newssting
BITING NEWS :
*ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..రాష్ట్రపతి భవన్‌ లో విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌ *రెండవ రోజు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన *దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌ *తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల్లో నేడు నామినేషన్ల స్వీకరణ * కుప్పంలో రెండోరోజు పర్యటించనున్న చంద్రబాబు* ఏపీ స్థానికల రిజర్వేషన్లపై తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఫాలో అప్ *వివేకా హత్యకేసుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు *ఇవాళ హైదరాబాద్ హౌస్ లో మోదీతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు *ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ గా రామ్‌ నివాస్‌ గోయల్ ఏకగ్రీవ ఎన్నిక*అమరావతి: 70వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతుల ధర్నాలు*వికారాబాద్: కొడంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. బీజాపూర్ - హైదరాబాద్ హైవేపై కారును ఢీకొట్టిన లారీ. భార్యాభర్తలకు తీవ్రగాయాలు. హాస్పిటల్ కు తరలింపు*భారతీయ సినిమాలు గ్రేట్.. దిల్‌వాలే దుల్హనియా, షోలే చిత్రాలు గొప్పవి-డొనాల్డ్ ట్రంప్

త్వరలో తెరుచుకోనున్న బయోడైవర్శిటీ ఫ్లై ఓవర్

19-12-201919-12-2019 15:38:35 IST
Updated On 19-12-2019 15:38:31 ISTUpdated On 19-12-20192019-12-19T10:08:35.724Z19-12-2019 2019-12-19T10:05:41.089Z - 2019-12-19T10:08:31.758Z - 19-12-2019

త్వరలో తెరుచుకోనున్న బయోడైవర్శిటీ ఫ్లై ఓవర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైదరాబాద్ నగరంలో బయో డైవర్శిటీ ఫ్లై ఓవర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం మూతబడ్డ ఈ ఫ్లైఓవర్ ని త్వరలో తెరవనున్నారు. ఇటీవల ఈ ఫ్లైఓవర్ పై రెండుమూడు ప్రమాదాలు జరిగాయి. నూతనంగా ప్రారంభించిన బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై వరుస ప్రమాదాలు వాహనదారులను, ఫ్లై ఓవర్ కింద ప్రయాణించే వారిని భయాందోళనలకు గురయ్యారు.

‘భయో’ డైవర్సిటీ ఫ్లై ఓవర్.. పదిరోజులలో రెండు యాక్సిడెంట్స్

నవంబర్ లో జరిగిన ఘోర ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా మరో 8 మంది గాయపడ్డారు. బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ పై కారు అదుపు తప్పి ఫ్లైఓవర్‌ పైనుంచి పల్టీలు కొట్టి మరో కారుమీద పడింది. 

ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఫ్లైఓవర్‌ కింద ఆటో కోసం వేచి చూస్తున్న మహిళ మరణించింది. పల్టీలు కొట్టిన కారు ఆమె మీద పడడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. పలువురు గాయపడ్డారు. ముందుజాగ్రత్త చర్యగా బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ ను మూసేశారు అధికారులు. ఈ ప్రమాదంపై విచారణ జరిపింది కమిటీ. ఫ్లై ఓవర్‌ నిర్మాణంలో ఎలాంటి లోపం లేదని తేల్చింది. మరో పది రోజుల్లో తెరిచే అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కీలక ప్రకటన చేశారు. 

ఈ ఫ్లై ఓవర్ వంపులు తిరిగి ఉండడం వల్ల 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్ళడం వల్లే ప్రమాదం జరిగిందని కమిషనర్ తెలిపారు. ప్రభుత్వ అనుమతి రాగానే ఫ్లై ఓవర్‌పైకి మళ్లీ వాహనాలను అనుమతి ఇస్తామని ఆయన వెల్లడించారు. మరో పదిరోజుల్లో బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ తెరిచే అవకాశముందని ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు.

బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై హైస్పీడ్‌తో వాహనాలు నడిపిన 540 వాహనాలకు పెనాల్టీలు విధించామని, ఇకనుంచి కూడా పెనాల్టీలు కొనసాగుతాయని తెలిపారు. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై నిపుణుల కమిటీ నివేదిక వచ్చిందని, ఫ్లై ఓవర్‌ డిజైన్‌లో ఎలాంటి లోపం లేదని నిపుణులు తేల్చారన్నారు. అవసరాన్ని బట్టి శని, ఆదివారాలలో ఫ్లై ఓవర్ మూసేస్తామన్నారు.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle