newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

దిగి పోవడానికి ఉత్తమ్ రెడీ.. పీఠం ఎవరిదో?

11-11-201911-11-2019 09:18:07 IST
2019-11-11T03:48:07.467Z11-11-2019 2019-11-11T03:48:02.278Z - - 22-02-2020

దిగి పోవడానికి ఉత్తమ్ రెడీ.. పీఠం ఎవరిదో?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి ఎవరికో?

ఉత్తమ్ దిగిపోవడానికి సిద్ధమైనట్టేనా?

ఆ ముగ్గురిలో పీఠం ఎవరికి దక్కేనో?

సోనియా, రాహుల్ ప్లానేంటి?

పద్మావతి ఓటమికి నైతిక బాధ్యత?

రేవంత్ కి పదవి దక్కుతుందా? 

టీపీసీసీ పీఠం ఎవరికి దక్కుతుందోనని తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో భార్య ప్రభావతిని గెలిపించుకోలేకపోవడం ఉత్తమ్ కీలక నిర్ణయానికి కారణం అయిందని భావిస్తున్నారు.  కంచుకోట లాంటి చోట గెలవలేకపోవడంతో ఉత్తమ్ పదవి నుంచి వైదొలగడానికి సిద్ధమయ్యారు.  పీసీపీ చీఫ్ పదవి నుండి తప్పుకుంటున్నట్లుగా ఉత్తమ్ నేరుగా పార్టీ అధినేత్రి సోనియాకు సమాచారం అందించారని సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణకు కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక మీద కసరత్తు ముమ్మరం చేసింది.

తెలంగాణ ప్రాంతానికి చెందిన ముఖ్య నేతలు, సీనియర్ల అభిప్రాయాలు సేకరించే పనిలో పడింది. పీసీసీ అధ్యక్ష పదవిని ఎవరికి ఇవ్వాలనేదానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ అవసానదశకు చేరుకున్న వేళ బలమయిన, సమర్ధవంతమయిన నేతకు ఇవ్వాలని యోచిస్తోంది. పీసీసీ రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. అందులో మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డితో పాటు మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్ బాబు పేర్లు ఉన్నాయని తెలుస్తోంది. 

2018లోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవీకాలం పూర్తయిన సంగతి తెలిసిందే. 2018 ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అధిష్ఠానం ఉత్తమ్ నే కొనసాగించింది. ఎన్నికల్లో అనుకున్నంతగా పార్టీ రాణించలేకపోయింది. ఒక్కొక్కరుగా పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. దీంతో విపక్ష హోదా కూడా గల్లంతయింది.

ఇదే సమయంలో హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక వచ్చిపడింది.  ఈఎన్నికల్లో భార్య పద్మావతి రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు. కానీ ఈ ఎన్నికలో ఓటమి తర్వాత ఉత్తమ్‌.. ఆయన సతీమణి పద్మావతి.. ఢిల్లీ వెళ్లి అధినేత్రి సోనియాను కలిశారు. ఈ సందర్భంగా పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్టు సమాచారం ఇచ్చారని సమాచారం. 

ఇటీవల సిడబ్ల్యూసీ నేత  గులాం నబీ ఆజాద్‌ హైదరాబాద్‌కు పర్యటన సందర్భంగా టీపీసీసీ చీఫ్ మార్పు గురించి ప్రస్తావించారు. త్వరలో జరగబోయే మునిసిపల్‌ ఎన్నికలకు ముందే టీపీసీసీకి కొత్త సారథిని నియమించడం ఖాయంగా కనిపిస్తోంది. పీసీసీ పదవి రేసులో మరో నేత కూడా చేరిపోయారు. ఆజాద్ కి స్వయంగా ఈ విషయం చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

అయితే ఈసారి పదవిని రెడ్డి సామాజిక వర్గానికి కాకుండా బీసీ వర్గానికి చెందినవారికి ఇవ్వాలని హనుమంతరావు లాంటి సీనియర్ నేతలు కోరుతున్నారు. మరో సీనియర్ నేత మాజీ ఎంపీ మధు యాష్కీ కూడా సోనియా దగ్గర లాబీయింగ్ చేయిస్తున్నారు. బీసీ కోటాలో మధుయాష్కీ తనకు పదవి గ్యారంటీ అని భావిస్తున్నారు. త్వరలో పీసీసీ పదవి ఎవరికి ఇస్తారో తేలిపోనుంది. అయితే ఈ ఎంపిక అంత ఈజీ కాదని కాంగ్రెస్ నేతలే అభిప్రాయపడుతున్నారు. 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   4 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   5 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   6 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   7 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   7 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   8 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   9 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   10 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   10 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   11 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle