newssting
BITING NEWS :
*న్యూస్ స్టింగ్ వీక్షకులకు, శ్రేయోభిలాషులకు మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు *మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు *నేడు మహాశివరాత్రి... శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మర్మోగుతున్న ఆలయాలు *వేములవాడ రాజన్న ఆలయానికి హెలికాప్టర్ సేవలు *శ్రీశైలంలో రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, అమ్మవార్ల కల్యాణోత్సవం *పంచాయితీరాజ్ చట్టంలో సవరణలపై ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ. గత కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వ్యవధిని తగ్గించిన ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఆర్డినెన్స్ *వైఎస్ వివేకా హత్యకేసు విచారణను సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్ పై విచారణ. సిట్ విచారణను సీల్డ్ కవర్ లో అందజేసిన ఏజీ. సిట్ విచారణ దాదాపుగా పూర్తి కాబోతుందని, ఈ సమయంలో సీబీఐ విచారణ అవసరం లేదన్న ఏజీ.కేసు జనరల్ డైరీ, కేసు డైరీ ఫైల్స్ ను సోమవారానికి సమర్పించాలని ఏజీని ఆదేశించిన ఏపీ హైకోర్టు*అమరావతి: చంద్రబాబు, లోకేష్ అత్యంత అవినీతిపరులు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఆస్తుల ప్రకటన-ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి *తిరుపతి: రుయా హాస్పిటల్ లో ఆవరణలో సైకోల వీరంగం. రుయా సెక్యూరిటీ సిబ్బందితో సైకోల వాగ్వాదం. బ్లేడులతో గాయపరుచుకున్న నలుగురు సైకోలు. భయంతో పరుగులు తీసిన నర్సులు *నేతలపై దాడులు చేస్తే ఎవరైనా వస్తారా..? పెట్టుబడులు వస్తాయా..? రైతుల ముసుగులో టీడీపీ గుండాలు నాపై దాడి చేసే ప్రయత్నం చేశారు-వైసీపీ ఎమ్మెల్యే రోజా

దిశ నిందితుల పోస్ట్ మార్టం... నివ్వెరపరిచే నిజాలు

08-12-201908-12-2019 20:07:12 IST
2019-12-08T14:37:12.821Z08-12-2019 2019-12-08T14:37:06.805Z - - 21-02-2020

దిశ నిందితుల పోస్ట్ మార్టం... నివ్వెరపరిచే నిజాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా దిశ కేసు సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత మహబూబ్‌నగర్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.

ఇందులో కీలక విషయాలు బయటపడినట్టు తెలుస్తోంది. నిందితుల శరీరాల్లో అసలు బల్లెట్లు లేకపోవడం విశేషం. నలుగురికి కలిపి 11 చోట్ల బుల్లెట్ గాయాలండగా.. అందరికీ బుల్లెట్లు శరీరంలో నుంచి బయటకు వెళ్లిపోయినట్టు రిపోర్టులో వెల్లడైంది.  పోస్టుమార్టం సందర్భంగా ఒక్క బుల్లెట్ కూడా రికవరీ కాకపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. 

ఏ1 నిందితుడు ఆరిఫ్ శరీరంలో 4 చోట్ల గాయాలయ్యాయి. రెండు ఛాతిలో, ఒకటి పక్కటెముకలో మరొకటి ఛాతిపై తగిలింది. ఏ2 నిందితుడు శివ శరీరంపై మూడు గాయాలయ్యాయి. రెండు కిడ్నీల ప్రాంతంలో ఒక బుల్లెట్ బయటకు వెళ్లిపోయింది.

ఇక ఏ3 నిందితుడు నవీన్ తలలోంచి ఒకటి, ఛాతిలోంచి రెండు బుల్లెట్లు బయటకు వచ్చాయి. ఏ4 చెన్నకేశవ గొంతులో ఒకే ఒక బుల్లెట్ దిగి బయటకు వచ్చినట్లు గుర్తించారు. కాగా ఎన్‌కౌంటర్‌ సమీపం లోంచి జరగడం వల్ల బుల్లెట్లు దేహంలో లేకుండా బయటకు వెళ్లినట్లు నిపుణులు చెబుతున్నారు.

దిశ కేసులో నిందితుల ఎన్ కౌంటర్ పై లోతైన విచారణ జరపాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.

రేప్ కేసుల్లో న్యాయం త్వరితగతిన రాదన్నారు. చట్టం ప్రకారం అన్నీ సజావుగా సాగాలన్నారు. ప్రతీకార బాటలో జరగకూడదన్నారు. ఇటు ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్.హెచ్.ఆర్.సీ  సభ్యులు ఈ ఎన్ కౌంటర్ పై రహస్యంగా సమాచారం సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. శనివారంనాడు.. ఎన్ కౌంటర్ లో మరణించిన మృతదేహాలను పరిశీలించారు.

ఫోరెన్సిక్ బృందంతో కూడా ప్రత్యేకంగా చర్చించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సోమవారం కూడా వారు నగరంలోనే ఉండి ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమవుతారని తెలుస్తోంది. ఇప్పటికే వీరు పోస్టుమార్టం నివేదికను కూడా అధ్యయనం చేశారు. ఆ తర్వాత షాద్ నగర్ లో ఎన్ కౌంటర్ జరిగిన చటాన్ పల్లి స్థలాన్ని పరిశీలించారు. ఈ ఎన్ కౌంటర్ పై వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేసిన కమిషన్ దీనిపై రహస్య విచారణ జరపడం గమనించాల్సిన అంశం. 

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

   6 hours ago


గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

   6 hours ago


చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

   9 hours ago


వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

   9 hours ago


గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

   10 hours ago


ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

   11 hours ago


‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

   13 hours ago


ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

   14 hours ago


శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

   14 hours ago


వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

   15 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle