దుబ్బాక ఉప ఎన్నికలో తెరాసకు పోటీ ఉంటుందా?
15-09-202015-09-2020 17:04:47 IST
2020-09-15T11:34:47.373Z15-09-2020 2020-09-15T11:34:45.284Z - - 17-04-2021

సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. సభ్యుడి మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని ఆ సభ్యుడి కుటుంబ సభ్యులతో భర్తీ చేయాలన్న భావనతో అక్కడ పోటీకి ప్రధాన పక్షాలు పెద్దగా శ్రద్థ చూపకపోవడమన్నది ఒక ఆనవాయితీగా వస్తోంది. అయితే దుబ్బాక విషయంలో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తున్నది. ఇక్కడ జరగనున్న ఉప ఎన్నికలో అన్ని పార్టీలూ పోటీ చేస్తామని ప్రకటించాయి. తెరాస సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాతను బరిలోకి దింపనున్నట్లుగా ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఆమె అభ్యర్థిత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధికారిక ప్రకటనే తరువాయి అంటున్నారు. దుబ్బాకు స్థానాన్ని కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో కాంగ్రెస్ ఇప్పటికే అక్కడ ప్రచారం ప్రారంభించింది. బీజేపీ కూడా ఎన్నికల బరిలో నిలవాలన్న నిర్ణయానికి వచ్చేసింది. ఆ పార్టీ అభ్యర్థిగా రఘునందన్ రావు పోటీపడే అవకాశాలు కనిపిస్తున్నాయి బిహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూలు వెలువడుతుందన్న అంచనాల నేపథ్యంలో దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నికల వేడి రాజుకుంది. సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్, మంత్రి హరీశ్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గాలకు దుబ్బాక పొరుగునే ఉండటంతో అధికారపార్టీ ఉపఎన్నికలో విజయం సునాయాసమన్న భరోసాతో ఉంది. మంత్రి హరీష్‌రావు వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని మరీ దుబ్బాక నియోజకవర్గంలో మండలాలవారీగా విస్తృతంగా పర్యటించి కార్యకర్తలతో భేటీ అవుతూ. కల్యాణలక్ష్మి , షాదీముబారక్ చెక్కుల పంపిణీ, చెరువుల్లో చేపలు వదలడం వంటి అధికారిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, పార్టీ కేడర్ లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. మరోవైపు ఇక్కడ పోటీకి సిద్ధపడుతున్న పక్షాలు తమ బలం కంటే...అధికార పక్షంపై ప్రజల్లో అసంతృప్తిపైనే ఎక్కువ ఆధారపడుతున్నట్లుగా కనిపిస్తున్నది. ముఖ్యంగా కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటల్లో సతమతమౌతూ ఎన్నికల వ్యూహరచనలో బాగా వెనుకబడి ఉంది. వరుస పరాజయాలతో ఆ పార్టీ క్యాడర్ కూడా నిరుత్సాహంగా ఉందన్నది పరిశీలకుల విశ్లేషణ. మరోవైపు బీజేపీ అభ్యర్థిని నిలబెట్టి ప్రచారం చేయడం వినా విజయంపై ధీమా వ్యక్తం చేయడంలేదు. ఈ పరిస్థితుల్లో దుబ్బాకలో తెరాసకు నిజమైన పోటీ ఉంటుందా అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి.

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!
10 hours ago

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు
15 hours ago

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు
11 hours ago

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ
15 hours ago

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!
13 hours ago

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత
18 hours ago

లక్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడినట్లే- రఘురామ
17 hours ago

తిరుపతిలో ఇవాళ అమ్మవారి కటాక్షమే పార్టీలకు ఇంపార్టెంట్
20 hours ago

షర్మిల పక్కనే విజయమ్మ.. లాభమా నష్టమా
16 hours ago

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
21 hours ago
ఇంకా