పౌరులుగా మనందరికీ గర్వకారణం’అని బడ్జెట్‌ సమావేశాల్లో పేరొన్న సీఎం ఇప్పటికే రైతు సంక్షేమ పథకాల అమల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నామని అనేక సందర్భాల్లో ప్రస్తావించారు.

ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి రైతుల కోసం ‘సమీకృత రైతు సంక్షేమ పథకం’ను అమలు చేయడం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఇటీవల ప్రకటించిన నూతన వ్యవసాయ విధానంలో భాగంగా ఈ పథకాన్ని అమలు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. పెట్టుబడి మొదలుకుని గిట్టుబాటు దాకా.. అన్నదాతకు అండగా నిలవాలని ప్రభుత్వం భావిస్తోంది. 

ఇందులో భాగంగా రైతు సంక్షేమం కోసం ఇప్పటికే అమలు చేస్తున్న కార్యక్రమాల(రైతుబంధు, రైతు బీమా, విత్తన సబ్సిడీ, పంట కొనుగోలు)కు మరికొన్నింటిని జోడించి వ్యవసాయాన్ని పండుగగా మార్చాలన్నది కేసీఆర్‌ అంతరంగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఆలోచనలో మొగ్గ తొడిగిన ఈ పథకంలో రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుల మందులను ఉచితంగా అందజేయడం మొదలు పెట్టుబడి సమకూర్చడం, గిట్టుబాటు ధరకు పంటల కొనుగోలు వరకు అన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరిగేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిసింది. 

వానాకాలం సీజన్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా కొత్త పథకానికి తుది రూపు ఇవ్వాలని సీఎం భావిస్తున్నట్లు తాజా సంకేతాలు వెల్లడిస్తున్నాయి. దీని కోసమయ్యే ఆర్థిక అవసరాలపై కూడా ఆయన ఇప్పటికే అవగాహనకు వచ్చినట్లు సమచారం.

నియంత్రిత సాగు విధానంతో తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శం కానున్నారని ప్రశంసించిన కేసీఆర్ రాష్ట్రంలోని రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మరింత చిత్తశుద్ధితో ముందుకెళ్తుందన్నారు. 

సీఎం శుభవార్తలో ఏఏ అంశాలు ఉంటాయి?

పంటల బీమా పథకం ప్రీమియం ప్రభుత్వమే రైతుల పక్షాన చెల్లించడం. ప్రకృతి వైపరీత్యాలు, ఇతరత్రా కారణాలతో పంట నష్టం జరిగితే బీమా సంస్థల నుంచి పరిహారం అందించడం. నియంత్రిత సాగు విధానంలో భాగంగా సర్కారు ఆదేశాలను పాటించే రైతులకు ఉచితంగా ఎరువులు, విత్తనాల పంపిణీ. పంటలు, మద్దతు ధరను వ్యవసాయ సీజన్‌ ప్రారంభానికి ముందే ప్రకటించడం. పంట దిగుబడుల సేకరణపై సీజన్‌ ప్రారంభానికి ముందే రైతులతో ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు ఒప్పందం చేసుకోవడం.

పంట దిగుబడులకు కేంద్రం ప్రకటించే కనీస మద్దతు ధరకు మరింత ప్రోత్సాహాకాన్ని జత చేసి మార్క్‌ఫెడ్, పౌర సరఫరాల కార్పొరేషన్‌ ద్వారా కొనుగోలు. పంట దిగుబడులను కల్లాల వద్ద నుంచే కొనుగోలు చేయడం. ఉపాధి హామీ పథకం కింద కల్లాల ఏర్పాటుకు రూ.2 లక్షల చొప్పున ఇవ్వడం. రైతుబంధు సమితిలను బలోపేతం చేయడంతో పాటు ప్రతీ వ్యవసాయ క్లస్టర్‌లో రైతు వేదికల నిర్మాణం. వీటి కోసం రూ.350 కోట్లు కేటాయింపు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేసేలా కేంద్రాన్ని ఒప్పించడం.

సాగనీటి ప్రాజెక్టుల పరిపూర్తి ద్వారా అయిదేళ్లలోనే తెలంగాణను భారతదేశ ధాన్యాగారంగా రూపొందించిన కేసీఆర్ తెలంగాణ ఉద్యమ లక్ష్యం నెరవేరినట్లేనని సగర్వంగా ప్రకటించారు. కరోనా నేపథ్యంలో వివిధ రాష్ట్రాల ప్రజలకు ఆహార ధాన్యాలు పంపిణీ చేసిన భారత ఆహార సంస్థ ఈ మొత్తం ఆహార ధాన్యాల్లో 63 శాతం తెలంగాణనుంచి పంపించినవే అని చెప్పడం సంచలనానికి దారితీసింది. ఈ నేపథ్యంలో ఇంత ఘనతను రాష్ట్రానికి సాధించిపెట్టిన రైతులకు సంబంధించిందే కేసీఆర్ తీపి వార్త అయి ఉంటుందని అందరూ అంచనాకి వచ్చేశారు.

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   7 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   3 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   5 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   10 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   12 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   13 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle