newssting
BITING NEWS :
*ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..రాష్ట్రపతి భవన్‌ లో విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌ *రెండవ రోజు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన *దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌ *తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల్లో నేడు నామినేషన్ల స్వీకరణ * కుప్పంలో రెండోరోజు పర్యటించనున్న చంద్రబాబు* ఏపీ స్థానికల రిజర్వేషన్లపై తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఫాలో అప్ *వివేకా హత్యకేసుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు *ఇవాళ హైదరాబాద్ హౌస్ లో మోదీతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు *ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ గా రామ్‌ నివాస్‌ గోయల్ ఏకగ్రీవ ఎన్నిక*అమరావతి: 70వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతుల ధర్నాలు*వికారాబాద్: కొడంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. బీజాపూర్ - హైదరాబాద్ హైవేపై కారును ఢీకొట్టిన లారీ. భార్యాభర్తలకు తీవ్రగాయాలు. హాస్పిటల్ కు తరలింపు*భారతీయ సినిమాలు గ్రేట్.. దిల్‌వాలే దుల్హనియా, షోలే చిత్రాలు గొప్పవి-డొనాల్డ్ ట్రంప్

దమ్ముంటే ఆధారాలు చూపండి.. ఆడియోపై మంత్రి మల్లారెడ్డి

17-01-202017-01-2020 09:06:39 IST
2020-01-17T03:36:39.913Z17-01-2020 2020-01-17T03:36:34.837Z - - 25-02-2020

దమ్ముంటే ఆధారాలు చూపండి.. ఆడియోపై మంత్రి మల్లారెడ్డి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. బీఫారాల విషయంలో టీఆర్ఎస్ నేతలు మంత్రి మల్లారెడ్డిపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. బీఫారాలకు సంబంధించి బయటపడ్డ మంత్రి మల్లారెడ్డి ఆడియో కలకలం రేపుతోంది.  మేడ్చల్ పురపాలక సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ నేతలు-మల్లారెడ్డి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తనపై ఆధారాలు లేవు కాబట్టే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని. పార్టీలో కష్టపడి పని చేసిన వారికే మున్సిపల్ ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చామంటున్నారు మల్లారెడ్డి. 

.నా పని తనం చూసే ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు మంత్రి పదవి ఇచ్చారని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు మల్లారెడ్డి. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు..ఎవరో దారిలో పోయే దానయ్య ఆరోపణలు చేస్తే నేను సమాధానం చెప్పాలా?.కేసీఆర్, కేటీఆర్ ఆధ్వర్యంలో రాష్టాన్ని అభివృద్ధి చేస్తున్నాం అన్నారు. టిఆర్ఎస్ లో బి ఫారాల కోసం కాంపిటీషన్ బాగా ఉంది..అందర్ని కలుపుకుని ముందుకు పోతున్నాం..నామీద ఆరోపణలు చేసిన వ్యక్తులు ఆధారాలు బయట పెట్టాలని మల్లారెడ్డి సవాల్ చేశారు. 

మంత్రి మల్లారెడ్డి, టీఆర్ఎస్ నేత రాపోలు రాములకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ తాజాగా బయటకు పొక్కడంతో ఈ టేప్ సంచలనం రేపుతోంది. తన తరపు వారికి టికెట్లు ఇవ్వకపోవడంపై రాపోలు రాములు మంత్రిని ఫోన్‌లో నిలదీశారు. ‘‘నీపై నమ్మకం పోయింది. నా వారిలో ఎవరికి టికెట్ ఇప్పించావు చెప్పు..’’ అని రాపోలు నిలదీయగా, తొందర పడవద్దంటూ మంత్రి వారించారు. కానీ వీరద్దరి మధ్య జరిగిన సంభాషణ గులాబీ శ్రేణుల్లో గుబులు రేపుతోంది. మల్లారెడ్డి వ్యవహారమంతా పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెప్తానని, త్వరలో ఆయన్ను కలుస్తానని ఫోన్‌లో రాపోలు హెచ్చరిస్తే చెప్పుకుంటే చెప్పుకోమని బదులిచ్చారు మంత్రి మల్లారెడ్డి. 

టికెట్ కోసం తన వద్ద డబ్బు డిమాండ్ చేసిన తాలూకు రికార్డులు ఉన్నాయని, వాటిని అధిష్ఠానానికి చెప్తానని బెదిరించారు. తనపై పోలీసు నిఘా పెట్టినా ప్రజల కోసం తాను జైలుకు వెళ్లేందుకు సైతం సిద్ధమేనని రాపోలు అంటున్నారు. ఇంతకీ రాములు వద్ద ఉన్న ఆడియో టేప్ లను అధిష్టానం పరిశీలిస్తుందా? మంత్రి మల్లారెడ్డిని వివరణ కోరుతుందా? వేచి చూడాలి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle