దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉంది.. చిదంబరం ఆందోళన
08-02-202008-02-2020 17:22:49 IST
Updated On 08-02-2020 17:23:54 ISTUpdated On 08-02-20202020-02-08T11:52:49.543Z08-02-2020 2020-02-08T11:51:17.808Z - 2020-02-08T11:53:54.395Z - 08-02-2020

కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరం దేశ ఆర్థిక పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన పన్నుల వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉందిన, పన్నుల పంపిణీలో రాష్ట్రాలు నష్టపోతున్నాయని పి. చిదంబరం అన్నారు. కేంద్రం విధానాలవల్ల తెలంగాణ కూడా భారీగానే నష్ట పోతోందని, దీనిపై కేసీయార్ ఎందుకు మౌనంగా వున్నారని ఆయన ప్రశ్నించారుు. రూ.8.5 లక్షల కోట్లకు గాను కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు రూ.6.5 లక్షల కోట్లే పంచిందని ఆరోపించారు. కేంద్రం తీరుతో తెలంగాణ పన్నుల వాటాలో రూ.5 వేల కోట్లు నష్టపోయిందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ సారి ప్రధాని మోడీకి అనుకూలంగా.. మరోసారి వ్యతిరేకంగా మాట్లాడుతారని, ఆయన ధోరణి ఏంటో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. పన్నుల వాటా తగ్గినప్పుడు గట్టి ప్రశ్నించాలని, అప్పుడే రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందన్నారు. హైదరాబాద్ ముఫఖామ్ జా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీలో ఏర్పాటు చేసిన సదస్సుకు చిదంబరం హాజరై దేశ ఆర్థిక వ్యవస్థ, సీఏఏ, ఎన్నార్సీ చట్టాలు, ఆర్థిక మాంద్యం గురించి మాట్లాడారు. హైదరాబాద్ లో షాపింగ్ బాగా తగ్గిపోయిందని, దేశమంతా ఇదే పరిస్థితి ఉందన్నారు. ఆటో మొబైల్ వ్యాపార వేత్తలు ఇప్పుడు టాక్స్ వేధింపులతోనే ఉన్నారు.. టాక్స్ చెల్లింపు దారులకు వేధింపులు ఎక్కువయ్యాయన్నారు చిదంబరం.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
12 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
7 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
10 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
12 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
15 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
16 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
17 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
19 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
19 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
20 hours ago
ఇంకా