newssting
Radio
BITING NEWS :
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో 55.69 శాతం పోలింగ్‌ నమోదైనట్టు తెలిపిన ఎన్నికల కమిషన్‌. కరోనా వైరస్‌ భయాలు ఉన్నప్పటికీ పోలింగ్‌ మాత్రం ఇంతకు ముందుకన్నా ఎక్కువే నమోదైనట్టు తెలుస్తోంది. తొలి దశలో 16 జిల్లాల్లో విస్తరించిన 71 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగగా సంబంధిత నియోజకవర్గాల్లో గతంలోకంటే ఈసారి పోలింగ్ శాతం అధికంగా నమోదు * తమ పార్టీ తరఫున బరిలో నిలిచిన రాంజీ గౌతమ్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఏడుగురు ఎమ్మెల్యేలను బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. కీలకమైన రాజ్యసభ ఎన్నికల సమయంలో ఎస్పీ తీర్థం పుచ్చుకోవడానికి వీరు ప్రయత్నిస్తున్నట్టు తెలియగానే ఆమె ఈ నిర్ణయం తీసుకొన్నారు * కార్మిక నాయకుడు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ముఖ్య సహచరుడు ఎస్‌.బీ మోహన్‌రెడ్డి(78) గురువారం తెల్లవారుజామున మరణించారు. ఆరునెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్‌ రెడ్డి ఆరోగ్యం విషమించగా ఆంధ్రమహిళా సభ దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు * జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని వైకే పొరా ప్రాంతంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులు జరిపి ముగ్గురు స్థానిక బీజేపీ నేతల ప్రాణాలు తీశారు. పాకిస్థాన్‌ ఇంటెలిజన్స్‌ ఏజెన్సీ మద్దతున్న రెసిస్టంట్‌ ఫ్రంట్‌ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యతవహిస్తూ ప్రకటన చేసిందని పోలీసులు చెప్పారు * తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్‌ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి బృందానికి చెందిన మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు * డోసుల కొరత కారణంగా.. స్పుత్నిక్‌-వి టీకా మూడో దశ ట్రయల్స్‌ను రష్యా తాత్కాలికంగా నిలిపివేసింది. నవంబరు 10వ తేదీ నుంచి ట్రయల్స్‌ను పునరుద్ధరించనున్నారు. గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, రష్యన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకాను రష్యా ఆగస్టు నెలలో నమోదు చేసింది * మద్యం ధరలను క్రమబద్ధీకరిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. సవరించిన ధరలు ప్రీమియం, మీడియం బ్రాండ్లకు వర్తించేలా ఉత్తర్వులిచ్చింది. ఇవి శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో పేర్కొంది * మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలు, ర్యాలీ సందర్భంగా పాతబస్తీలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

దిగిపోయేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లే..!

27-10-201927-10-2019 18:05:35 IST
2019-10-27T12:35:35.993Z27-10-2019 2019-10-27T12:35:24.357Z - - 30-10-2020

దిగిపోయేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ పీసీసీ అధ్య‌క్షులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారట‌. ఇక‌, అధ్య‌క్ష పీఠం నుంచి దిగిపోయేందుకు సిద్ధంగా ఉన్నార‌ట‌. ఈ విష‌యాన్ని అధిష్ఠానికి కూడా ఆయ‌న తేల్చి చెప్పార‌ని అంటున్నారు.

త్వ‌ర‌లోనే ఉత్త‌మ్ కుమార్ రెడ్డి స్థానంలో రాష్ట్ర కాంగ్రెస్‌కు కొత్త సార‌థి రానున్నారు. అయితే, మున్సిప‌ల్ ఎన్నిక‌ల త‌ర్వాత‌నా, లేక‌పోతే ముందే ఉత్త‌మ్ దిగిపోతారా అనేదే తేలాల్సి ఉంది.

గాంధీ కుటుంబానికి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అత్యంత న‌మ్మ‌క‌స్తుడు. అందుకే ఆయ‌న‌కు పార్టీ మంచి అవ‌కాశాలు ఇచ్చింది. 2014 ఎన్నిక‌ల ముందు పీసీసీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్‌గా బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఆ ఎన్నిక‌ల్లో పార్టీ ఓడినా ఆ బాధ్య‌త‌ను అప్ప‌టి పీసీసీ అధ్య‌క్షుడు పొన్నాల ల‌క్ష్మ‌య్య‌పై పెట్టి వెంట‌నే ఆయ‌న‌ను ప‌ద‌వి నుంచి త‌ప్పించింది.

వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ ఉత్త‌మ్‌కే అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఆయ‌న ఈ ప‌ద‌వి చేప‌ట్టి ఐదేళ్లు అవుతుంది. ఈ ఐదేళ్ల కాలంలో ఉత్త‌మ్ అనేక ప్ర‌తికూల‌త‌ల న‌డుమ పార్టీని న‌డిపిస్తున్నారు. ఉత్త‌మ్ సార‌థ్యంలో రెండు ఉప ఎన్నిక‌లు, జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు ఓడిన‌ప్పుడే పార్టీలో ఆయ‌న‌కు వ్య‌తిరేకులు అంతా ఉత్త‌మ్‌ను దింపాల‌నే డిమాండ్‌ను తెచ్చారు.

కానీ అధిష్ఠానం మాత్రం ఆయ‌న‌నే కొన‌సాగిస్తూ వ‌స్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీ దారుణ ఓట‌మి, త‌ర్వాత ఎమ్మెల్యేల వ‌ల‌స‌లు నియంత్రించ‌లేక‌పోవ‌డంతో ఉత్త‌మ్ కుమార్ రెడ్డిని మార్చాల‌నే ఒత్తిడి అధిష్ఠానంపై మ‌రింత పెరిగింది. ఇంత‌లో పార్ల‌మెంటు ఎన్నిక‌లు రావ‌డం, కాంగ్రెస్ మూడు ఎంపీ స్థానాలు గెలుచుకోవ‌డంతో ఉత్త‌మ్ ఈ ప‌ద‌విలో కొన‌సాగుతున్నారు.

ఉత్త‌మ్ రాజీనామాతో ఖాళీ అయిన స్వంత నియోజ‌క‌వ‌ర్గం హుజూర్‌న‌గ‌ర్‌లో ఆయ‌న స‌తీమ‌ణిని గెలవ‌క‌పోవ‌డంతో ఆయ‌న నైతిక బాధ్య‌త వ‌హిస్తూ రాజీనామాకు సిద్ధ‌మ‌య్యారు. ఢిల్లీ వెళ్లిన ఆయ‌న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని క‌లిసి పార్టీ ప‌రిస్థితి, హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌పై నివేదిక ఇవ్వ‌నున్నారు.

త‌న ప‌ద‌వీకాలం ముగిసినందున పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాల‌నుకుంటున్న‌ట్లు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి చెప్ప‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, మ‌రో నెల‌లోనే మున్సిప‌ల్ ఎన్నిక‌లు ఉన్నందున ఈ ఎన్నిక‌లు అయిపోయే వ‌ర‌కు ఉత్త‌మ్‌ను కొన‌సాగించ‌వ‌చ్చు. ఇక‌, ఉత్త‌మ్ త‌ప్పుకోవ‌డం ఖ‌రార‌వ‌డంతో ఆయ‌న స్థానంలో కొత్త‌గా ఎవ‌రు ఈ ప‌ద‌విని చేప‌డ‌తార‌నే చ‌ర్చ పార్టీలో జ‌రుగుతోంది.

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle