దాడుల నుండి ప్రశంసల దాకా.. డాక్టర్లపై మారిన వైఖరి!
03-05-202003-05-2020 08:52:41 IST
Updated On 03-05-2020 10:38:22 ISTUpdated On 03-05-20202020-05-03T03:22:41.169Z03-05-2020 2020-05-03T03:22:37.523Z - 2020-05-03T05:08:22.029Z - 03-05-2020

దేశంలో ఇప్పుడు వైద్యులు, వైద్య సిబ్బందిని కరోనా వారియర్స్ అని పిలుస్తున్నారు. ఒకవిధంగా వీరంతా కూడా ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు చికిత్స అందిస్తూ వైరస్ మీద యుద్ధం చేస్తున్నారు. వీరిలో కొందరు కన్న బిడ్డలను, ఇంటికి కూడా దూరంగా ఉంటూ ఆసుపత్రులలోనే రోజుల తరబడి సేవలు అందిస్తున్నారు. అందుకే వారిని వారియర్స్ అని పిలుస్తున్నారు. అయితే, మహమ్మారి మన దేశంలో అడుగుపెట్టిన తొలిరోజుల్లో వైద్యులను, వైద్య సిబ్బందిని సమాజంలో కొందరు చిన్న చూపు చూశారు. కరోనా అంటూ వ్యాధి కనుక రోగులకు చికిత్స అందించే క్రమంలో వీరికి కూడా వైరస్ సోకుతుందేమో.. వీరి వలన తమకి కూడా హాని జరిగే అవకాశాలు ఉన్నాయనే భావనలో కొందరు వీరిని తమ పరిసరాలకు వచ్చేందుకు ఇష్టపడలేదు. సహజంగానే నగరాలలో అపార్ట్మెంట్ కల్చర్, లేదా కమ్యూనిటీ కల్చర్ ఉండడంతో అలాంటి ప్రాంతాలలో ఉన్న వైద్యులు, సిబ్బంది ఆ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డారు. వీరిని చూస్తే కొందరు దూరంగా వెళ్లడమే కాక.. మాటలతో ఇబ్బందిపెట్టిన సందర్భాలు కోకొల్లలు మాధ్యమాల ద్వారా వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితిలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. నేటి పరిస్థితులలో వైద్యుల విలువ, వారి గొప్పదనం తెలుసుకొనే స్థాయికి సమాజం చేరుకుంది. అందుకే దేశవ్యాప్తంగా పలుచోట్ల వారికి సత్కారాలు, సన్మానాలు, అభినందనలు, చప్పట్లతో సంఘీభావం తెలుపుతున్నారు. తాజాగా మన హైదరాబాద్‌లో గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగులకు వైద్యం అందిస్తున్న విజయశ్రీ అనే వైద్యురాలికి తమ ఇంటి పరిసరాల ప్రజలు పెద్దఎత్తున చప్పట్లతో అభినందించారు. గత రెండు వారాలుగా ఆమె గాంధీలోనే ఉండి కరోనా రోగులకు వైద్యం అందించారు. నిన్న ఇంటికి వెళ్లడంతో ముండుగే చుట్టూ అపార్టుమెంట్ల ప్రజలకు సమాచారం అందడంతో ఆమెకి చట్టట్లతో స్వాగతం పలికారు. దీనికి ఆమె ఆనందంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి విపత్కర సమయంలో వైద్యులే నిజమైన దేవుళ్ళు. అలాంటి వారికి కనీసం అభినందన మర్యాద.. అదే వారికి నిజమైన అండ. తన కోసం చుట్టూ అందరూ ఉన్నారని వారికి దక్కే భరోసానే ఎన్నో ప్రాణాలను నిలబెడుతుంది. అదే డాక్టర్ విజయశ్రీ కళ్ళలో కనిపించింది. ఇక ఈరోజే దేశవ్యాప్తంగా కరోనా వారియర్స్ కు దేశ ఆర్మీ ఘనంగా సంఘీభావం ప్రకటించనుంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నేడు దేశవ్యాప్తంగా ఫ్లైపాస్ట్ అనే కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఫైటర్స్, ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో దేశంలో కరోనాకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రులపై హెలికాఫ్టర్లతో పూల వర్షం కురిపించనున్నారు. ఇక సాయంత్రం వేళల్లో తీర ప్రాంతాలైన ముంబయి, పోరుబందర్, కార్వార్, విశాఖపట్నం, చెన్నై, కొచ్చి, పోర్ట్ బ్లెయిర్ పోర్టుల్లో లైట్ హౌజ్‌లను వెలిగించి కరోనా వారియర్స్ ను ఘనంగా అభినందించనున్నారు.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
13 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
9 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
11 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
14 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
16 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
18 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
19 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
20 hours ago

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
21 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
a day ago
ఇంకా