newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

దేశంలోనే రెండవ ఉత్తమ యూనివర్సిటీ..హెచ్‌సీయూ

03-08-202003-08-2020 11:50:31 IST
Updated On 03-08-2020 11:49:50 ISTUpdated On 03-08-20202020-08-03T06:20:31.870Z03-08-2020 2020-08-03T06:14:09.093Z - 2020-08-03T06:19:50.573Z - 03-08-2020

దేశంలోనే రెండవ ఉత్తమ యూనివర్సిటీ..హెచ్‌సీయూ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఫార్మా. ఐటీ రంగాల్లోనే కాదు విద్యారంగంలోనూ హైదరాబాద్ తన ప్రత్యేతకను చాటుకుంటోంది. తాజాగా హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ దేశంలోనే రెండవ ఉత్తమ వర్శిటీగా నిలిచింది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ మరో ఘనత సాధించింది. ఇండియా టుడే ఆధ్వర్యంలోని మార్కెటింగ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ రీసెర్చ్‌ అసోసియేట్స్‌ నిర్వహించిన ఓ సర్వేలో హెచ్‌సీయూకి రెండోస్థానం దక్కింది. 

జనరల్‌ (ఆర్ట్స్‌, సైన్స్‌ అండ్‌ కామర్స్‌), సాంకేతిక, వైద్య, లాలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ అందిస్తున్న దేశంలోని 995 యూనివర్సిటీల్లో సర్వే నిర్వహించారు. వర్సిటీ పాలనా పద్ధతులు, అకడమిక్‌, పరిశోధనలు, మౌలిక వసతులు, పర్సనాలిటీ, లీడర్‌షిప్‌ డెవల్‌పమెంట్‌, కెరీర్‌ పురోగతి, ప్లేస్‌మెంట్లు తదితర వాటిని వర్సిటీ పనితీరుకు సూచికలుగా తీసుకున్నారు. 

ఆబ్జెక్టివ్‌ ర్యాంకింగ్‌ సమయంలో విశ్వవిద్యాలయాల అత్యంత సమగ్రమైన, సమతుల్యమైన పోలికలను అందించడానికి ఎండీఆర్‌ఏ 120 ప్లస్‌ లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించింది.పది పాయింట్ల రేటింగ్‌ స్కేల్‌లో వర్సిటీల ర్యాంకులను నిర్ధారించారు. ఢిల్లీలోని జేఎన్‌యూ మొదటిస్థానం సాధించగా, హెచ్‌సీయూ రెండో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 130 విశ్వ విద్యాలయాలకు ర్యాంక్‌లను కేటాయించారు. మెరుగైన ర్యాంకు రావడం వర్సిటీ పరిశోధనా పద్ధతులకు గుర్తింపని హెచ్‌సీయూ వీసీ పొదిలే అప్పారావు చెప్పారు.      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle