newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

దేవుళ్ళకీ పౌరసత్వం కావాలి.. చిలుకూరు అర్చకుల డిమాండ్!

23-01-202023-01-2020 09:10:48 IST
Updated On 23-01-2020 12:51:39 ISTUpdated On 23-01-20202020-01-23T03:40:48.951Z23-01-2020 2020-01-23T03:40:41.510Z - 2020-01-23T07:21:39.319Z - 23-01-2020

దేవుళ్ళకీ పౌరసత్వం కావాలి.. చిలుకూరు అర్చకుల డిమాండ్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పౌరసత్వ చట్టంపై నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎన్ఆర్ సి, సీఏఏలకు వ్యతిరేకంగా దేశ అత్యున్నత న్యాయస్థానంలో వందల సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి. చట్టం అమలుకు నిరసనలను తగ్గితేనే విచారణకి స్వీకరిస్తామని సుప్రీంకోర్టు తెలపగా.. కొద్దిగా నిరసనల తగ్గుముఖం పట్టడంతోనే విచారణకి స్వీకరించింది.

అది కూడా వందల పిటిషన్లలో కొన్నిటిని మాత్రమే విచారణకు స్వీకరించింది. అయితే ప్రస్తుతానికి చట్టాన్ని హోల్డ్ లో పెట్టినట్లుగా కోర్టు స్పష్టం చేసింది.అయితే చట్టంపై స్టే ఇచ్చేందుకు మాత్రం సుప్రీం కోర్టు అంగీకరించలేదు. మరోవైపు కేంద్రం మాత్రం చట్టాన్ని అమలు చేసి తీరుతామని స్పష్టం చేస్తున్న క్రమంలో దేశవ్యాప్తంగా ఈ చట్టంపై చర్చ కొనసాగుతూనే ఉంది.

ఈక్రమంలో తెలంగాణ తిరుపతిగా.. వీసా గాడ్ గా పిలుచుకునే చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు సి.ఎస్.రంగరాజన్ దేవుళ్ళకి కూడా పౌరసత్వం కల్పించాలని వినూత్న డిమాండ్ ను ముందుకు తీసుకొచ్చారు. అందుకు అయన ఈమధ్యనే దేశంలో సంచలనం రేపిన శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం, అయోధ్య కేసు తీర్పులలో కోర్టుల భిన్నాభిప్రాయాలను ఉదాహరణగా చెప్పుకొచ్చారు.

మన దేశంలో హిందూ దేవుళ్ల మత స్వేచ్ఛకు ప్రమాదముందన్న రంగరాజన్ శబరిమల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన హిందూ విగ్రహాలకు ఎలాంటి రాజ్యాంగ హక్కులు లేవన్న తీర్పును గుర్తు చేశారు. అయ్యప్ప బ్రహ్మచారి కనుక రుతుస్రావం జరిగే స్త్రీలు అయనను పూజించడానికి అనర్హులని దేవస్థానం బోర్డు వాదించి కోర్టు తిరస్కరించిందని, దేవతా విగ్రహాలకు రాజ్యాంగ హక్కులు లేవని చెప్పింది.

ఇక, అయోధ్య శ్రీరాముని కేసులో అదే సుప్రీంకోర్టు దేవతా విగ్రహాలకు హక్కులుంటాయి కాబట్టి వాటిని పూజించుకోవచ్చని తీర్పు నిచ్చింది. ఇక, పౌరసత్వం ఉంటే తప్ప రాజ్యాంగ హక్కులు వర్తించవు కనుక హిందూ దేవతా విగ్రహాలకు పౌరసత్వం ఇవ్వాలని, అప్పుడే హక్కులు వర్తిస్తాయని అర్చకులు రంగరాజన్ డిమాండ్ చేశారు.

కాగా, న్యాయ పరిభాష ప్రకారం ప్రతి దేవతా విగ్రహం పెరిపెచ్యువల్ మైనర్ (ఎప్పటికీ మేజర్ కాలేని మైనర్) అని, పౌరసత్వ సవరణ చట్టం సెక్షన్ 5(4) కింద మైనర్లకు పౌరసత్వం ఇవ్వవచ్చు కనుక దేవుళ్ళకి కూడా కల్పించాలన్నారు.అంతేకాదు విగ్రహాల తరపున కోర్టులో ప్రాతినిధ్యం వహించడానికి ఒక అర్చకుడో లేక ఒక వ్యక్తినో ఉండాలని కూడా అయన పేర్కొన్నారు. మరి ఈ వాదన సమంజసమే అంటారా? ఏమో ఆ దేవుడికే ఎరుక!!

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle