newssting
BITING NEWS :
మహారాష్ట్ర సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కలయికతో కూడిన మహావికాస్ ఆఘాదీ ప్రభుత్వం స్వయంగా కుప్పకూలిపోతుందన్న ఫడణవీస్. కూటమిని అధికారం నుంచి తొలగించడానికి బీజేపీ ఏం చేయనవసరం లేదని చెప్పిన ఫడణవీస్ * బీహార్ అసెంబ్లీ ఎన్నికల బందోబస్తుకు 30వేల మంది కేంద్ర బలగాలను పంపించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ నిర్ణయం. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ నిర్వహించేందుకు వీలుగా 30వేల మంది కేంద్ర బలగాల జవాన్లతో ఏర్పాటు చేయనున్న బందోబస్తు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలలో కేంద్ర అదనపు బలగాలతో రక్షణ * చైనా ఉత్పత్తులపై సుంకాలను పెంచడం పట్ల అగ్రరాజ్యంలోని దిగ్గజ కంపెనీల ఆగ్రహం. 30 వేల కోట్ల డాలర్ల విలువైన చైనా దిగుమతులపై సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం. ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ యూఎస్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌లో కేసులు వేసిన 3,500 కంపెనీలు * కర్ణాటక రాష్ట్రం కలబుర్గి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. సావళగి క్రాస్‌ అళంద రోడ్డుపై తెల్లవారుజామున రోడ్డుపక్కన ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి. నెలలు నిండిన మహిళకు నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళుతుండగా ప్రమాదం * 286వ రోజుకు చేరుకున్న అమరావతి రాజధాని రైతుల ఉద్యమం. గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం * ఏపీ‌లో కొనసాగుతున్న కరోనా విజృంభణ. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ. ఇటీవల తిరుమల బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్‌తో కలిసి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి. బ్రహ్మోత్సవాల అనంతరం స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న వెల్లంపల్లి * ప్రకాశం బ్యారేజీ వద్ద ఉధృతంగా ప్రవహిస్తోన్న కృష్ణా నది. కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక. ప్రాజెక్టు వద్ద 6,65,925 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో. కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు సూచన * తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి నూతన రథం నిర్మాణ పనులు ఆదివారం ప్రారంభం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మాన కృష్ణదాస్‌, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ * యాదాద్రి-భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం ప్రొద్దుటూరులో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాని కుప్పకూలిన పెంకుటిల్లు. అర్ధరాత్రి సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిన ఇల్లు. శబ్దాన్ని గమనించిన నలుగురు కుటుంబ సభ్యులు వెంటనే బయటకు రావడంతో తప్పిన ప్రాణాపాయం * నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం. 20 క్రస్టు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. 4,19,454 క్యూసెక్కులుగా ఉన్న ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 310.252 టీఎంసీలుగా నమోదు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను.. ప్రస్తుత నీటిమట్టం 589.40 అడుగులు * రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు తెలంగాణ ఎంసెట్ పరీక్ష. ఉదయం, మధ్యాహ్నం రెండు షెషన్‌లలో పరీక్ష నిర్వహణ. తెలంగాణ, ఆంధ్రాలో కలిపి మొత్తం 84 సెంటర్లలో పరీక్షను నిర్వహణ. తెలంగాణలో 67, ఆంధ్రాలో 17 పరీక్షా కేంద్రాలు

దిశ కేసులో ట్విస్ట్: నిందితుల్లో ఇద్దరు మైనర్లు

10-12-201910-12-2019 15:27:26 IST
Updated On 11-12-2019 09:53:13 ISTUpdated On 11-12-20192019-12-10T09:57:26.362Z10-12-2019 2019-12-10T09:57:24.123Z - 2019-12-11T04:23:13.742Z - 11-12-2019

దిశ కేసులో ట్విస్ట్: నిందితుల్లో ఇద్దరు మైనర్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దిశ కేసులో ఎన్ కౌంటర్లో మరణించిన నలుగురికి సంబంధించిన కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. హత్య కేసులో నలుగురు నిందితులు పట్టబడడం, పోలీసుల ఎన్‌‌‌కౌంటర్‌లో వారు మరణించడం తెలిసిందే. అయితే నలుగురిలో ఇద్దరు మైనర్లు ఉన్నారనే అంశం తెరమీదకు వచ్చింది. తమ కొడుకులు జొల్లు నవీన్, జొల్లు శివ మైనర్లని వారి తల్లిదండ్రులు ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందానికి తెలిపారు.

వారు మైనర్లు అనడానికి కావలసిన సర్టిఫికెట్లు కూడా మానవహక్కుల సంఘానికి అందించారని తెలుస్తోంది. ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యులు మృతుల ఆధార్ కార్డులు, సర్టిఫికెట్స్‌ను పరిశీలించగా. తేదీలు వేర్వేరుగా ఉండటంతో.. దిశ కేసు మరో మలుపు తిరిగింది.

స్కూల్ రిజిస్టర్‌లో నమోదైన బర్త్ డేట్ ఆధారంగా జొల్లు శివ ఆగష్టు 15, 2002లో జన్మించాడు. డిసెంబర్ 6న ఎన్ కౌంటర్ సమయంలో మరణించేటప్పటికి 17 సంవత్సరాల వయసులోనే వున్నారు. అతను చదివిన  పాఠశాల బోనఫైడ్ సర్టిఫికెట్‌ లో శివ 2008-12 మధ్య 2వ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు చదివాడని చెబుతున్నారు. 

జొల్లు నవీన్ తల్లి జొల్లు లక్ష్మి కూడా తన కొడుకు మైనర్ అంటోంది. నవీన్ 2002 ఆఖర్లో జన్మించాడు. అతను పుట్టాక నాలుగేళ్ళకు భర్త ఎల్లప్ప క్యాన్సర్ కారణంగా మృతి చెందినట్టు తల్లి చెబుతోంది. గ్రామస్తులు కూడా  శివ, నవీన్‌లు ఏడో తరగతితోనే చదువు మానేశాడంటున్నారు. తమ పిల్లలు నేరం చేసినా.. పోలీసులు ఇంత దారుణంగా చంపేయడం ఏంటని నవీన్ తల్లి లక్ష్మీ కన్నీటి పర్యంతం అవుతున్నారు. అటు శివ తండ్రి కొడుకుని ఎన్ కౌంటర్ చేసిన పోలీసుల తీరుపై మండిపడుతున్నాడు.

న్యాయస్థానం వరకూ వెళ్లకుండానే పోలీసులు విచక్షణా రహితంగా ఎన్‌కౌంటర్‌ చేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. తన కొడుకుని ఇలా చంపే హక్కు పోలీసులకు లేదని శివ తండ్రి రాజన్న అన్నారు. నవీన్ తల్లి లక్ష్మిని, శివ తండ్రి రాజన్నను ఎన్‌హెచ్‌ఆర్‌సి దర్యాప్తు బృందం హైదరాబాద్‌కు పిలిపించి మాట్లాడింది. ఎన్ కౌంటర్లో ఇద్దరు మైనర్లు హతం కావడంపై మానవహక్కుల సంఘం ఎలా స్పందిస్తుందో చూడాలి. 

ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నచోట కష్టమే కానీ.. పురందేశ్వరి

ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నచోట కష్టమే కానీ.. పురందేశ్వరి

   23 minutes ago


మేం లేని ఎన్డీఏ ఇంకా ఎక్కడ.. పెదవి విరిచిన శివసేన

మేం లేని ఎన్డీఏ ఇంకా ఎక్కడ.. పెదవి విరిచిన శివసేన

   39 minutes ago


చంద్రబాబుకు నోటీసులు..!

చంద్రబాబుకు నోటీసులు..!

   an hour ago


ఇంటివద్దే వైద్య పరీక్షలు.. దేశంలోనే ఏపీలో మొదటగా ప్రారంభం

ఇంటివద్దే వైద్య పరీక్షలు.. దేశంలోనే ఏపీలో మొదటగా ప్రారంభం

   an hour ago


60 టీఎంసీల నీటి వరదతో కృష్ణమ్మ మహోగ్ర రూపం.. తెలంగాణకు జలసిరి

60 టీఎంసీల నీటి వరదతో కృష్ణమ్మ మహోగ్ర రూపం.. తెలంగాణకు జలసిరి

   an hour ago


అధికారమే లక్ష్యంగా పనిచేద్దాం.. కొత్త ఇన్‌చార్జ్ మాణిక్యం

అధికారమే లక్ష్యంగా పనిచేద్దాం.. కొత్త ఇన్‌చార్జ్ మాణిక్యం

   3 hours ago


ప్రైవేట్ విద్యపై సర్కారు బడి ఘనవిజయం.. కలకలలాడుతున్న ప్రభుత్వ బళ్లు

ప్రైవేట్ విద్యపై సర్కారు బడి ఘనవిజయం.. కలకలలాడుతున్న ప్రభుత్వ బళ్లు

   3 hours ago


చేతులు మారుతున్న ఏపీలో పోర్టులు..  కాకినాడ పోర్టు అరబిందో కైవ‌సం?!

చేతులు మారుతున్న ఏపీలో పోర్టులు.. కాకినాడ పోర్టు అరబిందో కైవ‌సం?!

   19 hours ago


గ్రేటర్ వరద ప్రాంతాలలో రేవంత్ పర్యటన.. కారుని ఢీ కొడతారా?

గ్రేటర్ వరద ప్రాంతాలలో రేవంత్ పర్యటన.. కారుని ఢీ కొడతారా?

   19 hours ago


ఏపీకి మ‌ద్యం అక్ర‌మ ర‌వాణాలో కొత్త పుంత‌లు

ఏపీకి మ‌ద్యం అక్ర‌మ ర‌వాణాలో కొత్త పుంత‌లు

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle