దుబ్బాకలో ఏం జరుగుతోంది..? ఉప ఎన్నికలో అభ్యర్థులు వీరేనా..?
02-09-202002-09-2020 08:23:35 IST
Updated On 02-09-2020 08:42:36 ISTUpdated On 02-09-20202020-09-02T02:53:35.309Z02-09-2020 2020-09-02T02:47:51.754Z - 2020-09-02T03:12:36.737Z - 02-09-2020

దుబ్బాకలో ఉప ఎన్నిక రాజకీయం రాజుకుంటోంది. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హఠాన్మరణంతో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం కానుంది. అయితే, ఎవరైనా శాసనసభ్యులు మరణిస్తే వారి కుటుంబసభ్యులే ఉప ఎన్నికలో పోటీ చేస్తే ఇతర పార్టీలు పోటీ చేయకపోవడం అనే ఆనవాయితీ కొన్ని రోజులు ఉండేది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఆనవాయితీని పార్టీలు పాటిస్తున్నాయి. కానీ, తెలంగాణలో ఇలా జరగడం లేదు. గత అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాంరెడ్డి వెంకట్ రెడ్డి, కిష్టారెడ్డి మరణిస్తే ఉప ఎన్నికల్లో వారి కుటుంబసభ్యులే పోటీ చేసినా టీఆర్ఎస్ వారిపై పోటీ పెట్టి ఓడించింది. దీంతో దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్పైన మిగతా పార్టీలు అభ్యర్థులను నిలుపుతాయి. ఇప్పటికే దుబ్బాకలో తమ పార్టీ పోటీలో ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. తాము కూడా పోటీ చేసేందుకు బీజేపీ కూడా నిర్ణయించింది. దీంతో దుబ్బాక ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు దాదాపుగా లేవు. అయితే, ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు అప్పుడే పార్టీలో దుబ్బాకపై నజర్ పెట్టాయి. అధికార టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దుబ్బాక నియోజకవర్గ బాధ్యతలను మంత్రి హరీష్ రావు తీసుకున్నారు. తన స్వంత నియోజకవర్గం సిద్దిపేటకు దుబ్బక పొరుగునే ఉంటుంది. ఆ నియోజకవర్గ పరిస్థితులపై హరీష్ రావుకు పూర్తి అవగాహన ఉంది. ఇప్పటికే ఆయన దుబ్బాక నియోజకవర్గంలో పర్యటనలు మొదలుపెట్టారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను హరీష్ రావు ప్రారంభిస్తున్నారు. అయితే, ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తన రాజకీయ వారసుడిగా కుమారుడు సతీష్ రెడ్డిని చేయాలని రామలింగారెడ్డి అనుకున్నారు. సతీష్ రెడ్డిని ఆయన పలుమార్లు తెరపైకి తీసుకువచ్చారు. దీంతో రామలింగారెడ్డి మరణం తర్వాత సతీష్ రెడ్డినే ఉప ఎన్నికల్లో పోటీ చేయిస్తారని అంతా అనుకుంటున్నారు. కానీ, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి కూడా టిక్కెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. చెరుకు ముత్యంరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆయన సీనియర్ నేత. టీఆర్ఎస్లో చేరినా ముత్యంరెడ్డికి ఎటువంటి పదవి దక్కలేదు. ఇటీవల ఆయన మరణించారు. ముత్యం రెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్లో యాక్టీవ్‌గా ఉన్నారు. దీంతో ఆయన కూడా దుబ్బాక ఉప ఎన్నికలో టిక్కెట్ ఆశిస్తున్నారు. మండలాల వారీగా ఆయన తన అనుచరులతో సమావేశమవుతున్నారు. ఇంకొందరు నాయకులు మాత్రం సోలిపేట కుటుంబసభ్యులకు టిక్కెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో టీఆర్ఎస్ టిక్కెట్ ఎవరికి దక్కనుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక, కాంగ్రెస్ పార్టీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన వ్యాపారవేత్త ఇప్పుడు రాజకీయంగా యాక్టీవ్‌గా లేరు. దీంతో ఇతర నాయకులు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. రెండు మండలాలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కర్ణాల శ్రీనివాస్ అనే నేత పోటీకి సిద్ధపడుతున్నారు. ఇక, బీజేపీ తరపున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన రఘునందన్ రావు మళ్లీ పోటీ చేయడం ఖాయమే. ఆయన ఇప్పటికే నియోజకవర్గంలో ప్రతీరోజూ పర్యటిస్తున్నారు. టీఆర్ఎస్ను గెలిపిస్తే ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఒకటి పెరుగుతుందని, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే టీఆర్ఎస్లోకి వెళ్లిపోతారని, తనను గెలిపిస్తే ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ఉంటానని ఆయన ప్రచారం చేయాలని అనుకుంటున్నారు. మొత్తంగా దుబ్బాకలో ఇప్పటికే రాజకీయవేడి మొదలయ్యింది.

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
42 minutes ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
an hour ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
3 hours ago

కేటీఆర్ కి అంత సీన్ లేదులే
4 hours ago

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!
5 hours ago

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ
20 hours ago

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!
19 hours ago

ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!
20 hours ago

గత సావాసంతో టీఆర్ఎస్ కు కమ్యూనిస్టుల సపోర్ట్
19 hours ago

మమత ప్రచారంపై 24 గంటల బ్యాన్. ఈసీ కొరడా..
13-04-2021
ఇంకా