newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

దిశ నిందితుల రీ పోస్ట్ మార్టంపై హైకోర్ట్‌కు సీడీ, నివేదిక

24-12-201924-12-2019 15:16:57 IST
2019-12-24T09:46:57.574Z24-12-2019 2019-12-24T09:46:50.995Z - - 15-08-2020

దిశ నిందితుల రీ పోస్ట్ మార్టంపై హైకోర్ట్‌కు సీడీ, నివేదిక
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైకోర్టు ఆదేశాలతో ఎయిమ్స్ వైద్యులు దిశ నిందితుల రీపోస్టుమార్టం నిర్వహించిన సంగతి తెలిసిందే. సుదీర్ఘంగా సాగిన రీపోస్టుమార్టం తాలూకు ప్రిలిమినరి రిపోర్ట్ హైకోర్టు రిజిస్ట్రార్ కు చేరింది. ఎయిమ్స్ వైద్యులు ప్రిలిమినరి రిపోర్ట్‌తో పాటు వీడియో రికార్డు చేసిన సీడీని రిజిస్ట్రార్‌కు అందించారు. ఢిల్లీ వెళ్లాక పూర్తి స్థాయి రిపోర్ట్ అందజేస్తామని ఎయిమ్స్ డాక్టర్లు తెలిపారు.

డాక్టర్‌ సుధీర్‌ గుప్తా, ఆదర్శ్‌ కుమార్, అభిషేక్‌ యాదవ్, వరుణ్‌ చంద్రాలతో కూడిన వైద్య బృందం మృతదేహాలకు 4 గంటలపాటు రీపోస్టుమార్టం ప్రక్రియ నిర్వహించింది. 

రీపోస్టుమార్టంలో నాలుగు మృతదేహాల పరిస్థితి, వాళ్లు మృతిచెందినప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, వారి బాడీలో ఎన్ని బుల్లెట్లు ఉన్నాయి.. వంటి కీలకమైన అంశాలను క్షుణ్ణంగా వివరించనున్నారు. ఈ పూర్తిస్థాయి నివేదిక తయారు చేసేందుకు మూడు, నాలుగు రోజులు పడుతుందని ఎయిమ్స్ వైద్య బృందం తెలిపింది. ఢిల్లీ వెళ్లిన వారంలోగా సమగ్రమైన నివేదికను పంపిస్తామని ఎయిమ్స్ బృందం పేర్కొంది

నిన్న గాంధీ ఆసుపత్రిలో దిశ నిందితులకు ప్రత్యేకమైన బందోబస్తు మధ్య రీపోస్టుమార్టం నిర్వహించిన విషయం తెలిసిందే. మరోవైపు దిశ కేసు నిందితుల అంత్యక్రియలు పూర్తయ్యాయి.  అవివాహితులైన శివ, నవీన్‌ ఇళ్ల ముందు పందిళ్లు వేసిన వారి కుటుంబ సభ్యులు ముందుగా తమ సంప్రదాయాల ప్రకా రం కత్తితో పెళ్లి చేశారు. తర్వాత మృతదేహాలను ట్రాక్టర్లలో వారి పొలాలకు తరలించారు.

చెన్నకేశవులు మృతదేహానికి పాడె కట్టి శవయాత్ర నిర్వహించారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్లలో జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు.. జక్లేర్‌లో మహ్మద్ ఆరిఫ్ అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహాలను వారివారి పొలాల్లోనే ఖననం చేశారు. తమ జీవనధారాన్ని పోలీసులు చంపేశారని నిందితుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

రీపోస్టుమార్టంకి ముందు ఎయిమ్స్ డాక్టర్ల టీం అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుంది. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రవణ్‌తో సమావేశమై మొదటి పోస్టుమార్టం నివేదికపై ఆరా తీసింది. అయితే ఆ నివేదిక తమ వద్ద లేదని, కోర్టుకు సమర్పించినట్లు డాక్టర్‌ శ్రవణ్‌ చెప్పిన విషయాన్నీ రికార్డు చేసుకుంది. అలాగే మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి అభ్యంతరాలను నమోదుచేసుకుంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle