newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

దావోస్‌లో బిజీబిజీ.. కేటీఆర్‌కి అరుదైన అవకాశం

24-01-202024-01-2020 08:46:48 IST
Updated On 24-01-2020 10:29:49 ISTUpdated On 24-01-20202020-01-24T03:16:48.722Z24-01-2020 2020-01-24T03:15:22.535Z - 2020-01-24T04:59:49.031Z - 24-01-2020

దావోస్‌లో బిజీబిజీ.. కేటీఆర్‌కి అరుదైన అవకాశం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ఖ్యాతిని ప్రతిబింబించేలా పెట్టుబడులను ఆహ్వానిస్తూ దావోస్ వరల్డ్‌ ఎకనామిక్‌ లీడర్స్‌’ భేటీలో మంత్రి కేటీయార్ బిజీబిజీగా ఉంటున్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేని అవకాశం కేటీయార్ కి దక్కింది. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం నుంచి ప్రత్యేక ఆహ్వానం మేరకు కేటీయార్ గురువారం జరిగిన ‘వరల్డ్‌ ఎకనామిక్‌ లీడర్స్‌’ సమావేశంలో తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలు, ప్రభుత్వ విధానాలను వెల్లడించారు.

‘సాంకేతిక అభివృద్ధి వేగాన్ని కొనసాగించడం–సాంకేతిక ఆధారిత పరిపాలన’ అనే అంశంపై ఈ సమావేశాన్ని నిర్వహించారు. సాధారణంగా ఈ సమావేశా నికి ప్రభుత్వాధినేతలు, కేంద్ర ప్రభుత్వ అధికారులు, సీనియర్‌ మంత్రులను మాత్రమే ఆహ్వానిస్తారు. ఈ సమావేశానికి హాజరైనవారిలో రాష్ట్ర మంత్రి స్థాయిలో కేటీఆర్‌ ఒక్కరే ఉండటం అరుదైన గౌరవమని అంటున్నారు. . ఈ సమావేశం కోసం మంత్రి కేటీఆర్‌కి డబ్ల్యూఈఎఫ్‌ ప్రత్యేక బ్యాడ్జ్‌ను అందించింది. ఈ సమావేశంలో తెలంగాణకు చెందిన వివిధ ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. 

డబ్లూఈఎఫ్ భేటీలో సెర్బియా, పోలాండ్‌ తదితర దేశాల ప్రధానులతోపాటు బ్రెజిల్, సింగపూర్, కొరియా, ఇండోనేసియా, బోట్సా్వనా, ఒమన్, ఇథియోపియా దేశాలకు చెందిన పలువురు సీనియర్‌ కేంద్రమంత్రులు పాల్గొన్నారు.  పారిశ్రామిక వేత్తలు, వివిధ దేశాల ప్రముఖులను తెలంగాణకు ఆహ్వానించారు. హైదరాబాద్‌ నగరంలో ఉన్న వ్యాపార, వాణిజ్య అవకాశాల పరిశీలనకు రావాలని కోరారు. మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర, డెన్మార్క్‌కు చెందిన మల్టీనేషనల్‌ ఫార్మా కంపెనీ నోవో నోర్‌ డిస్క్‌ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు క్యమీల సిల్వెస్తోతో సమావేశమయ్యారు.

రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సర్కిల్‌ ఆఫ్‌ హైదరాబాద్‌, బయోఆసియాతో భాగస్వామ్యానికి సంబంధించి నోవో నోర్‌ డిస్క్‌ కంపెనీతో చర్చించారు. మైక్రాన్‌ టెక్నాలజీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సంజయ్‌ మహోత్ర, కోకోకోలా సీఈవో జేమ్స్‌ క్వెన్సి, ప్రముఖ సామాజిక మాధ్యమం యూట్యూబ్‌ సీఈవో సుసాన్‌ వొజ్విక్కితో సమావేశమయ్యారు. హైదరాబాద్‌ నగరం తమకు ప్రాధాన్యత ప్రాంతమని జేమ్స్‌ క్వెన్సి కేటీఆర్‌కు తెలిపారు.

ప్రముఖ వ్యాక్సిన్‌ తయారీ కంపెనీ సనొఫి ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డేవిడ్ కేటీయార్ తో చర్చించారు. ఫార్మాస్యూటికల్‌ రంగంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్‌ వంటి అనేక అంశాలు వీరిమధ్య ప్రస్తావనకు వచ్చాయి. ఈ పర్యటన తర్వాత తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు మరిన్ని సంస్థలు ముందుకు కావడం ఖాయంగా చెబుతున్నారు. 

 

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   5 hours ago


బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

   7 hours ago


వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

   10 hours ago


అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

   12 hours ago


తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

   12 hours ago


సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

   13 hours ago


ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   13 hours ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   14 hours ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   14 hours ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   14 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle