newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

దిశ నిందితుల కుటుంబాలకు సుప్రీం షాక్

29-02-202029-02-2020 09:14:59 IST
2020-02-29T03:44:59.338Z29-02-2020 2020-02-29T03:44:54.144Z - - 12-04-2021

దిశ నిందితుల కుటుంబాలకు సుప్రీం షాక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో గత ఏడాది సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం,హత్య కేసులో ఎన్‌కౌంటర్ ఎంతటి కలకలం కలిగించిందో తెలిసిందే.  నలుగురు నిందితుల కుటుంభాల తమకు న్యాయం చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ  పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు నిందితుల కుటుంబాలకు షాకిచ్చింది. ఆ పిటిషన్ ను  సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఎన్‌కౌంటర్ మృతుల కుటుంబీకులకు ఎలాంటి పరిహారాన్ని చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. 

పౌర హక్కులు, మావన హక్కుల సంఘాల తరఫున ప్రముఖ న్యాయవాదులు మణి, యాదవ్, ఎంఎల్ శర్మ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. నిందితులు జొల్లు నవీన్ తల్లి లక్ష్మి, జొల్లు శివ తండ్రి రాజయ్య, చింతకుంట్ల చెన్నకేశవులు తండ్రి కూర్మన్న, మహ్మద్ ఆరిఫ్ భాషా తండ్రి పింజారి హుస్సేన్ తరఫున వారు ఈ పిల్‌ను వేశారు. ఈ పిల్‌ శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టు ముందు విచారణకు వచ్చింది. 

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డె, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిల్ పై విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదోపవాదాలను పరిశీలించిన తరువాత పిటిషన్‌ను కొట్టి వేస్తున్నట్లు సీజేఐ బొబ్డె తెలిపారు. ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించడానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిషన్ ముందు, తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేయాలని పిటిషనర్లకు సూచించింది ధర్మాసనం.

పిటిషన్‌దారు తొలుత తన వద్ద ఉన్న సాక్ష్యాలన్నింటినీ కమిషన్‌కు అందజేయాలని పేర్కొంది. అనంతరం నష్ట పరిహారం కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించే వెసులుబాటును బాధిత కుటుంబాలకు కల్పించింది. అయితే పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పలు అంశాలను ప్రస్తావించింది,  ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్ఐఆర్‌ను నమోదు చేయాలా? వద్దా? అనే విషయాన్ని కూడా తాము ఏర్పాటు చేసిన కమిషనే  నిర్ణయిస్తుందని కోర్టు పేర్కొంది. 

ఈ ఎన్ కౌంటర్ ఘటనపై సమగ్రమయిన విచారణకు గత ఏడాది డిసెంబర్ లో సుప్రీంకోర్టు మాజీ జడ్డి వీఎస్ సిర్పూర్ కర్ నేతృత్వంలో కమిషన్ వేసింది. ఆరు నెలల వ్యవధిలో ఈ కమిషన్ తన నివేదికను సుప్రీంకోర్టుకు అందజేయాల్సి ఉంది. విచారణ కమిషన్ లో ముంబై హైకోర్టు మాజీ న్యాయమూర్తి రేఖా ప్రకాశ్, మాజీ సీబీఐ డైరెక్టర్ కార్తికేయన్ ఉన్నారు. త్రిసభ్య కమిషన్ కు సీఆర్ పీఎఫ్ భద్రత కల్పించారు. కమిషన్ ఖర్చులను తెలంగాణ ప్రభుత్వమే భరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle