newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

దెబ్బ మీద దెబ్బ కొట్టేందుకు టీఆర్ఎస్ వ్యూహం..!

03-02-202003-02-2020 12:19:39 IST
2020-02-03T06:49:39.840Z03-02-2020 2020-02-03T06:49:38.083Z - - 16-04-2021

దెబ్బ మీద దెబ్బ కొట్టేందుకు టీఆర్ఎస్ వ్యూహం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ వ‌రుస విజ‌యాల‌తో అధికార టీఆర్ఎస్ పార్టీ దూకుడు మీద ఉంది. ఎన్నిక‌లు ఏవైనా విజ‌యం మాదే అనే ధీమా ఆ పార్టీలో నెల‌కొంది. ఇందుకు ఏడాదిగా వ‌రుస‌గా జ‌రుగుతున్న ఎన్నిక‌ల ఫ‌లితాలే కార‌ణం. ఫ‌లితాల‌న్నీ ఏక‌ప‌క్షంగా టీఆర్ఎస్ వైపే వ‌స్తున్నాయి. ప్ర‌త్య‌ర్థి పార్టీలు క‌నీసం పోటీ ఇచ్చే ప‌రిస్థితిలో కూడా లేవు.

ఇదే దూకుడుతో మిగిలి ఉన్న ఎన్నిక‌ల‌కు కూడా వెళ్లాల‌ని టీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే స‌హ‌కార సంఘాల ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌గా, త్వ‌ర‌లో మూడు మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల ఎన్నిక‌లు కూడా నిర్వ‌హించాల‌నే ఆలోచ‌న‌తో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ప‌రిపాల‌న‌కు ఎన్నిక‌లు అడ్డంకిగా మార‌వ‌ద్ద‌నేది ముఖ్య‌మంత్రి కేసీఆర్ అభిప్రాయం. ఈ విష‌యాన్ని ఆయ‌న ప‌దేప‌దే చెబుతారు. త‌ర‌చూ ఏవో ఎన్నిక‌లు వ‌స్తుంటే ఎన్నిక‌ల కోడ్ కార‌ణంగా పాల‌న‌కు ఆటంకం క‌లుగుతుంద‌నేది ఆయ‌న భావ‌న‌.

అందుకే వ‌రుస‌గా అన్ని ఎన్నిక‌ల‌ను ఇప్పుడే పూర్తి చేసేసుకుంటే మ‌రో మూడేళ్ల వ‌ర‌కు ఏ ఎన్నిక‌లు లేకుండా పాల‌నకు ఆటంకాలు లేకుండా ఉంటాయ‌ని భావిస్తున్నారు. ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితులు కూడా టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉండ‌టంతో వ‌రుస‌గా ఎన్నిక‌లు జ‌రుపుకుంటూ వెళుతోంది. ఇప్ప‌టికే స్థానిక సంస్థ‌లు, పంచాయితీలు, మున్సిప‌ల్ ఎన్నిక‌లు పూర్త‌య్యాయి. స‌హ‌కార సంఘాల ఎన్నిక‌లూ మ‌రో నెల‌లో పూర్తి కానున్నాయి.

ఆ త‌ర్వాత కూడా వెంట‌నే గ్రేట‌ర్ హైద‌రాబాద్‌, గ్రేట‌ర్ వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం మున్సిపాల్ కార్పొరేష‌న్ల ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు కార్పొరేష‌న్లు ప్ర‌భుత్వానికి చాలా కీల‌కం. ముఖ్యంగా కోటి మంది జ‌నాభా నివ‌సించే గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌లు టీఆర్ఎస్‌కు ప్ర‌తిష్ఠాత్మ‌కం. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌తో పాటు వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం మున్సిపాలిటీలు టీఆర్ఎస్ చేతిలోనే ఉన్నాయి. వీటిల్లో మ‌ళ్లీ గులాబీ జెండా ఎగ‌రేయాల‌నేది ఆ పార్టీ ల‌క్ష్యం.

మూడు మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల‌కు ఎన్నిక‌లు జ‌రిగి నాలుగేళ్లు అవుతోంది. పాల‌క‌వ‌ర్గాల‌కు మ‌రో ఏడాది స‌మ‌యం ఉంది. కానీ, ఇప్పుడే ఈ పాల‌క‌వ‌ర్గాల‌ను ర‌ద్దు చేసేసి ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌నేది ప్ర‌భుత్వ ఆలోచ‌న‌గా తెలుస్తోంది.

మ‌రో మూడు, నాలుగు నెల‌ల్లోనే ఈ ప్ర‌క్రియ పూర్తై ఎన్నిక‌లు జ‌రిపే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ ఎన్నిక‌లు కూడా పూర్త‌యితే తెలంగాణ‌లో మ‌ళ్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల వ‌ర‌కు మ‌రో ఎన్నిక‌లు ఉండ‌వు. కాబ‌ట్టి ఈ ఎన్నిక‌లు కూడా పూర్తి చేసేస్తే ఇక పాల‌న‌కు ఎన్నిక‌లు అడ్డంకిగా మార‌వ‌ని ప్ర‌భుత్వం భావిస్తూ ఉండ‌వ‌చ్చు.

ఇక‌, ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితులు కూడా ఈ మూడు మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల‌కు ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని ప్ర‌భుత్వం ఆలోచించేందుకు కార‌ణాలుగా క‌నిపిస్తున్నాయి. ఇటీవ‌లి మున్సిపల్ ఎన్నిక‌లు ఫ‌లితాల‌ను ప‌రిశీలిస్తే మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల‌లో బీజేపీకి ఓట్లు గ‌ణ‌నీయంగా పెరిగాయి. అన్ని కార్పొరేష‌న్ల‌నూ టీఆర్ఎస్ పార్టీనే గెలుచుకున్నా బీజేపీ కూడా భారీగా ఓట్లు, ఊహించిన దాని కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంది. రానురాను కార్పొరేష‌న్ల‌లో బీజేపీ మరింత పుంజుకునే అవ‌కాశాలు కూడా ఉన్నాయి.

పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో జీహెచ్ఎంసీ ప‌రిధిలో టీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ త‌గిలింది. సికింద్రాబాద్ పార్ల‌మెంటును బీజేపీ గెలుచుకుంది. మ‌ల్కాజ్‌గిరిని కాంగ్రెస్ కైవ‌సం చేసుకుంది. ఈ రెండు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలోనే జీహెచ్ఎంసీలోని మెజారిటీ డివిజ‌న్లు ఉంటాయి. కాబ‌ట్టి, జీహెచ్ఎంసీలో ఈ రెండు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో స‌త్తా చాటి బీజేపీ, కాంగ్రెస్ దూకుడుకు బ్రేకులు వేయాల‌నేది కూడా టీఆర్ఎస్ ఆలోచ‌న కావ‌చ్చు.

వ‌రుస విజ‌యాల‌తో, రాజ‌కీయ ప‌రిస్థితులు త‌మ‌కు అనుకూలంగా ఉన్న ఈ స‌మ‌యంలోనే ఈ ఎన్నిక‌లకు వెళితే సులువుగా విజ‌యం సాధించవ‌చ్చ‌నే ఆలోచ‌న టీఆర్ఎస్ చేస్తుండ‌వ‌చ్చు. అయితే, ప్ర‌భుత్వం మాత్రం షెడ్యూల్ ప్ర‌కారమే ఈ కార్పొరేష‌న్ల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని చెబుతోంది.

: కాంగ్రెస్‌ పార్టీ తా‍త్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరారు. స్వల్ప అనారోగ్యం కారణంగా ఢిల్లీలోని గంగారామ్‌ ఆస్పత్రిలో చేరినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చిక్సిత అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాల నుంచి ‍ప్రకటన వెలువడాల్సి ఉంది.

అయిత పార్టీ వర్గాల మాత్రం సాధారణ చెకప్‌గా చెబుతున్నారు. కాగా ఉదరకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమె గతంలో కూడా చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజా ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ నేతలు హుటాహుటినా ఆస్పత్రికి చేరుకుంటున్నారు.

 

తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   19 minutes ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   an hour ago


వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   15 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   11 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   13 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   15 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   18 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   19 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   21 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   a day ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle