newssting
BITING NEWS :
*ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..రాష్ట్రపతి భవన్‌ లో విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌ *రెండవ రోజు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన *దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌ *తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల్లో నేడు నామినేషన్ల స్వీకరణ * కుప్పంలో రెండోరోజు పర్యటించనున్న చంద్రబాబు* ఏపీ స్థానికల రిజర్వేషన్లపై తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఫాలో అప్ *వివేకా హత్యకేసుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు *ఇవాళ హైదరాబాద్ హౌస్ లో మోదీతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు *ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ గా రామ్‌ నివాస్‌ గోయల్ ఏకగ్రీవ ఎన్నిక*అమరావతి: 70వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతుల ధర్నాలు*వికారాబాద్: కొడంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. బీజాపూర్ - హైదరాబాద్ హైవేపై కారును ఢీకొట్టిన లారీ. భార్యాభర్తలకు తీవ్రగాయాలు. హాస్పిటల్ కు తరలింపు*భారతీయ సినిమాలు గ్రేట్.. దిల్‌వాలే దుల్హనియా, షోలే చిత్రాలు గొప్పవి-డొనాల్డ్ ట్రంప్

దిశ కేసుపై చినజీయర్ ఏమన్నారంటే..

04-12-201904-12-2019 15:48:31 IST
2019-12-04T10:18:31.566Z04-12-2019 2019-12-04T10:18:21.835Z - - 25-02-2020

దిశ కేసుపై చినజీయర్ ఏమన్నారంటే..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా దిశ కేసు చర్చనీయాంశంగా మారింది. ఈ దారుణ ఘటనపై అందరూ స్పందిస్తున్నారు. తాజాగా ఆధ్యాత్మిక వేత్త చినజీయర్ స్వామి స్పందించారు. దేశం మొత్తం రాక్షసులు,హిరణ్యక్షులతో నిండిపోయినట్టుగా అనిపిస్తోందని ఆధ్యాత్మికవేత్త చినజీయర్‌స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించేవారికి కఠినశిక్షలు విధించాలన్నారు.

ఇలాంటి రాక్షసులకు తగిన శిక్షలు విధించకపోతే మరిన్ని ఘోరాలు జరుగుతాయని అన్నారు. నిందితులకు సరైన శిక్షలు పడకపోయినా.. శిక్షలు వాయిదా వేసినా.. ఇలాంటి చర్యలు నేరస్తులకు అలవాటుగా మారతాయన్నారు. కోర్టులు సరైన నిర్ణయం తీసుకుని దోషులకు కఠిన శిక్షలు అమలుచేయాలని భగవంతుడిని ప్రార్థిద్దామన్నారు. అరబ్ దేశాల్లో చిన్న చిన్న దొంగతనాలకే నలుగురి ముందు నిల్చోబెట్టి వేళ్లు నరికేస్తారని .. అలాంటి శిక్షల వల్లే నేరాలు తగ్గుతాయన్నారు.

పెద్ద నేరాలకైతే నడిరోడ్డు మీదే మరణశిక్షలు అమలుచేస్తారని చెప్పారు. దండించడంలో లోపం ఉండకూడదన్నారు. నేరానికి తగిన శిక్ష వెంటనే అమలుచేయాలన్నారు. అలా చేయకపోతే.. నేరస్తులను ప్రోత్సహించినట్టు అవుతుందన్నారు. దురదృష్టం కొద్ది మన దేశంలో దోషులు దొరికినా దండనీతి అమలుచేయలేకపోతున్నారని వాపోయారు. ఇంకోసారి నేరం చేయాలంటే 'ఖబడ్దార్' అన్న రీతిలో శిక్షలు అమలుచేస్తే వారిలో భయం కలుగుతుందన్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle