newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

దుబ్బాక ఉపఎన్నిక.. బండి సంజయ్ కు పరీక్ష

11-09-202011-09-2020 15:13:44 IST
2020-09-11T09:43:44.096Z11-09-2020 2020-09-11T09:38:17.981Z - - 14-04-2021

దుబ్బాక ఉపఎన్నిక.. బండి సంజయ్ కు పరీక్ష
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ బీజేపీ సారథ్య బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి సారిగా బండి సంజయ్ పరీక్ష ఎదుర్కొంటున్నారు. అది కూడా సాదా సీదా పరీక్ష కాదు... తన నాయకత్వానికి బీజేపీ క్షేత్ర స్థాయి  కార్యకర్తల నుంచీ మద్దతు కూడగట్టాలన్నా, అధినాయకత్వం విశ్వాసం చూరగొనాలన్న త్వరలో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఎన్నికలలో పార్టీని విజయపథంలో నడిపించాలి... కనీసం గట్టి పోటీయేనా ఇచ్చేలా బీజేపీ శ్రేణులను కదం తొక్కించాలి. ఈ పరీక్ష ఎదుర్కొనేందుకు బండి సంజయ్ సమాయత్తమౌతున్నారు.   

అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తరువాత తొలిసారిగా ఆయన  మూడురోజుల పాటు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన ప్రసంగాలన్నీ టీఆర్‌ఎస్‌పైనా, కేసిఆర్‌పైనా విమర్శలు గుప్పించడానికే సరిపెట్టారు. అయితే ఈ పర్యటన విషయంలో పెద్దగా ప్రజాస్పందన కనిపించిన దాఖలాలు లేవు. పార్టీ అధ్యక్షుడిగా అయన ఇప్పుడు ప్రధాన సవాళ్లను బండి ఎదుర్కోవలసి ఉంది.   

దుబ్బాక లో పోటీకి బీజేపీ సిద్దపడుతోంది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయం అని చెబుతున్న కమలనాథులు,  ఇక్కడ సత్తా చాటాల్సి ఉంది. బండి సంజయ్ నాయకత్వ పటిమకు ఈ ఎన్నికలలో ఆయన అనుసరించే వ్యూహాలే గీటురాయి కానున్నాయి. ఆయన ఎన్నికల వ్యూహానికి ఇది తొలిపరీక్ష కాబోతోంది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల తర్వాత జరిగిన స్థానిక సమరంలో పార్టీ అనుకున్నంత స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది.

అయితే అప్పటికి బండి సంజయ్ పార్టీ రాష్ట్ర సారథి కాదు. ఇక  దుబ్బాక తర్వాత గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు ఎన్నికలూ కూడా రాష్ట్ర  బీజేపీకి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికీ అత్యంత కీలకమైనవనడంలో సందేహం లేదు. ఈ రెండు ఎన్నికలలో పార్టీని ప్రతిష్టాత్మక విజయాల దిశగా నడిపించడంలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ తన సత్తాను సామర్ధ్యాన్ని నిరూపించుకోగలుగుతారు.

రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీ ఇప్పుడు రాష్ట్రంలో ప్రజాసమస్యలపైనా, తెలంగాణ విమోచన దినోత్సవం విషయంలో టీఆర్ఎస్ అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టడంపైనా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఇఫ్పటికే ఆ పార్టీ కార్యాచరణ రూపొందించుకుని ఆ దిశగా అడుగులు వేస్తున్నది. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తరువాత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపై మరింత ఉదృతంగా ఆందోళనలు చేపట్టాలన్న యోచనలో ఉన్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   13 minutes ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   an hour ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   2 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   3 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   4 hours ago


కేటీఆర్ కి అంత సీన్ లేదులే

కేటీఆర్ కి అంత సీన్ లేదులే

   6 hours ago


పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!

   6 hours ago


కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ

   21 hours ago


వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!

   21 hours ago


ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!

ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle