newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

త‌న‌యుడి బాట‌లో తండ్రి....కేసీఆర్‌తో ‘ఢీ’ఎస్

20-08-201920-08-2019 09:21:05 IST
Updated On 20-08-2019 11:06:45 ISTUpdated On 20-08-20192019-08-20T03:51:05.611Z20-08-2019 2019-08-20T03:44:16.410Z - 2019-08-20T05:36:45.157Z - 20-08-2019

త‌న‌యుడి బాట‌లో తండ్రి....కేసీఆర్‌తో ‘ఢీ’ఎస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో ఒక‌ప్పుడు చ‌క్రం తిప్పిన నేత‌. ఉమ్మ‌డి రాష్ట్ర పీసీసీ అధ్య‌క్షుడిగా బీఫామ్‌లు త‌న చేతుల మీదుగా పంచిన నేత‌. రెండుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డంలో త‌న వంతు పాత్ర పోషించిన చ‌రిత్ర ఆయ‌న‌ది.

అనేక‌సార్లు సీఎం రేసులో సైతం నిలిచారు. అయితే, ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయ్యింది. ఎవ‌రా నేత అనుకుంటున్నారా..? నిజామాబాద్ డి.శ్రీనివాస్‌. ఆయ‌న అనుచ‌రులు శీన‌న్న అని పిలుచుకుంటారు. రాష్ట్ర‌వ్యాప్తంగా ఒకానొక స‌మ‌యంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక వ‌ర్గాన్ని ఏర్పాటు చేసుకున్న డీఎస్ ఇప్పుడు రాజ‌కీయంగా ఒడిదొడుకులు ఎదుర్కుంటున్నారు.

ఎంతోమందికి రాజ‌కీయ జీవితాన్ని ఇచ్చిన ఆయ‌న ఇప్పుడు త‌న‌యుడి చేయి ప‌ట్టుకొని న‌డ‌వాల్సిన ప‌రిస్థితి. టీఆర్ఎస్‌లో ఉన్నారో లేరో ఆయ‌న‌కే క్లారిటీ లేని స‌మ‌యంలో ఇప్పుడు ఆయ‌న భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేర‌డం లాంఛ‌న‌మే అయ్యింది. ఈ విష‌యాన్ని ఆయ‌న కుమారుడు, నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే బీజేపీ జాతీయ అధ్య‌క్షులు అమిత్ షాను క‌లిసిన డీఎస్ త్వ‌ర‌లోనే కాషాయ కండువా క‌ప్పుకోనున్నారు.

కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం వ‌ద్ద మంచి ప‌ట్టుండే డీఎస్ రాజ‌కీయ జీవితానికి వ‌రుస ఓట‌ములు పెద్ద దెబ్బ తీశాయి. 2009, 2014 ఎన్నిక‌ల‌తో పాటు 2012 ఉప ఎన్నిక‌ల్లో ఓడిన ఆయ‌న ఓట‌ముల్లో హ్యాట్రిక్ న‌మోదు చేశారు.

కాంగ్రెస్‌లో ప్రాధాన్య‌త త‌గ్గిందని భావించిన ఆయ‌న టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. పెద్ద నేత కావ‌డంతో కేసీఆర్ కూడా ఆయ‌న‌కు బాగానే ప్రాధాన్య‌త ఇచ్చి వెంట‌నే రాజ్య‌స‌భ‌కు పంపించారు.

ఆయ‌న చిన్న కుమారుడు అర్వింద్ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన తర్వాత తండ్రీకొడుకులు వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. అయితే, టీఆర్ఎస్‌లో ఉంటూనే బీజేపీలో ఉన్న త‌న కుమారుడికి లోపాయికారీగా స‌హ‌క‌రిస్తున్నార‌ని స్థానిక టీఆర్ఎస్ నేత‌లు భావించి ఆయ‌నపై స‌స్పెన్ష‌న్ వేటు వేయాల్సిందిగా కేసీఆర్‌ను కోరారు.

అయితే, స‌స్పెన్ష‌న్ వేటు వేస్తే ఆయ‌న రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కొన‌సాగే అవ‌కాశం ఉంటుంది కాబ‌ట్టి.. ఆయ‌నే పార్టీని వీడేలా చేయాల‌ని టీఆర్ఎస్ భావించింది.

కానీ, డీఎస్ త‌నంత‌ట తాను పార్టీని వీడ‌టం లేదు. ఇటీవ‌ల టీఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశానికి కూడా గ్రూప్‌లో పెట్టిన ఓ మెసేజ్‌ను ఆహ్వానంగా భావించి హాజ‌ర‌య్యారు.

ఇది కూడా త‌న‌పై స‌స్పెన్ష‌న్ వేటు ప‌డ‌కుండా చూసుకోవ‌డానికే. పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న త‌న కుమారుడికి స‌హ‌క‌రించారు. ఇప్ప‌టికే అమిత్ షాను క‌లిసిన డీఎస్ రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాన్ని కోల్పోవాల్సి వ‌స్తుంద‌నే కార‌ణంతో బీజేపీలో చేర‌డం లేదు.

అయితే, ఇక టీఆర్ఎస్ పార్టీ నుంచి బ‌హిష్క‌రించే అవ‌కాశం లేద‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన డీఎస్ తానే రాజీనామా చేయాల‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే విడ‌త‌ల‌వారీగా జిల్లావ్యాప్తంగా త‌న అనుచ‌ర‌గ‌ణాన్ని బీజేపీలోకి పంపించిన ఆయ‌న త్వ‌ర‌లోనే కాషాయ కండువా క‌ప్పుకోనున్నారు.

కుమారుడితో క‌లిసి రాజ‌కీయ ప్రయాణాన్ని కొన‌సాగించ‌నున్నారు. ఇదిలా ఉండ‌గా, డీఎస్ బీజేపీలోకి వెళ్ల‌గానే ఆయ‌న‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేయించేందుకు టీఆర్ఎస్ సిద్ధ‌మ‌వుతోంది.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle