newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్... తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

06-12-201906-12-2019 21:47:13 IST
Updated On 12-12-2019 15:52:09 ISTUpdated On 12-12-20192019-12-06T16:17:13.544Z06-12-2019 2019-12-06T16:17:04.098Z - 2019-12-12T10:22:09.125Z - 12-12-2019

దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్... తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దిశ కేసులో నిందితులను శుక్రవారం తెల్లవారుజామున ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. ఈఘటనపై ఇవాళ విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌కౌంటర్ మృత దేహాలకు ఈ నెల 9వ తేదీ వరకు అంత్యక్రియలు నిర్వహించొద్దని ఆదేశించింది.

నాలుగు మృత దేహాలను మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోనే భద్రపరచాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది. ఎన్‌కౌంటర్ ఘటనపై ఇవాళ సాయంత్రం అందిన పిటిషన్‌ను కోర్టు అత్యవసరంగా విచారించింది. పోస్టు మార్టం మొత్తాన్ని వీడియోలో చిత్రీకరించి మహబూబ్‌నగర్ జిల్లా జడ్జీకి అందిచాలన హైకోర్టు చెప్పింది. దీనిపై ఈ నెల 9న ఉదయం 10.30 గంటలకు తదుపరి విచారణ జరుపుతామని.. అప్పటి వరకు మృతదేహాలను అక్కడే ఉంచాలని ఆదేశించింది. 

దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన దిశ నిందితుల ఎన్ కౌంటర్ సంఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయని సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నిందితుల దాడిలో గాయపడిన ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్‌గౌడ్‌కు కేర్ ఆస్పత్రిలో చికిత్స నిర్వహిస్తున్నారు. ఎస్‌ఐ తలకు గాయం కావడంతో ఐసీయూలో చికిత్స చేస్తున్నారు. కానిస్టేబుల్ అరవింద్ కుడి భుజంపై కర్ర గాయాలు అయ్యాయి. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కేర్ వైద్యులు తెలిపారు.

ఎన్‌కౌంటర్ ఎస్సై, కానిస్టేబుల్ పై నిందితులు రాళ్ళు, కర్రలతో దాడికి దిగారు. తొలుత మహ్మద్ ఆరిఫ్ తర్వాత చెన్నకేశవులు పోలీసులపై దాడి చేశారని సీపీ సజ్జనార్ ప్రకటించారు. ఎన్ కౌంటర్ ఘటనపై అసత్యాలను ప్రసారం చేయవద్దని, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని సజ్జనార్ మీడియాకు సూచించారు. ఈ ఎన్ కౌంటర్ ఉదయం 5.45 నుంచి 6.55 గంటల మధ్య జరిగిందని సీపీ సజ్జనార్ వివరించారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle