newssting
BITING NEWS :
*జగన్ ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన విజయ సాయి రెడ్డి, టీఎస్ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వీడీ రాజగోపాల్..ఈ రోజు కోర్టుకు హాజరు కాకుండా ఆబ్సెంట్ పిటిషన్ వేసిన ఏపీ సీఎం జగన్*ఐబీ అధికారి అంకిత్ శర్మ శరీరంపై 400 కత్తిపోట్లు..ఆరు గంటల పాటు పేగులు లాగి మరి చిత్రహింసలు. పోస్ట్ మార్టంలో వెల్లడవుతున్న నిజాలు * ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం పర్యటన .. అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్ *ఢిల్లీ పోలీసు కమిషనర్ గా ఎస్.ఎన్. శ్రీవాత్సవ నియామకం..మూడు రోజుల క్రితమే ఆయన్ను స్పెషల్ కమిషనర్ గా నియమించిన ప్రభుత్వం *రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి సమీపంలో ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదం..బస్సును వెనకనుండి ఢీకొన్న కల్వకుర్తి ఆర్టీసీ డిపో బస్సు..20 మంది విద్యార్థుల్లో 6గురికి గాయాలు..ఆసుపత్రికి తరలింపు*ఇవాళ జాతీయ సైన్స్ దినోత్సవం

దిశ ఘ‌ట‌న‌లో ప్ర‌భుత్వానిది బాధ్య‌త లేదా..?

03-12-201903-12-2019 07:35:29 IST
2019-12-03T02:05:29.505Z03-12-2019 2019-12-03T02:05:23.760Z - - 28-02-2020

దిశ ఘ‌ట‌న‌లో ప్ర‌భుత్వానిది బాధ్య‌త లేదా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్ర‌పంచ స్థాయి న‌గ‌రంగా ఎదుగుతున్న హైద‌రాబాద్‌లో జ‌రిగిన వెట‌ర్న‌రీ వైద్యురాలు దిశ దారుణ హ‌త్య ఘ‌ట‌నపై దేశం యావ‌త్తు భ‌గ్గుగ‌మంటోంది. ఊరూరా, వాడ‌వాడ‌నా ప్ర‌జ‌లు రోడ్డెక్కి ఈ దారుణ ఘ‌ట‌న‌పై నిర‌స‌న తెలియ‌జేస్తున్నారు. ర్యాలీలు నిర్వ‌హిస్తున్నారు. ఈ దారుణానికి ఒడిగ‌ట్టిన రాక్ష‌సుల‌ను ఉరి తీయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా ఘ‌ట‌న జ‌రిగిన రోజు దిశ పోలీసుల‌కు ఫోన్ చేయ‌కుండా త‌ప్పు చేసింద‌ని, టోల్ బూత్ వ‌ద్ద‌కు వెళ్లి ఉంటే బాగుండేద‌నే వింత వాద‌న‌లూ వినిపిస్తున్నాయి. ఇక, దిశ ఆప‌ద‌లో ఉంద‌ని పోలీస్ స్టేష‌న్ల చుట్టూ తిరిగినా పోలీసులు స‌రిగ్గా స్పందించ‌లేద‌ని, పైగా అవ‌మాన‌క‌రంగా మాట్లాడార‌నే ఆవ‌ద‌న‌తో దిశ త‌ల్లిదండ్రులు ఉన్నారు. ఘ‌ట‌న‌పై స‌క్ర‌మంగా స్పందించ‌ని పోలీసులపై శాఖాప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకున్నారు.

అయితే, ఘ‌ట‌న‌కు అస‌లు కార‌ణం మ‌ద్యం. మ‌ద్యం మ‌త్తులోనే ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డామ‌ని నిందితులు స్వ‌యంగా అంగీక‌రించారు. ఈ ఒక్క సంఘ‌ట‌నే కాదు, దేశంలో జ‌రుగుతున్న అనేక నేరాలకు కార‌ణం మ‌ద్య‌మే.

జాతీయ నేర గ‌ణాంక న‌మోదు సంస్థ లెక్క‌ల ప్ర‌కారం మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న నేరాల్లో 70 నుంచి 85 శాతం నిందితులు మ‌ద్యం మ‌త్తులో ఉన్న‌ప్పుడు చేసిన‌వే. 2012లో ఢిల్లీలో సంచ‌ల‌నం సృష్టించిన నిర్భ‌య ఘ‌ట‌న‌లోనూ నిందితులు మ‌ద్యం సేవించి ఉన్నారు. ఇప్పుడు దిశ ఘ‌ట‌న‌లోనూ ఇదే జ‌రిగింది.

మ‌ద్యం అమ్మ‌కాల‌ను ఆదాయ వ‌న‌రుగా భావిస్తున్న ప్ర‌భుత్వాలు మ‌ద్యం అమ్మ‌కాల‌ను విచ్చ‌ల‌విడి ప్రోత్సహిస్తున్నాయి. మ‌ద్యం అమ్మ‌కాలు ఎన్నో కుటుంబాల్లో చిచ్చు రేపుతున్నాయి.

కుటుంబాలు వీధిన ప‌డుతున్నాయి. మ‌హిళ‌ల‌పై నేరాల‌కూ మ‌ద్యపాన‌మే ప్ర‌ధాన కార‌ణ‌మ‌వుతోంది. దిశ హ‌త్య ఘ‌ట‌న వంటి ఎన్నో దారుణ సంఘ‌ట‌న‌ల‌కు దారి తీస్తున్న మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోత్స‌హిస్తున్న ప్ర‌భుత్వానికి ఈ నేరాల్లో భాగం లేదా అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి.

మ‌ద్యం అమ్మ‌కాలు ఏటా పెరుగుతూ పోతున్నాయి. మ‌ద్యం ద్వారా వ‌చ్చే ఆదాయం కూడా పెరుగుతోంది. ఆదాయం చూసుకుంటున్న ప్ర‌భుత్వాలు అమ్మ‌కాల‌ను ప్రోత్స‌హిస్తున్నాయి. తెలంగాణ ఇది మ‌రీ ఎక్కువ‌. మ‌ద్యం షాపుల స‌మ‌య‌వేళ‌లు కూడా గ‌తంలో తెలంగాణ ప్ర‌భుత్వం పెంచి మ‌రీ మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోత్స‌హించింది. ఇక‌, హైవేల‌పై మ‌ద్యం అమ్మ‌కాల‌ను నియంత్రించ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మ‌వుతోంది.

కార‌ణంగా రోడ్డు ప్ర‌మాదాల్లో ఏటా వంద‌లాది మంది మృత్యువాత ప‌డుతున్నారు. దిశ వంటి ఘ‌ట‌న‌లు మ‌ళ్లీ జ‌ర‌గ‌వ‌ద్ద‌న్నా, నేరాలు తగ్గాల‌న్నా నిందితుల‌కు క‌ఠిన శిక్ష‌లు విధించ‌డంతో పాటు మ‌ద్యాన్ని నియంత్రించ‌డం త‌ప్ప‌నిస‌రి.

మ‌న దేశంలో గుజ‌రాత్‌, బిహార్‌లో ఇప్ప‌టికే మ‌ద్య నిషేదం అమ‌లులో ఉంది. ఏపీలో మ‌ద్య నిషేదం కోసం ప్ర‌భుత్వం అడుగులు వేస్తోంది. తెలంగాణ‌లోనూ మ‌ద్యం నియంత్రించ‌డం ద్వారానే నేరాల‌ను అదుపు చేయ‌వ‌చ్చ‌ని నిపుణులు స్ప‌ష్టం చేస్తున్నారు.

మ‌రి, మ‌ద్యాన్ని ఆదాయ వ‌న‌రుగా మార్చి సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్న ప్ర‌భుత్వాలు మ‌ద్యాన్ని నియంత్రించాలంటే ఎన్ని ఉద్య‌మాలు జ‌ర‌గాలో..?

ట్విట్టర్లో జగన్‌ని ఆటాడుకున్న చినబాబు

ట్విట్టర్లో జగన్‌ని ఆటాడుకున్న చినబాబు

   3 hours ago


టీడీపీ పిటిషన్‌పై విచారణ.. మార్చి 2కు వాయిదా

టీడీపీ పిటిషన్‌పై విచారణ.. మార్చి 2కు వాయిదా

   5 hours ago


కిలో టమోటా రూపాయి..రోడ్లపైనే వదిలేస్తున్న రైతన్న

కిలో టమోటా రూపాయి..రోడ్లపైనే వదిలేస్తున్న రైతన్న

   5 hours ago


పిచ్చి పీక్స్.. వాలంటీర్లే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్లు!

పిచ్చి పీక్స్.. వాలంటీర్లే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్లు!

   10 hours ago


వాహ్.. 13 కోట్లతో కేసీఆర్ ఫాంహౌజ్‌ పోలీస్ స్టేషన్!

వాహ్.. 13 కోట్లతో కేసీఆర్ ఫాంహౌజ్‌ పోలీస్ స్టేషన్!

   10 hours ago


కరోనా దెబ్బకు హడలిపోతున్న చైనా... భారత్ కీలక నిర్ణయం!

కరోనా దెబ్బకు హడలిపోతున్న చైనా... భారత్ కీలక నిర్ణయం!

   12 hours ago


అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్

అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్

   13 hours ago


 మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం ..కందుల రైతుల ఇబ్బందులు

మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం ..కందుల రైతుల ఇబ్బందులు

   13 hours ago


కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు... ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు

కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు... ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు

   13 hours ago


వైసీపీకి వార్నింగ్ బెల్స్ ఇస్తున్న సొంత క్యాడ‌ర్‌

వైసీపీకి వార్నింగ్ బెల్స్ ఇస్తున్న సొంత క్యాడ‌ర్‌

   14 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle