దశాబ్దాల కల సాకారం.. స్పైసెస్ బోర్డుకి కేంద్రం గ్రీన్ సిగ్నల్
04-02-202004-02-2020 19:03:08 IST
2020-02-04T13:33:08.271Z04-02-2020 2020-02-04T13:33:05.468Z - - 18-04-2021

ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న పసుపు రైతుల కల సాకారం అయింది. స్పైసెస్ ప్రాంతీయబోర్డు ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ముదావహం. స్పైసెస్ బోర్డు విస్తరణపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. నిజామాబాద్ కేంద్రంగా స్పైస్ ప్రాంతీయ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ బోర్డు పసుపు పంట ఎగుమతులపై ప్రత్యేక దృష్టితో పనిచేస్తుందని చెప్పారు. పసుపు సహా మిగతా మసాలా దినుసుల కోసం కార్యాలయం పనిచేస్తుందన్నారు. పసుపు బోర్డుకు మించిన ప్రయోజనాలు స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం ద్వారా లభిస్తాయన్నారు. పసుపు పంట నాణ్యత, దిగుబడి పెంచే విషయంలో బోర్డు ప్రాంతీయ కార్యాలయం పని చేస్తుందన్నారు. పంట దిగుబడి వచ్చిన తర్వాత ఎగుమతులకు బోర్డు అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. రైతులకు అంతర్జాతీయ బయ్యర్లతో సమావేశం ఏర్పాటు చేసి అధిక ధరలు లభించేలా తోడ్పడుతుందన్నారు. నిజామాబాద్ రైతులు కోరిన దానికంటే ఎక్కువ ప్రయోజనాలు కల్పించామని చెప్పారు. రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించేందుకు మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందనడానికి ఇదే నిదర్శనం అంటున్నారు బీజేపీ నేతలు. గత అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పసుపు బోర్డు ఏర్పాటుచేస్తామని టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్ధులు హామీలు ఇచ్చారు. నిజామాబాద్, కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపునకు ఈ హామీయే కారణంగా చెబుతున్నారు. కేంద్రం కీలక ప్రకటనతో బీజేపీ ఇమేజ్ పెరుగుతుందని భావిస్తున్నారు.

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం
3 hours ago

చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!
4 hours ago

షర్మిల ఆరోగ్య పరిస్థితి ఇది..!
an hour ago

తిరుపతి పార్లమెంట్ ఎన్నికను రద్దు చేయాలి.. పెద్దిరెడ్డిపై విరుచుకుపడ్డ చంద్రబాబు
4 hours ago

జానారెడ్డి చేతిలో.. రేవంత్ రెడ్డి భవిష్యత్
5 hours ago

అబ్బో సమస్యలపై కూడా జగన్ ఫోకస్ చేస్తున్నారా
6 hours ago

కోవిడ్ ను ఎదుర్కోవడంలో మోడీ సర్కారు విఫలం.. సోనియా గాంధీ
19 hours ago

కోరలుచాస్తున్న కరోనా.. బెంగాల్ లో ఐదో దశ పోలింగ్ .. నిబంధనలు పట్టని పార్టీలు
a day ago

దొంగ ఓట్ల రచ్చ.. స్పందించిన పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి
21 hours ago

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు
a day ago
ఇంకా