newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

దుమారం రేపుతున్న కేటీఆర్ ఫామ్ హౌస్.. రేవంత్ డ్రోన్!

06-03-202006-03-2020 11:51:44 IST
Updated On 06-03-2020 12:33:50 ISTUpdated On 06-03-20202020-03-06T06:21:44.040Z06-03-2020 2020-03-06T06:21:13.425Z - 2020-03-06T07:03:50.262Z - 06-03-2020

దుమారం రేపుతున్న కేటీఆర్ ఫామ్ హౌస్.. రేవంత్ డ్రోన్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కొద్దీ రోజులు స్థబ్ధుగా ఉన్న తెలంగాణ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి కొద్దిగా కాకరేపే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం పట్టణ ప్రగతికి రేవంత్ పట్నం గోస అంటూ కౌంటర్ స్టార్ట్ చేయగానే రేవంత్ కుటుంబంపై భూకబ్జా కేసు ఒకటి తెరపైకి వచ్చింది. ఆ వివాదంలో ఎవరి వెర్షన్ వాళ్ళకి ఉన్నా ప్రజలకి మాత్రం కక్ష్య సాధింపుగా కనిపించే అవకాశాలే ఎక్కువ.

అదలా ఉండగానే రేవంత్ కేటీఆర్ ఫామ్ హౌస్ అనే ఓ ఆటంబాంబు పేల్చారు. ఫామ్ హౌస్ ఉండడం తప్పేం కాదు. ఇప్పుడు కొత్తగా రాజకీయాలలోకి వచ్చిన వాళ్ళు కూడా ఫామ్ హౌస్ ఉండడం స్టేటస్ గా మారిపోయింది. అలాంటిది యువరాజుకి ఉండడం తప్పేం కాదు. కానీ అది నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయన్నదే వివాదమైంది.

నిజానికి అసలు కేటీఆర్ కి ఫామ్ హౌస్ ఒకటి ఉందన్నది అంతకు ముందు ఎవరికీ తెలియదు. అది కూడా రేవంత్ ఆరోపిస్తున్నట్లుగా కేంద్రం-సుప్రీమ్ కోర్టు నిబంధనలకు విరుద్ధంగా కట్టారన్నది అసలే తెలియదు. రేవంత్ డ్రోన్ కెమెరాలను ఉపయోగించి ఈ బండారాన్ని బట్టబయలు చేసేశారు. అక్కడ నుండే ఇది పెనుదుమారంగా మారింది.

రేవంత్ భూకబ్జా అంశం ప్రభుత్వం కక్ష్య సాధింపులో భాగంగానే చేసిందని కాంగ్రెస్ నేతలు ఎంత ఆరోపణలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ కేటీఆర్ ఫామ్ హౌస్ వివాదంపై ఎమ్మెల్యే బాల్కసుమన్ తో మీడియా సమావేశం పెట్టించి కేటీఆర్ అన్నకి ఫామ్ హౌస్ తప్పేం కాదే.. ఇది అందరికీ తెలిసిందే.. అదేదో బ్రహ్మాండం కాదే అనేశారు.

అయితే ఫామ్ హౌస్ ఉండడం తప్పేం కాదని.. నిబంధనలతోనే కట్టారా అన్నదే ఇక్కడ విషయం. దీనికి కేటీఆర్ స్పందించి సమాధానమిస్తే పోయేది కానీ ఆ పనిచేయకపోగా ఎదురుదాడికి ప్రయత్నిచారన్న విమర్శలు వినిపించాయి. ఇక ఇదే విషయంలో గురువారం ఢిల్లీ నుండి వచ్చిన ఎంపీని శంషాబాద్ విమానాశ్రయం నుండే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.

కేటీఆర్ గెస్ట్ హౌస్ ఉన్న ప్రాంతంలో డ్రోన్ కెమెరాలకు అనుమతి లేదని అప్పుడే మొత్తం ఎనిమిది మంది మీద కేసులు బుక్ చేశారు. ఇందులో ఏ-1గా రేవంత్ రెడ్డిని చేర్చిన పోలీసులు వ్యక్తిగతంగా నార్సింగి పోలీసుల ఎదుట హాజరవ్వాలని కోరారు. ఇదే కేసులో గురువారం రేవంత్ ను అరెస్ట్ చేసి జడ్జి ఇంటికి తీసుకెళ్లి హాజరుపరచి 14 రోజుల రిమాండ్ విధించి చర్లపల్లి జైలుకి తరలించారు.

అయితే, ఇప్పుడు అసలు నిబంధలను రేవంత్ అండ్ టీం అతిక్రమించారని కేసులు పెట్టారు నిజమే.. న్యాయమే. ఇంతకీ అసలు ఫామ్ హౌస్ నిబంధనల ప్రకారమే కట్టుకున్నారా? అన్న దానికి మాత్రం సమాధానం చెప్పే నాధుడే లేరు. పైగా హడావుడి అరెస్టులు.. రిమాండులు పలురకాల అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. మొత్తం మీద కేటీఆర్ ఫామ్ హౌస్.. రేవంత్ డ్రోన్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిపోయాయి.

 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   12 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   8 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   10 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   13 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   15 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   17 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   18 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   19 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   20 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle