newssting
BITING NEWS :
*భారత్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన.. భారీ భద్రతా ఏర్పాట్లు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన... హైకోర్టు ఆదేశాలతో తుళ్లూరులో ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు* ఢిల్లీలోని జఫ్రాబాద్ మెట్రో స్టేషన్‌లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు..భారీగా తరలివచ్చిన మహిళలు*తిరుమలలో మరోసారి ప్రత్యక్షమైన బంగారు బల్లి.. చూసేందుకు బారులు తీరిన భక్తులు....శిలాతోరణం చక్రతీర్థంలో బంగారు బల్లి ప్రత్యక్షం

దిశ ఎన్ కౌంటర్‌ ఎఫెక్ట్: హత్య కేసులో నిందితుడి ఆత్మహత్య

10-12-201910-12-2019 15:49:20 IST
Updated On 11-12-2019 09:50:52 ISTUpdated On 11-12-20192019-12-10T10:19:20.170Z10-12-2019 2019-12-10T10:19:13.727Z - 2019-12-11T04:20:52.466Z - 11-12-2019

దిశ ఎన్ కౌంటర్‌ ఎఫెక్ట్:  హత్య కేసులో నిందితుడి ఆత్మహత్య
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో మహిళలు, పిల్లలు, వృద్ధులపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఈ తరహా ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. దిశ కేసు సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వెటర్నరీ డాక్టర్ ను అఘాయిత్యం చేసి, దారుణంగా హత్యచేసి, దహనం చేయడంపై ప్రజాసంఘాలు మండిపడ్డాయి.

ఈ ఘటన తర్వాత పోలీసులు నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేశారు. ఆధారాల సేకరణకు వెళ్ళినప్పుడు నిందితులు పోలీసులపై దాడి చేసినప్పుడు పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ దాడిలో నలుగురు హంతకులు హతమయ్యారు.

ఇలాంటి కేసులో ఎన్ కౌంటర్ లేదా ఉరి సరి అని అంతా భావిస్తున్న వేళ సిద్దిపేటకు చెందిన లక్ష్మీరాజ్యం అనే వ్యక్తి... తనను ఎక్కడ పోలీసులు పట్టుకొని ఎన్ కౌంటర్ చేస్తారేమో అనే భయంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో విషాదం నెలకొంది. లక్ష్మీరాజ్యం గతనెల 21 వ తేదీన ఖమ్మంపల్లిలో తన భార్య పిల్లలను అతి దారుణంగా హత్య చేశాడు. 

హత్యచేసి అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. దిశ ఘటన తరువాత లక్ష్మీరాజ్యం కు భయం పట్టుకుంది.  తనను ఎక్కడ పోలీసులు ఎన్ కౌంటర్ చేస్తారో అనే భయంతో కొండగట్టు వద్ద ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. 

దిశ ఎన్ కౌంటర్, నిందితుల మృతదేహాల అప్పగింతపై హైకోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. అత్యంత భద్రత నడుమ నిందితుల మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు పోలీసులు.

శుక్రవారం వరకు గాంధీ ఆస్పత్రిలోనే నిందితుల మృతదేహాలను భద్రపరుస్తారు. అందుకు తగిన ఏర్పాట్లు చేసింది పోలీసు శాఖ. ఈ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ ఉన్నందున కేసు వాయిదా వేసింది హైకోర్టు. తాజా పరిణామాలతో మరోసారి అంత్యక్రియలకు బ్రేక్‌లు పడ్డాయి. నిందితుల తల్లిదండ్రులు మాత్రం మృతదేహాలను తమకు చూపించకుండా పోలీసులు కాలయాపన చేస్తున్నారని మండిపడుతున్నారు.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle